articles
-
‘ఆ జాబితాలో చాట్ జీపీటి టాప్.. ఇండియా నుంచి ఏడు’
సాధారణంగా ఏ విషయానైనా సంపూర్ణంగా తెలసుకునేందుకు అందరూ వికీపీడియా మీదనే ఆధారపడుతూ ఉండటం తెలిసిందే. అయితే.. అందులో అన్ని రంగాలకు సంబంధించిన వార్తలు, సమాచారం అందుబాటులో ఉంటుంది. 2023లో వికీపీడియాలోని సమాచారాన్ని ఎంత మంది చదివారో దాని సంబంధించిన.. నివేదికను తాజాగా వికీపీడియా ఫౌండేషన్ విడుదల చేసింది. 2023 ఏడాదిలో అధికంగా చదివిన పలు ఆంగ్ల ఆర్టికల్స్ గణాంకాలను రిలీజ్ చేసింది. విడుదల చేసిన జాబితాలో గణాంకల ప్రకారం మొత్తం 25 ఆర్టికల్స్‌లు వార్షిక నివేదికలో చోటు సంపాదించుకోగా.. అందులో భారత్‌కు చెందినవి ఏడింటికి చోటు దక్కటం గమనార్హం. వికీపీడియా విడుదల చేసిన వివరాల ప్రకారం.. సుమారు 8.4 బిలియన్ పేజ్ వ్యూస్ సాధించిన అర్టికల్స్‌లో టాప్‌లో ఐదు నిలిచాయి. చాట్ జీపీటీ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో.. 2023లో చోటుచేసుకున్న మరణాలు, 2023 క్రికెట్ ప్రపంచ కప్(3వ స్థానం), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (4వ స్థానం), హాలీవడ్ సినిమా ఓపెన్ హైమర్ ఐదో స్థానంలో చోటు సంపాధించింది. అదేవిధంగా ఆరో స్థానంలో క్రికెట్ ప్రపంచ కప్, ఏడో స్థానంలో జే.రాబర్ట్ ఓపెన్‌హైమర్, జవాన్ మూవీ (8వ స్థానం), 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్(9వ స్థానం) పఠాన్( 10వ స్థానం). ది లాస్ట్ ఆఫ్ అస్ (TV సిరీస్)(11వ స్థానం), టేలర్ స్విఫ్ట్(12వ స్థానం), బార్బీ మూవీ(13వ స్థానం), క్రిస్టియానో రొనాల్డో( 14 స్థానం), లియోనెల్ మెస్సీ( 15వ స్థానం), ప్రీమియర్ లీగ్( 16వ స్థానం), మాథ్యూ పెర్రీ(17వ స్థానం), యునైటెడ్ స్టేట్స్( 18వ స్థానం), ఎలోన్ మస్క్(19వ స్థానం), అవతార్: ది వే ఆఫ్ వాటర్( 20వ స్థానం), india( 21 వ స్థానం), లిసా మేరీ ప్రెస్లీ( 22 స్థానం), గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ ( 23వ స్థానం), ఉక్రెయిన్‌పై రష్యా దాడి( 24వ స్థానం), ఆండ్రూ టేట్( 25వ స్థానం)లో చోటు దక్కించుకున్నాయి. ఈ వివరాల నివేదిక జనవరి 1 నుంచి నవంబర్ 28 వరకు మాత్రమేనని వికీపీడియా ఫౌండేషన్ పేర్కొంది. క్రికెట్ వరల్డ్ కప్ 2023, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టాప్ 5లో చోటు సంపాదించటం విశేషం. అదే విధంగా షారుక్‌ఖాన్ నటించిన జవాన్, పఠాన్ బాలీవుడ్ సినిమాలు రెండు టాప్ టెన్‌లో నిలిచాయి. -
బాబు స్కిల్డ్ క్రిమినల్..
