Beautiful places
-
ప్రపంచ అద్భుత నిర్మాణాల్లో ఈ 'పెనా ప్యాలెస్' కూడా..
ప్రపంచ అద్భుత నిర్మాణాల్లో పెనా ప్యాలెస్ ఒకటి. ఇది పోర్చుగల్ వైభవాన్ని కళ్లకు కడుతుంది. హంగు, ఆర్భాటాలతో ఉండే ఈ ప్యాలెస్‌ను 1838లో కింగ్ ఫెర్డినాండ్ 2 తన వేసవి విడిది కోసం కట్టించాడట. ఇది ప్రష్యన్ వాస్తుశిల్పి ‘లుడ్విగ్ వాన్ ఎష్పెజ్’ ఆలోచనలకు రూపం.ఆ కట్టడం మూరిష్, మాన్యులైన్ వంటి ఎన్నో నిర్మాణ శైలుల సమ్మేళనంతో.. గులాబీ, పసుపు రంగుల్లో ఆకట్టుకుంటుంది. ఇది గోపురాలు, మూరిష్ కీహోల్ గేట్స్, టవర్స్ ఇలా చాలా ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇంటీరియర్‌లో విలువైన పింగాణీ, పోర్చుగీస్ శైలి ఫర్నిచర్‌తో కళ్లు తిప్పుకోనివ్వదు.దీన్ని వీక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తూంటారు. ఆ నిర్మాణం.. ఎత్తైన కొండలపై.. దట్టమైన చెట్ల మధ్య ఉండటంతో ప్రకృతి కూడా ఆ ప్యాలెస్ అందాన్ని రెట్టింపు చేస్తోంది. చుట్టూ పొగమంచు, చల్లని వాతావరణం.. ఆ ప్యాలెస్‌కి అదనపు సొగసులు!ఇవి చదవండి: ప్లాస్టిక్ ట్యూబ్స్ డిస్పెన్సర్ హోల్డర్.. -
చెక్కేద్దామా.. అందమైన లోకానికి! (ఫోటోలు)
-
వీసా లేకుండానే భారతీయులు ఈ దేశాలకు వెళ్లి రావొచ్చు
ట్రావెలింగ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలితో కలిసి ఇష్టమైన ప్రాంతాలను చుట్టేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. పని ఒత్తిడితో విసిగిపోయి ఉన్న వారికి ఈ విహార యాత్రలు, ప్రయాణాలు ఎంతో ఊరట కలిగిస్తాయి. మన దేశంలో అయితే ఏ ప్రాంతానికి అయినా వెళ్లొచ్చు కానీ విదేశాలకు వెళ్లాలంటే మాత్రం వీసా ఉండాల్సిందే. అయితే వీసాతో పని లేకుండా భారతీయులను మా దేశానికి రండి అంటూ ఆహ్వానం పలుకున్నాయి కొన్ని దేశాలు. అవేంటో చూసేయండి. మలేషియా ఎంత చూసినా తనివి తీరని భౌగోళిక సౌందర్యం మలేషియా. పచ్చని అడవులు, అందమైన ద్వీపాలు,అడవులు.. ఇలా ఎంతో అందమైన పర్యాటక ప్రదేశంగా మలేషియాకు పేరుంది. ఇకపై అక్కడికి వెళ్లాలంటే వీసా అవసరం లేదు. సుమారు 30 రోజుల పాటు అక్కడ సేద తీరవచ్చు. బొలీవియా: ఇక్కడ సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది. సమోవా: దీనిని 'కార్డెల్ ఆఫ్ పాలినేషియా' అని కూడా పిలుస్తారు, సమోవా అనేది ఉత్కంఠభరితమైన ద్వీపాల సమూహం. ఈ ద్వీప దేశానికి వెళ్లడానికి భారతీయులకు వీసా అవసరం లేదు. శ్రీలంక: భారతీయులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు ఇటీవలె శ్రీలంక అనుమతి ఇచ్చింది. కెన్యా: సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది. మారిషస్: