కలెక్టరేట్‌కు సొగసులు
కలెక్టరేట్‌కు సొగసులు
Published Sun, Jul 17 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
కర్నూలు(అగ్రికల్చర్):
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన(సోమవారం) నేపథ్యంలో కలెక్టరేట్‌లోని భవనాలకు మెరుగులు దిద్దుతున్నారు. పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని సీఎం కలెక్టరేట్‌లోనే నిర్వహిస్తుండడంతో ఆ మేరకు యుద్ధప్రాతిపదికన ముస్తాబు ప్రక్రియను చేపట్టారు. ఇందుకు సంబంధించిన పనులను ఆదివారం కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జేసీ హరికిరణ్ పరిశీలించారు. గతంలో ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్సార్, కిరణ్‌కుమార్‌రెడ్డి కలñ క్టరేట్‌లో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో కూడా కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. తాజాగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన మరోసారి కృష్ణా పుష్కరాల నిర్వహణపై సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కలెక్టరేట్‌ను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా గాంధీ విగ్రహం దగ్గరి నుంచి పరిసరాలు, కలెక్టర్ కార్యాలయాన్ని అందంగా అలంకరిస్తున్నారు. చెత్త, చెదారం ఎత్తివేయడం, రంగులు వేయడం, గుంతలు పూడ్చడం, రోడ్లకు మరమ్మతులు తదితర పనులు చేయించారు. కలెక్టర్ సమావేశ మందిరానికి పట్టిన దుమ్మును దులిపారు. కుర్చిలను పూర్తిగా మార్చివేశారు. సువాసనలు వెదజల్లేలా పర్‌ప్యూమ్ స్ప్రే చేయించారు.
లోన లొటారం
సీఎం వస్తున్న క్రమంలో కలెక్టరేట్‌ను ఇంతలా తీర్చిదిద్దుతున్న అధికారులు అదే కలెక్టరేట్‌లో వెనుకవైపు బూత్ బంగ్లాలను తలపిస్తున్న భవనాల జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఇప్పటి వరకు ఎంత మంది సీఎంలు వచ్చినా ముందువైపు మాత్రమే అదీ పైపై మెరుగులు దిద్ది అయిందనిస్తున్నారు తప్ప వెనుకవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
చిత్రాలు గ్యాలరీలో....
Advertisement