బాబుది అంతా చీకటి చరిత్ర: అమర్నాథ్ అసలు చంద్రబాబు రాజకీయ జీవితమంతా.. కుట్రలు, కుతంత్రాలు, అవినీతితో నిర్మితమైందని, ఆయనదంతా చీకటి చరిత్ర అని విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. దేశంలోని ఏ రాజకీయ నాయకుడిపై లేనన్ని అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు చంద్రబాబుపై ఉన్నాయని చెప్పారు. నేరుగా రాజకీయాల్లో ఎదగలేక, వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. తాను నిజాయితీపరుడిని అని రోజూ ప్రవచనాలు వల్లించే చంద్రబాబు రూ.118 కోట్లు ఎలా బొక్కేశాడని ప్రశ్నించారు. చంద్రబాబు తాజా ఆర్థిక నేరాలపై పత్రికలు, టీవీ చానళ్లు అనేక కథనాలు వెల్లడిస్తున్నా.. చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ బాబు ఆర్థిక నేరాలను స్పష్టంగా ఐటీ అధికారులకు వివరించాడని ఆయన తెలిపారు. దుబాయ్ నుంచి కూడా అక్కడి కరెన్సీలో రూ.15 కోట్ల వరకు దండుకున్నారని మంత్రి ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు అధికారులను, మంత్రివర్గాన్ని తప్పుదోవ పట్టించి సుమారు రూ.350 కోట్లు కొట్టేశాడని ఆయన వివరించారు. చంద్రబాబు ఆర్థిక నేరాల విషయంలో ఈడీ జోక్యం చేసుకోవాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. తండ్రీకొడుకులను జైలుకు పంపాలి: రోజా చంద్రబాబు, లోకేశ్‌పై సీబీఐ విచారణ జరిపించి, జైలుకు పంపాలని మంత్రి ఆర్కే రోజా తిరుమలలో మీడియాతో అన్నారు. గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. ఏపీలో చంద్రబాబుకి ఆధార్ కార్డుగానీ, ఓటరు కార్డు గానీ, ఇల్లుగానీ లేకపోయినా హైదరాబాదు నుంచి అప్పుడప్పుడు వచ్చి వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేసి వెళ్లిపోతుంటారన్నారు. అలాగే, చంద్రబాబుకు ఐటీ నోటీసులిస్తే ఎందుకు ఎవరూ నోరు మెదపడంలేదని ఆమె ప్రశ్నించారు. కాంట్రాక్టు పనుల్లో కోట్లాది రూపాయల కమీషన్లు దండుకున్నారని రోజా ఆరోపించారు. చంద్రబాబుకు ఐటీ అధికారులు నోటీసులిస్తే ఆయన దత్తపుత్రుడు ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ను సైతం సీబీఐ అధికారులు విచారణ చేయాలని రోజా డిమాండ్ చేశారు. బాబు అత్యంత అవినీతిపరుడు: కొడాలి నాని చంద్రబాబు అత్యంత అవినీతిపరుడు, స్వార్థపరుడు, నమ్మక ద్రోహి అని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇప్పుడు రికార్డులతో సహా దొరికిన దొంగని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లయినా ఖర్చుపెడదామని ఆయన చెబుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ఇప్పటివరకు నిర్వహించిన ఎన్నికల్లో రూ.10 వేల కోట్లు వరకు ఖర్చుచేశారని, ఈ డబ్బంతా ఇలా కమీషన్లు తీసుకోకపోతే ఎక్కడి నుంచి వచ్చిందని కొడాలి నాని ప్రశ్నించారు. ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు ఎలా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. చట్టాలు, రాజ్యాంగాలను అనుసరించి ఏ విధంగా డబ్బులు దోచుకోవాలో ఆయనకు బాగా తెలుసునన్నారు. ఇప్పుడు ఐటీ శాఖాధికారులు ఇచ్చిన నోటీసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాబు అవినీతి బాగోతం బయటపడిందని ఇప్పుడు తప్పించుకోలేరని నాని అన్నారు. బాబు, లోకేశ్ పెద్ద అవినీతిపరులు: ధర్మాన ప్రపంచంలోనే చంద్రబాబు, లోకేశ్‌లు పెద్ద అవినీతిపరులని, దోచుకుని పంచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, రానున్న ఎన్నికల్లో వారికి ఓటు అడిగే అర్హత లేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు ఒక్క పేదవాడికి సెంటు భూమి ఇవ్వలేదని, ఒక్క శాశ్వత పథకం కూడా తీసుకురాలేకపోయారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి గజదొంగలకు అధికారమిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారన్నారు. ఇక అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు శ్రీకాకుళం జిల్లాకు చేసిందేమీ లేదని, చంద్రబాబు ముందు చేతులు కట్టుకుని నిలబడడం తప్ప జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా వీరు తీసుకురాలేకపోయారన్నారు. -