భారతీయులకు అతి గొప్ప ఆతిథ్యమిచ్చే ఆహ్లాదకరమైన దేశాల్లో మారిషస్ ఒకటి. అందమైన బీచ్‌లు, అడ్వెంచర్లు ఎన్నో ఉన్న ఈ దేశానికి మీకు వీసా అవసరం లేదు. మారిషస్‌ను వీసా లేకుండా, మీరు గరిష్టంగా 90 రోజులు పర్యటించవచ్చు. ఫిజీ: అందమైన దృశ్యాలు, పగడాలు, దీవులకు పెట్టింది పేరు ఫిజీ దేశం. ఈ దేశానికి భారతీయ పర్యాటకుల ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వీసా లేకుండా 120 రోజులు అంటే సుమారు నాలుగు నెలలు హాయిగా గడపొచ్చు. భూటాన్: భారతదేశానికి అత్యంత సమీపంలో, పొరుగు దేశంగా ఉన్న భూటాన్‌కు మీరు వీసా లేకుండానే వెళ్లవచ్చు. ఇది ప్రపంచంలోని సంతోషకరమైన దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.రోడ్డు, విమానం, రైలు ద్వారా కూడా భూటాన్ చేరుకోవచ్చు. బార్బడోస్: బార్బడోస్ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు.ప్రశాంతమైన దీవుల్లో సెలవులను గడపాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. కాస్ట్లీ హోటళ్లు, తీర ప్రాంతాలు ఇక్కడి స్పెషల్. భారతీయ పౌరులు బార్బడోస్ సందర్శించడానికి వీసా అవసరం లేదు. మీరు ఇక్కడ వీసా లేకుండా 90 రోజుల వరకు గడపవచ్చు. వీటితో పాటు జమైకా, కజికిస్తాన్, ఇండోనేషియా,టాంజానియా, జోర్డాన్,లావోస్ కాంబోడియా,వంటి దేశాలకు కూడా వీసా లేకుండా చుట్టిరావొచ్చు. -
దుబాయ్‌లోని టాప్ 10 అందమైన ప్రదేశాలు
-
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని టాప్ 10 అందమైన ప్రదేశాలు
-
మైమరపించే మారేడుమిల్లి అందాలు...
అల్లూరి సీతారామరాజు (మారేడుమిల్లి): నిన్న మొన్నటి వరకు వాడిపోయిన చెట్లకు ఇటీవల కురిసిన వర్షాలు కొత్త ఊపిరులూదాయి. ఏజెన్సీలో ఎటుచూసినా ఆకుపచ్చని తివాచీ పరిచినట్లు ప్రకృతి కనువిందు చేస్తోంది. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, ఒంపులు తిరిగే రహదారులు, జలజలపారే సెలయేర్లు, ఉరికే జలపాతాలు, వాగులు, వంకలతో సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రకృతి అందాలను తిలకించడానికి పర్యాటకులు మారేడుమిల్లికి తరలివస్తున్నారు. ఇక్కడి నుంచి చింతూరు వెళ్లే ఘాట్‌రోడ్డు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.రోడ్డుకు ఇరువైపులా పచ్చదనంతో కూడిన దట్టమైన ఆడవులు, పక్షుల రాగాలు, ఒంపుసొంపుల మార్గంలో సాగే ప్రయాణం, చల్లని వాతావారణంలో తొలకరి చినుకుల మధ్య ఘాట్‌లో ప్రయాణం వాహనచోదకులకు మధురానుభూతిని కలిగిస్తోంది. ఘాట్‌లోని మన్యం వ్యూపాయింట్ నుంచి అందమైన ప్రకృతిని చూసే వారికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. మండలంలో పేరొందిన పర్యాటక ప్రాంతం గుడిస హిల్ టాప్. ఈ ప్రదేశం చాలా ఎత్తులో ఉంటుంది. పై భాగం చదునుగా ఉండి.. చుట్టూ గడ్డి మాత్రమే ఉంటుంది. ఇక్కడ చేతికి అందే ఎత్తులో మేఘాలు వెళుతుంటాయి. