
పాతవాటికే కొత్త ధగధగలు
ఇంటిప్స్
ఇంట్లో డెకరేషన్ కోసం పెట్టుకునే ఇత్తడి ఆర్టికల్స్ కాని ఇత్తడి పాత్రలు కాని మురికి పట్టినా, రంగు మారినా అమోనియాలో ముంచిన క్లాత్‌తో కాని మెత్తటి బ్రష్‌తో కాని తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.
బంగారు నగలకు దుమ్ము పట్టి డల్‌గా ఉన్నట్లనిపిస్తే ఒక కప్పు వేడినీటిలో అర కప్పు అమోనియా కలిపి ఆ మిశ్రమంలో నగను పదినిమిషాలసేపు ఉంచాలి. అమోనియా మిశ్రమంలో నుంచి తీసిన తర్వాత మెత్తని వస్త్రంతో రుద్ది ఆరనివ్వాలి. ముత్యాలు, పగడాలు, రాళ్లు పొదిగిన నగలకు ఈ పద్ధతి పనికి రాదు.