సర్వేలపై ఎల్లో మీడియా సొంత కథనాలు
సాక్షి, అమరావతి: ఏ జాతీయ సంస్థ సర్వే వచ్చినా అది ఫేక్, పెయిడ్ అంటూ ఎల్లో మీడియా సొంత కథనాలు వండి వారుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండియా టుడే ఇంగ్లిష్ న్యూస్ చానల్... సీ ఓటర్‌తో కలిసి చేసిన సర్వే మాత్రమే అసలు సిసలు అంటూ ఎల్లో మీడియా ఊదరగొడుతోందన్నారు. పచ్చ పార్టీ గెలుస్తుందని చెబితే ఒరిజినల్, లేకపోతే ఆ సర్వే ఫేకా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో గ్యారెంటీగా గెలుస్తామనే ధీమా టీడీపీలో ఏ ఒక్కరికీ లేదన్నారు. రాజకీయాల్లో విజేతలు, హుందాగా ఉండే వారి మాటలకే సమాజంలో గౌరవం ఉంటుందని తెలిపారు. పరాజితులు, ఒకప్పటి రౌడీషీటర్లు, చిల్లర నేరగాళ్లు హెచ్చరికలు జారీ చేస్తే వీధి కుక్కలు కూడా భయపడవని చెప్పారు. నలుగురి దృష్టిని ఆకర్షించే ఘటన ఎక్కడ జరిగినా దాన్ని చంద్రబాబు తనకు ఆపాదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడానికి కూడా తానే స్ఫూర్తి అని అన్నా అంటారన్నారు. ‘‘నా హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కింది.. ఎందరో పుష్పరాజ్‌లను నేను తయారు చేశా.. పుష్ప పార్ట్ 2 కూడా వస్తోంది తమ్ముళ్లూ’’ అని బాబు అంటారేమో అని ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తాము సమీక్ష నిర్వహిస్తే ‘ఈనాడు’లో తప్పుడు కథనాలు రాశారని మండిపడ్డారు. జర్నలిజం విలువలను పూర్తిగా వదిలేసిన ఈనాడు అభూత కల్పనలు రాస్తూ నానాటికీ దిగజారుతోందన్నారు. కాగా ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రకటించిన జైవిక్ ఇండియా అవార్డుకు ఎంపికైన గనిమిశెట్టి పద్మజకు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. మన రాష్ట్రానికి మూడు అవార్డులు దక్కడం ప్రశంసనీయమన్నారు. -
ఆకాశమంత ఆశ
ఆశావాది కంటే బలవంతుడు ఎవరూ లేరు.ఆశ అనే విత్తనమే చెట్టు అనే విజయానికి మూలం.పర్యావరణ స్పృహకు సంబంధించిన విషయాలను ప్రచారం చేస్తున్న డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ ఆకాష్ రానిసన్కు సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇండోర్‌కు చెందిన 28 సంవత్సరాల ఆకాష్ ‘గ్రీన్ ఎర్త్ ఫౌండేషన్’ ద్వారా రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాడు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ అనే పుస్తకం రాశాడు... ఎనిమిది సంవత్సరాల క్రితం... వాతావరణ మార్పులకు సంబంధించిన ఆర్టికల్స్ చదివిన ఆకాష్ అక్కడితో ఆగిపోలేదు. ఈ టాపిక్కు సంబంధించి ఎన్నో యూనివర్శిటీలలో ఎన్నో కోర్సులు చేశాడు. ఫలితంగా వాతావరణ మార్పుల గురించి లోతుగా తెలుసుకునే అవకాశం ఏర్పడింది.తాను తెలుసుకున్న విషయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని గట్టిగా అనుకున్నాడు.ఆకాష్లో ఉన్న బలం... ఎంత జటిలమైన విషయాన్ని అయినా సులభంగా, ఆకట్టుకునేలా చెప్పడం. ఆ ప్రతిభ ఇప్పుడు ఉపయోగపడింది. ‘క్లైమెట్ చేంజ్’కు సంబంధించిన విషయాలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్లడానికి ఆర్ట్ ఇన్స్టాలేషన్లు, డాక్యుమెంటరీలు, సోషల్ మీడియా కంటెంట్... ఇలా ఎన్నో దారుల్లో పయనించాడు. తాజాగా ‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ పుస్తకం రాశాడు.