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి మెలికలు తిరిగిన ఘాట్ రోడ్డులో ప్రయాణించాలి. ఈ ప్రదేశం పచ్చదనంతో ఎంతో సుందరంగా ఉంది. అయితే ప్రస్తుతం గుడిస సందర్శనకు అనుమతి లేదు. -
క్రొయేషియా ఒక భూతల స్వర్గం
-
ధ్యాన కేంద్రాలుగా పంచమఠాలు
► సౌర విద్యుత్‌పై సత్రాల యజమానులకు అవగాహన ► శ్రీశైలంలో మరింత ఆధ్యాత్మిక వాతావరణం ► కాలుష్యరహిత క్షేత్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం ► రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ శ్రీశైలం: ఒకప్పుడు విద్య, వైద్య కేంద్రాలుగా ప్రభవిల్లిన పంచమఠాలను ధ్యాన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ సూచించారు. ఇటీవల ఘంటామఠం, వీరభద్రమఠాల జీర్ణోద్ధరణ పనులను దేవస్థానం ప్రారంభించింది. ఈ పనులను దేవస్థానం ఈఓ నారాయణ భరత్ గుప్త, ఈఈ శ్రీనివాసులు, ఉద్యానవనశాఖ అధికారి వెంకట్రాఘవరావులతో కలిసి ఆయన పరిశీలించారు. మాడ వీధుల విస్తరణ పనులు, పుష్కరిణి వద్ద ఉద్యానవన ఏర్పాట్లను పరిశీలించి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జెఎస్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. పంచమఠాలన్నీ ఒకే సముదాయ ప్రాంగణంలో ఉండే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. ఆయా మఠాల చుట్టూ ఉద్యానవనాలను పెంచాలన్నారు. మఠాల వద్ద ఉన్న సహజ నీటి గుండాలను పరిరక్షించి వాటి ప్రాచీనతను కాపాడాల్సిందిగా ఈఓకు సూచించారు. మాడ వీధుల్లో భక్తులు నడిచేందుకు వీలుగా పుట్‌పాత్ ఏర్పాటు చేయాలన్నారు. శ్రీశైల క్షేత్రాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. అతిథిగృహాలు, కాటేజీల్లో సౌర విద్యుత్ వినియోగానికి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. సౌర విద్యుత్ వినియోగంపై స్థానిక సత్రాల యజమానులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. శ్రీశైలప్రభ ఎడిటర్ అనిల్‌కుమార్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చెట్టాపట్టాల్.. చెట్టుల్ గుట్టల్
