ప్రపంచ అద్భుత నిర్మాణాల్లో పెనా ప్యాలెస్ ఒకటి. ఇది పోర్చుగల్ వైభవాన్ని కళ్లకు కడుతుంది. హంగు, ఆర్భాటాలతో ఉండే ఈ ప్యాలెస్‌ను 1838లో కింగ్ ఫెర్డినాండ్ 2 తన వేసవి విడిది కోసం కట్టించాడట. ఇది ప్రష్యన్ వాస్తుశిల్పి ‘లుడ్విగ్ వాన్ ఎష్పెజ్’ ఆలోచనలకు రూపం.
ఆ కట్టడం మూరిష్, మాన్యులైన్ వంటి ఎన్నో నిర్మాణ శైలుల సమ్మేళనంతో.. గులాబీ, పసుపు రంగుల్లో ఆకట్టుకుంటుంది. ఇది గోపురాలు, మూరిష్ కీహోల్ గేట్స్, టవర్స్ ఇలా చాలా ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇంటీరియర్‌లో విలువైన పింగాణీ, పోర్చుగీస్ శైలి ఫర్నిచర్‌తో కళ్లు తిప్పుకోనివ్వదు.
దీన్ని వీక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తూంటారు. ఆ నిర్మాణం.. ఎత్తైన కొండలపై.. దట్టమైన చెట్ల మధ్య ఉండటంతో ప్రకృతి కూడా ఆ ప్యాలెస్ అందాన్ని రెట్టింపు చేస్తోంది. చుట్టూ పొగమంచు, చల్లని వాతావరణం.. ఆ ప్యాలెస్‌కి అదనపు సొగసులు!
ఇవి చదవండి: ప్లాస్టిక్ ట్యూబ్స్ డిస్పెన్సర్ హోల్డర్..
Comments
Please login to add a commentAdd a comment