‘గత పదిసంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలు తిరిగాను. రుచికరమైన తిండి కోసమో, అద్భుత నిర్మాణాలను చూడడానికో నేను వెళ్లలేదు. ప్రకృతిని చూసి పరవశించడం కోసం తిరిగాను. ప్రకృతి పట్ల మన ఆరాధన ప్రకృతిని రక్షించుకోవాలనే బలమైన ఆకాంక్షకు కారణం అవుతుంది. పర్యావరణ సంరక్షణ కోసం నా వంతుగా ఏంచేయగలను? అందుకు నాలో ఉన్న నైపుణ్యాలు ఏమిటి? అనే దాని గురించి ఆలోచించాను. నా వంతుగా చేయడానికి ఎన్నో దారులు కనిపించాయి. అది సోషల్ మీడియాలో పర్యావరణ సంరక్షణ ప్రచారం కావచ్చు, పుస్తకం రాయడం కావచ్చు’ అంటాడు ఆకాష్.పుస్తకం రాయడానికి ముందు ఆకాష్‌కు అర్థమైన విషయం ఏమంటే, పర్యావరణ సంరక్షణకు సంబంధించిన సమాచారం చాలా ఎక్కువగా ΄ాశ్చాత్యదేశాలకు సంబంధించే ఉంది. మన దేశంలోని వాతావరణ పరిస్థితులకు అది ఉపయోగపడదు. దీంతో దేశీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకాన్ని రాశాడు. కర్బన ఉద్గారాల నుంచి క్లైమెట్ ఎమర్జెన్సీ వరకు ఎన్నో అంశాలను ఈ పుస్తకంలో చర్చించాడు. ‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ కోసం పర్యావరణవేత్తలు, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌లతో సంభాషించాడు.గతంలో ఎన్నో మంచి విషయాలు, పద్ధతులు ఉండేవి, అయితే అవి కాలగర్భంలో కలిసిపోయాయి. వాటిని మళ్లీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది అంటాడు ఆకాష్.‘ఇప్పుడు అన్నం మిగిలింది అంటే చెత్తబుట్టలో వేయడమే అన్నట్లుగా ఉంది. ఒకప్పుడు అలా కాదు రకరకాల దినుసులు కలిపి, వేడి చేసి మిగిలిన అన్నాన్ని వృథా కాకుండా చేసేవాళ్లు. చపాతీల విషయంలోనూ ఇంతే. ఈ ఆన్లైన్ ఫుడ్కాలంలో చిటికెలో ఏదైనా తినగలుగుతున్నాం. అయితే వృథా అవుతున్న ఆహారంపై మాత్రం బొత్తిగా దృష్టి పెట్టడం లేదు. ఒకవైపు తిండి దొరకక ఆకలితో అల్లాడే మనుషులు, మరోవైపు ఆహార వృథా గురించి పట్టించుకోని మనుషులు. ఇదొక వైరుధ్యం’ అంటాడు ఆకాష్.ఒక్క ఆహార రంగం మాత్రమే కాదు టెక్ట్స్‌టైల్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో ఇండస్ట్రీలలో జరిగే వృథాను, పర్యావరణ చేటును కళ్లకు కడతాడు ఆకాష్.‘ఇక అంతా అయిపోయినట్లేనా...రానున్నది విలయ విధ్వంస కాలమేనా!’ అనే నిరాశవాదంలోకి ఎప్పుడూ వెళ్లడు. ఎందుకంటే మినిమలిస్ట్ లైఫ్ స్టైల్‌ను గడుపుతున్న ఆకాష్ తనను తాను ‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ అని పరిచయం చేసుకుంటాడు. ‘మంచి పనుల ద్వారా మంచి కాలం వస్తుంది’ అని నమ్ముతాడు. -
ప్రకృతే ‘ప్రీతి’పాత్రం
కరీంనగర్: తన చుట్టూ ఉన్న ప్రకృతి, జీవరాశుల గురించే అద్భుతమైన కవితలు రాస్తున్న కరీంనగర్‌కు చెందిన ప్రీతి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ నోబల్ అవార్డుకు ఎంపికైంది. ఇండియన్ నోబల్ సోసైటీ కౌన్సిల్ ద్వారా బుధవారం అవార్డును స్వీకరించింది. జగిత్యాలలో జన్మించిన ప్రీతి తండ్రి విజయకుమార్ ఎస్బీఐలో బ్యాంక్ ఉద్యోగి కాగా తల్లి సౌజన్య గృహణి. ప్రీతి ఇంటర్ సమయంలో కరీంనగర్‌లోని బ్యాంక్‌కాలనీలో స్థిరపడ్డారు. స్కూల్ సమయంలో తన చుట్టూచూస్తున్న ప్రకృతిపై కవితలు రాయడం ప్రారంభించింది. తరువాత ఫేస్బుక్లో, అనంతరం పుస్తకాలు రాసి ఇండియాతో పాటు మలేషియా, సింగపూర్, బంగ్లాదేశ్ కాిపీరైట్స్ సంపాదించింది. 2019లో నెకెడ్‌లవ్, 2021లో సోలిటస్‌సోల్స్ అనే కవితల సంపుటిని సొంతంగా రాసి విడుదల చేసింది. 2020లో పెటెల్స్ అనే కవిత పుస్తకం రాయడంలో తన సహకారం అందించింది. పలు దేశాల్లో తన పుస్తకాలు అమ్మకాలు జరిగాయి. ప్రీతి రచనలు హైదరాబాద్‌లోని రైట్‌క్లబ్‌లో రెండో బహుమతి సాధించగా 2021లో ఢిల్లీలోని బుక్ ఫెయిర్‌కు ఎంపికై ంది. అమెరికాలోని పోయమ్‌హంటర్‌తో పాటు హెలో పొయోట్రీలలో ఆన్లైన్ ద్వారా పంపించి మంచి ప్రతిభ కనిబరించి వారి నుంచి ప్రశంసలు అందుకుంది. తాను రాసిన మూడు కవిత సంపుటాలకు మూడు ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. -
అక్షరం.. సాక్షి!