హాష్ హౌస్ హారియర్స్.. ఈ క్లబ్లో చేరితే చక్కగా ఓ సాయంత్రం సిటీ శివార్లలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్‌కి వెళ్లొచ్చు. అక్కడ మీతో కలసి నడవడానికి, పరుగులు తీయడానికి, ముచ్చట్లు పంచుకోవడానికి దేశ విదేశీయులు సిద్ధంగా ఉంటారు. ఆటలు పాటలతో అలసి సొలసి సేదతీరాలనుకుంటే బీర్‌తో చీర్స్ చెప్పే ఫ్రెండ్సూ ఉంటారు. పాతికేళ్ల వయసున్న ఈ క్లబ్ గురించి తెలిసింది తక్కువ మందికే. ..:: ఎస్.సత్యబాబు చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా అని ప్రశ్నించేవారికి సమాధానం చెప్పే బదులు చేసి చూపించడమే మేలనుకుంటున్నారీ క్లబ్ సభ్యులు. ఈ క్లబ్ పేరు హైదరాబాద్ హాష్ హౌజ్ హారియర్స్.. హాషర్స్ గ్రూప్‌నకు మూలం 1938లో జరిగిన సోల్జర్స్ ఈవెంట్ అని చెబుతారు. 1938 ప్రాంతంలో మలాయ్ స్టేట్స్(ఇప్పటి మలేషియా)లో బ్రిటిష్ ఆర్మీ అధికారులు హాషింగ్ను ప్రారంభించారు. హాషింగ్ అంటే కోసుకు తినడం లేదా వికారమైన పని అనే అర్థం ఉంది. వీకెండ్స్‌లో కలిగే వికారాన్ని తొలగించుకునేందుకు ఈ ఆఫీసర్లు సోమవారం సాయంత్రాల్లో కలసి పరుగులు తీసేవారట. కుందేలు తరహా జంతువుల్ని వేటాడే కుక్కల్ని హారియర్స్ అంటారు. తాము కూడా వేటాడే వాళ్లమే అనే అర్థం ధ్వనించేలా హాష్ హౌజ్ హారియర్స్ అని క్లబ్‌కు పేరు పెట్టారు. వీరిలో మహిళల్ని హారియస్ అని పిలిచేవారు. వీకెండ్ హ్యాంగోవర్స్ నుంచి బయటపడటానికి, బెస్ట్ ఫిట్నెస్ కోసం ఆటలాడి, నోరెండిపోతే దానిని బీర్‌తో చల్లార్చడం, తమకు వయోభారం లేదనిపించేలా చేయడం వంటివి ఈ క్లబ్ ప్రాథమిక లక్ష్యాలు. ప్రారంభమైన కొన్నాళ్లకే ముగిసిపోయిన ఈ హాషింగ్.. 1948లో పునఃప్రారంభమైంది. మళ్లీ కొంత గ్యాప్‌తో 1962లో మరోసారి ప్రారంభమై... అక్కడి నుంచి ఫార్‌ఈస్ట్, సౌత్ పసిఫిక్, నార్త్ అమెరికా... అలా ప్రపంచ వ్యాప్తమైంది. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు రెండు వేలకు పైగా ఈ క్లబ్ చాప్టర్స్ ఉన్నాయి. ఆయా చాప్టర్లు న్యూస్‌లెటర్స్, మ్యాగజైన్స్ ప్రచురిస్తూ, ప్రాంతీయ, ప్రపంచస్థాయి హాషింగ్ ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి. జరిగే విధంబిదీ.. ఈ రన్ కమ్ వాక్ కమ్ జాగ్.. ఒక సెలబ్రేషన్ లాంటిది. ఆటలు, పాటలు, తినడం, తాగడం.. అన్నీ ఇందులో భాగమే. ప్రతి ఆదివారం సాయంత్రం మాత్రమే దీనిని నిర్వహిస్తారు. ఎంచుకున్న స్థలంలో ఒక రోజు ముందుగా కొండల్లో గుట్టల్లో లేక్స్ దగ్గర ఇలా పలు చోట్ల .. పిండి లేదా ముగ్గుపొడితో మార్క్స్ వేస్తారు. వీటిని కనిపెట్టడమే ఈవెంట్ స్పెషాలిటీ. ఈ క్రమంలో గుంపుగా బయలు దేరి, మార్గం మధ్యలో విడిపోతారు. స్లో అయి వెనక పడ్డవాళ్లు ముందున్నవాళ్లని చేరుకోవడం.. మధ్యలో రకరకాల సరదా ఆటలు.. ఇలా గంట నుంచి నాలుగు గంటల దాకా మస్తీ మజా చేస్తారు. ఈవెంట్‌కి