
1.3 కోట్ల నోట్లతో గణనాథుడికి అలంకరణ
కోటి ముప్పై లక్షల నోట్లతో గణనాథుడికి అలంకరణ చేశారు.
మంగళగిరి(గుంటూరు): కోటి ముప్పై లక్షల నోట్లతో గణనాథుడికి అలంకరణ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఈ అలంకరణ చేశారు. రూ. 10 నుంచి రూ.1000, 500 నోట్ల వరకు అన్ని రకాల నోట్లు ఉపయోగించి గణేశుడిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో నోట్లతో అలంకరించిన స్వామివారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.