30 ఏళ్ల క్రితం వెలసిన ఆ ఊళ్లో 13 కుటుంబాలుండేవి.. అయితే ఓ ప్రబుద్ధుడు ఏకంగా ఆ ఊరినే అమ్మేశాడు.. ఇంకో ఊళ్లో 200 మంది విద్యార్థులు.. బడికి వెళ్లాలంటే ఒకటే బస్సు.. వాళ్లు పనికి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉధృతంగా పొంగుతున్న వాగును దాటాలి.. అప్పుడే వారికి బతుకుదెరువు దొరుకుతుంది.. రేషన్ మాఫియాతో అధికారులు కుమ్మక్కై పేదలకు అందాల్సిన బియ్యాన్ని మేశారు.. కరోనాతో ఛిద్రమైన ఓ కుటుంబం రోడ్డున పడగా.. వారికి శ్మశానమే ఆవాసమైంది.. ►ఇలాంటి ఎన్నో వెతలు, వేదనలు, అక్రమాలను ‘సాక్షి’ అక్షరీకరించి వెలుగులోకి తెచ్చింది. వారి ఇబ్బందులకు ప్రభుత్వం స్పందించింది.. అధికారులను కదిలించింది. ప్రజలు, విద్యార్థులు పడుతున్న కష్టాలను తీర్చింది. బాధితులకు సాంత్వన చేకూర్చింది. అక్రమార్కుల ఆటకట్టించింది. ప్రభుత్వంతోపాటు పలువురు నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా స్పందించి ఆర్థిక సాయం ప్రకటించారు. ఇలా 2021వ సంవత్సరంలో సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చిన కథనాల్లో మచ్చుకు కొన్నింటిని చూద్దాం! యాతన తీర్చగా చెన్నూరుకు కోటపల్లి ప్రభుత్వ పాఠశాల 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 200 మంది విద్యార్ధులకు ఒకటే బస్.. 2021 నవంబర్ 15న ప్రచురితమైన ఈ కథనానికి స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ఆ విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు. ఆ ఊరికి బాసటగా.. 30 ఏళ్ల కిందట కామారెడ్డి–ఎల్లారెడ్డి రాష్ట్ర రహదారి పక్కన ఓ చర్చి ఫాదర్ అక్కడ పేదల వెతలనుచూసి చలించారు. పూరి గుడిసెల్లో ఉన్న వారికి ఇళ్లు కట్టించాలని భావించి 29 గుంటల భూమిని కొని తెల్ల కాగితం (సాదాబైనామా)పై రాసుకున్నారు. వారికి ఇళ్లు కూడా కట్టించారు. ఈ భూమిని ఓ ఘనుడు తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొని వారి ఇళ్లు కూల్చడానికి యత్నించాడు. దీనిపై సాక్షి గత డిసెంబర్ 21న ‘ఊరినే అమ్మేశారు’ అన్న శీర్షికన ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపారు. సాక్షి తమ కష్టాన్ని తీర్చిందని గ్రామస్తులు డిసెంబర్ 25న హైదరాబాద్‌లో సాక్షి కార్యాలయానికి వచ్చి ఎడిటర్ మురళిని కలిసి కతజ్ఞతలు తెలిపారు. ఈ వార్తాకథనాన్ని డిగ్రీ మూడో సంవత్సరం తెలుగు పాఠ్యాంశంలో చేర్చారు. అండగా నిలిచి.. కరోనాతో కొడుకు, కోడలు చనిపోయి ఇద్దరు మనవరాళ్లతో తల్లి పడుతున్న వేదనపై ‘కొడుకు కోడల్ని పొట్టనపెట్టుకుంది’ శీర్షికన మే 30న ప్రచురితమైన కథనంపై జిల్లా కలెక్టర్ స్పందించారు. చనిపోయిన రాజేశ్ ఇంటిపై తీసుకున్న రూ.18 లక్షల అప్పును తీర్చేందుకు చర్యలు చేపట్టారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి రూ.8 లక్షలు తగ్గించారు. మిగతా రూ.10 లక్షలను దాతల ద్వారా సేకరించి బ్యాంక్ రుణాన్ని క్లియర్ చేయించి ఇంటి పత్రాలను ఆ తల్లికి అప్పగించి రుణవిముక్తి చేశారు. దీనిపై ‘గూడు చెదిరిన పక్షులకు గుండె ధైర్యం’...అప్పు తీర్చి ఇళ్లు నిలబెట్టారు అన్న కథనం సెప్టెంబర్ 1న ప్రచురితమైంది. ►ఫిబ్రవరి 15న ‘ముగ్గురు పిల్లలు, నాయినమ్మ’ శీర్షికన ప్రచురించిన కథనంపై అప్పటి జిల్లా కలెక్టర్ శరత్ స్పందించి గంగవ్వకు రూ.50 వేల నగదు సాయం అందించారు. మనవరాలికి ఉద్యోగమిచ్చారు. సొంత ఇళ్లు కట్టించి ఇచ్చారు. దీనిపై సెప్టెంబర్ 1న ‘గూడు చెదిరిన పక్షులకు గుండె ధైర్యం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. అనాథల బంధువై.