విజిల్ నోట బెట్టుకున్న గ్రాండ్‌మాస్టర్ హెడ్. రన్ పూర్తయ్యాక ఆయన అందర్నీ సర్కిల్లో నిలబెడతాడు. ఈ సమయంలోనే కొత్తవారి పరిచయం... పాతవారు సాధించినవి షేర్ చేసుకోవడం ఉంటాయి. ఈ సర్కిల్లో ఉన్నవారు తమాషా పాటలు పాడతారు. ఆటలు ఆడతారు. ఒక్కోసారి ఫన్ కోసం ఐస్బ్లాక్స్ మీద కూచోపెట్టడం వంటి సరదాలుంటాయి. వీరికో రెలిజియస్ అడ్వయిజర్ ఉంటారు. లారీలు, ఆటోలకూ వినియోగించే హారన్ ఈ అడ్వయిజర్ దగ్గర ఉంటుంది. రన్లో వెనకపడినవారిని అప్రమత్తం చేయడానికి హారన్ మోగిస్తారు. ఏజ్.. ట్వంటీఫైవ్... ఈ క్లబ్లో సిటీజనులతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇటలీ, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఉజ్బెకిస్తాన్, కెన్యా, నైజీరియా సభ్యులు సైతం ఉన్నారు. హైదరాబాద్‌కి పాతికేళ్ల క్రితమే వచ్చినా.. ఇప్పుడిప్పుడే దీని యాక్టివిటీస్ ఊపందుకున్నాయి. జోరువానైనా.. మండే ఎండ ఉన్నా.. ఈ ఈవెంట్ వాయిదా పడదు, రద్దు కాదు. ఈ 25 ఏళ్లలో యాక్టివిటీ జరగని ఆదివారం లేదు. ఈ ఫన్నీ ఈవెంట్ కోసం హిమాయత్ సాగర్ లేక్బెల్ట్, గండిపేట నుంచి లంగర్హౌస్కి వచ్చే దారి, చేవెళ్ల ఫారెస్ట్, అనంతగిరి కొండలు. రాచకొండ గుట్టలు.. వంటివన్నీ వీరు ఓ రౌండ్ వేసేశారు. గత ఆదివారం శామిర్‌పేటలో రన్ నిర్వహించారు. కనీసం 30 మందికి తగ్గకుండా వీటిల్లో పాల్గొంటారు. ఒక్కోసారి వీరి సంఖ్య వందకు పైగానే ఉంటుంది. 6 కి.మీ నుంచి 10 కి.మీ రన్ చేస్తారు. ఈ సరదా టైమ్‌లో కూల్డ్రింక్సేకాదు... బీర్ కూడా కొడతారు. ఈ హాషర్స్కి ఒక బుక్ ఉంది. ఇందులో వీళ్లు విజిట్ చేసిన ప్లేసెస్ గురించి రాస్తారు. పాశ్చాత్యశైలి ఈవెంట్ కాబట్టి.. సిటీలోవిదేశీయులు అధికంగా పాల్గొంటారు. ఎంట్రీట్... ఈ క్లబ్లో ఎంట్రీకి రిజిస్ట్రేషన్ ఫీజ్ రూ.50. అయితే ఫస్ట్ టైమ్ వస్తే గెస్ట్‌గా ట్రీట్ చేస్తారు. అలాగే 50, 100, 150వ రన్స్.. ఇలా మైలురాళ్లు చేరుకున్నప్పుడల్లా సదరు సభ్యులకు గిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఈ క్లబ్లో ఉన్నవారిలో ఇండస్ట్రియలిస్ట్ వెంకట్ అత్యధికంగా 900 రన్లలో పాల్గొన్నారు. ‘వారమంతా బిజీగా ఉండేవారికి ఇదొక చక్కని వీకెండ్ వినోదం. నేను ఇప్పటికి ఈ క్లబ్ నిర్వహించిన 200 పైగా ఈవెంట్లలో హాజరయ్యాను’ అని చెబుతారు ప్రసాద్. ఏడాదికోసారి అన్ని సిటీస్ కలిపి నేషనల్ ఈవెంట్ నిర్వహిస్తాయి. క్లబ్ ప్రారంభించి పాతికేళ్లు అవుతున్న సందర్భంగా ఆగస్టులో చెన్నై, హైదరాబాద్, బెంగళూరులు కలిపి సౌతిండియా ఈవెంట్ జరుపుతున్నారు. ఇందులో నగరం నుంచీ పార్టిసిపేట్ చేయనున్నారు.