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గామానికి చెందిన భీమయ్య కరోనాతో చనిపోయాడు. ఆ తరువాత ఆయన భార్య గర్భంతో ఉండగానే కరోనాతో చనిపోయింది. ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. చిన్నారుల బంధువే వీరిని సాకుతున్న వైనంపై సాక్షి 2021, మే 29న కథనాన్ని ప్రచురించగా, మంత్రి కేటీఆర్ స్పందించారు. అధికారుల నుంచి వివరాలు తెప్పించుకుని ఆ చిన్నారులను ఆదుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మొదుగులగూడెం నడిమిగూడెం మధ్య కిన్నెరసాని వాగు ప్రవాహాన్ని కర్రలను ఆసరాగా చేసుకుని కూలీలు దాటుతున్న వైనంపై ‘ఈ సాహసం ప్రమాదకరమై‘నది’ శీర్షికన జూలై 13న కథనం ప్రచురితమైంది. స్పందించిన పోలీసులు ఇనుప రాడ్లు, షీట్లతో తాత్కాలిక వంతెన ఏర్పాటుచేశారు. అక్రమార్కులు పరేషాన్ జోగుళాంబ గద్వాల జిల్లాలో రేషన్ బియ్యం అక్రమాల్లో ఉన్నతాధికారి లీలలు, బియ్యం అక్రమార్కులకు పెద్దల అండ.. శీర్షికన ప్రచురితమైన కథనాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ‘సాక్షి’ కథనాలతో స్పందించిన అధికారులు రేఖ రైస్‌మిల్లు యజమానిని అరెస్టు చేశారు. అలాగే రేషన్ దందాతోపాటు ఇతర వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ హనుమంతుపై సస్పెన్షన్ వేటు పడింది. కష్టం తీరింది.. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల జడ్పీ పాఠశాలలో 298 మంది విద్యార్థులుండగా, వీరిలో 174 మంది బాలికలున్నారు. వీరందరికీ ఒకటే మూత్రశాల ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ‘174 మంది విద్యార్థినులకు ఒక్కటే’ శీర్షికన ప్రచురితమైన కథనానికి భారీగా స్పందన లభించింది. పలువురు అధికారులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్పందించి ఆర్థిక సాయం ప్రకటించారు. ఆమెకు అండగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గుర్రం మౌనిక కాలికి ఆపరేషన్ జరిగింది. ఏడాది కాలంగా భర్త పట్టించుకోకపోవడంతో స్టీలు రాడ్లతో ఇబ్బందితోనే యాచిస్తూ జీవనం సాగిస్తోంది. దీనిపై ‘ఏడాదిగా కాళ్లకు స్టీల్రాడ్లతో’ శీర్షికన జూలై 23న కథనం ప్రచురితమైంది. దీంతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించి సొంత ఖర్చులతో శస్త్రచికిత్స చేయించి రాడ్లు తీయించగా, 15 రోజుల తర్వాత ఇంటికి చేర్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఐసీడీఎస్ అధికారుల ద్వారా ట్రైసైకిల్ మంజూరు చేయించారు. ఆవాసమై.. కరోనా కారణంగా సిద్దిపేట పట్టణంలో కుటుంబ పెద్ద మరణించగా ఆ కుటుంబం మొత్తం వీధిన పడి, శ్మశానంలో నివసిస్తున్న కథనం మే 29న ప్రచురితమైంది. దీనిపై మంత్రి హరీశ్ స్పందించి ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించి, నిత్యావసర సరుకులు అందించారు. పట్టా దక్కింది.. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలోని తొమ్మిది గ్రామాలకు చెందిన రైతుల 5 వేల ఎకరాల పట్టా భూమిని అధికారులు అసైన్డ్గా మార్చారు. దీనిపై జూలైలో వచ్చిన కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య స్పందించారు. ఈ భూములపై కమిటీ వేసి తిరిగి పట్టా భూమిగా మార్చారు. ఆ ఊరికి నయమైంది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతాళపాడుకు చెందిన పలువురు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతుండగా.. ‘ఆ ఊరికి ఏమైంది’ శీర్షికన అక్టోబర్ 10న ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. వైద్య ఆరోగ్య శాఖాధికారులు గ్రామానికి చేరుకుని బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ఐసీఎంఆర్, జాతీయ పోషకాహార సంస్థ బృందం కూడా పర్యటించి వివరాలు ఆరా తీసింది. పోషకాహార లోపం, దురలవాట్లే కారణమని తేల్చి, అవసరమైన ఏర్పాట్లు చేసి బాధితులకు ఉపశమనం కలిగించారు. శుభ్రమై‘నది’ ‘గోదావరి తీరం చెత్తాచెదారంతో నిండిపోయినది’ అన్న శీర్షికన ప్రచురితమైన ఫొటో ఇది. దీనిపై అధికార యంత్రాంగం వెంటనే స్పందించింది. జేసీబీతో చెత్తను తొలగించే పనులను చేపట్టింది. -
జగనన్న పాలనపై వ్యాసాలకు ఆహ్వానం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాహసోపేత నిర్ణయాలతో జరుగుతున్న జన రంజక పాలనపై వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్యమం, వాలంటీర్ల వ్యవస్థ, రైతుభరోసా, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, వాహనమిత్ర, వసతి దీవెన, విద్యా దీవెన... ఇలా ప్రభుత్వ పనితీరులో చోటుచేసు కున్న మార్పులను విశ్లేషించాలి. చదవండి: ప్రజాదరణ చూసి ఓర్వలేక కుట్రలు మీ వ్యాసం సరళమైన తెలుగులో, 500–800 పదాల మధ్య ఉండాలి. వాట్సప్‌లో లేదా పేజ్ మేకర్ 7.0 లేదా యూనికోడ్లో టైపు చేసిన ఓపెన్ డాక్యుమెంట్లు మాత్రమే పంపించాలి. బహుమతులకు ఎంపికైన 20 వ్యాసాలే కాక మంచి విశ్లేషణ గల మరో 20 వ్యాసాలను కలిపి పుస్తకంగా ప్రచురిస్తాం. మొదటి (రూ.10 వేలు), రెండు (రూ.5 వేలు), మూడు (రూ.3 వేలు), నాలుగు (రూ.2 వేలు), ఐదు (రూ.1000) బహుమతులతోపాటు ప్రచురించిన ప్రతి వ్యాసానికీ రూ. 1000 ఇస్తాం. బహుమతి ప్రదానం పుస్తకావిష్కరణ రోజే ఉంటుంది. వ్యాసాలు పంపడానికి ఆఖరు తేదీ: 2022 ఏప్రిల్ 30. పంపాల్సిన వాట్సాప్ నంబర్: 9393111740. ఈ–మెయిల్: srdalitsocialmedia@gmail.com – డా.జి.కె.డి.ప్రసాద్, వైఎస్ఆర్ దళిత్ సోషల్ మీడియా, విశాఖపట్నం -
అందులో భారత్‌కు మూడో స్థానం
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా సైన్స్, ఇంజనీరింగ్ రంగాలకు సంబంధించి అత్యధిక ఆర్టికల్స్ ప్రచురించిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచిందని అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2008లో సైన్స్, ఇంజనీరింగ్ రంగాలకు సంబంధించి మొత్తం 17.5 లక్షల ఆర్టికల్స్ ప్రచురితమవ్వగా.. 2018 నాటికి ఆ సంఖ్య 25.5 లక్షలకు పెరిగిందని తెలిపింది. ఎన్ఎస్ఎఫ్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం... అత్యధిక ఆర్టికల్స్ ప్రచురించిన దేశాలుగా చైనా, అమెరికా, భారత్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లో 2008లో 48,998 ఆర్టికల్స్ ప్రచురితమవ్వగా.. 10.73 శాతం వార్షిక వృద్ధి రేటుతో ఆ సంఖ్య 2018 నాటికి 1.35 లక్షలకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా సైన్స్ ఆర్టికల్స్‌లో చైనా 20.67 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. వార్షిక వృద్ధి రేటు 7.81 శాతంగా నమోదైంది. సైన్స్ ఆర్టికల్స్‌లో అమెరికా ఏడాదికి 0.71 శాతం వృద్ధి సాధించింది. సైన్స్ ఆర్టికల్స్‌లో టాప్-10 దేశాలు 1. చైనా (5,28,263) 2. అమెరికా (4,22,808) 3. భారత్ (1,35,788) 4. జర్మనీ (1,04,396) 5. జపాన్ (98,793) 6. యూకే (97,681) 7. రష్యా (81,579) 8. ఇటలీ (71,240) 9. దక్షిణ కొరియా (66,376) 10. ఫ్రాన్స్ (66,352) -
మిషన్ కాకతీయ’పై కథనాలు పంపండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జన జీవనంపై ‘మిషన్ కాకతీయ’ప్రభావంపై కథనాలు పంపాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే కోరారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు పత్రికలు, టీవీ చానళ్లలో ప్రచురితమైన, ప్రసారమైన కథనాలు ఎంట్రీలుగా స్వీకరిస్తామని బుధవారం తెలిపారు. వచ్చే జనవరి 31 వరకు పంపొచ్చన్నారు. పంటల దిగుబడులు, రసాయనిక ఎరువుల వాడకం, వలసలు, చెరువుల చరిత్రపై పరిశోధన, విశ్లేషణ, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ఉపాధి కల్పన, ఫ్లోరోసిస్ నివారణ, భూగర్భజలాలు, ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులు, ప్రజల జీవన ప్రమాణాలు, సాంస్కృతిక విధానం వికాసం అంశాలపై పంపాలని తెలిపారు. వీటిని సచివాలయం ‘డి’బ్లాక్‌లోని ఓఎస్డీ కార్యాలయంలో ఇవ్వొచ్చని.. లేదంటే శ్రీధర్‌రావు దేశ్ పాండే, ఓఎస్డీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డి బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్, సెక్రటేరియట్, హైదరాబాద్ అడ్రస్‌కు పంపాలని సూచించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగాల్లో మూడేసి చొప్పున బహుమతులు ఉంటాయని, మొదటి బహుమతి కింద రూ.లక్ష, రెండో బహుమతి కింద రూ.75 వేలు, మూడో బహుమతి కింద రూ.50 వేలు అందజేస్తారని తెలిపారు. ‘భగీరథ’ ఆలస్యంపై ఈఎన్సీ అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనులు పూర్తిస్థాయిలో జరగడం లేదని ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో మిషన్ భగీరథ పనులను సమీక్షించారు. కొందరు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఆర్డబ్ల్యూఎస్ విభాగం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ విశ్వసనీయతకు భంగం కలిగించే ఏ వర్క్ ఏజెన్సీని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఓ వైపు డిసెంబర్ 31 వస్తున్నా కాంట్రాక్టర్లు ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పైప్‌లైన్ గ్యాప్‌లను పూడ్చడం ద్వారా చాలా గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయవచ్చని, ఆ చిన్న పనులను కూడా ఏజెన్సీలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. డిసెంబర్ 31 నాటికి గ్రామాలకు శుద్ధిచేసిన తాగునీటిని అందించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే ఏజెన్సీలు తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కోదండపూర్ డబ్ల్యూటీపీలో ఎలక్ట్రో మెకానికల్ పనులు చేస్తున్న ఏజెన్సీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పాతవాటికే కొత్త ధగధగలు
ఇంటిప్స్ ఇంట్లో డెకరేషన్ కోసం పెట్టుకునే ఇత్తడి ఆర్టికల్స్ కాని ఇత్తడి పాత్రలు కాని మురికి పట్టినా, రంగు మారినా అమోనియాలో ముంచిన క్లాత్‌తో కాని మెత్తటి బ్రష్‌తో కాని తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి. బంగారు నగలకు దుమ్ము పట్టి డల్‌గా ఉన్నట్లనిపిస్తే ఒక కప్పు వేడినీటిలో అర కప్పు అమోనియా కలిపి ఆ మిశ్రమంలో నగను పదినిమిషాలసేపు ఉంచాలి. అమోనియా మిశ్రమంలో నుంచి తీసిన తర్వాత మెత్తని వస్త్రంతో రుద్ది ఆరనివ్వాలి. ముత్యాలు, పగడాలు, రాళ్లు పొదిగిన నగలకు ఈ పద్ధతి పనికి రాదు. -
వేయి పడగలు ఎందుకు చదవాలి?
రస రాజధాని: ‘విశ్వనాథ సత్యనారాయణ ప్రారంభించిన సాంస్కృతిక సామ్రాజ్య వ్యతిరేక ఉద్యమం ఇంకా కొనసాగవలసే ఉన్నది’ అన్నారు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య- ‘వేయి పడగలు ఎందుకు చదవాలి?’ అన్న వ్యాసంలో. 120 ఏండ్ల విశ్వనాథకు సాహిత్య నీరాజనం ‘రస రాజధాని’లో ఇదొక వ్యాసం. ఆ మహా నవల ఔన్నత్యాన్నీ, వచ్చిన విమర్శలనీ సమాంతరంగా స్పృశిస్తూనే రచయిత ఈ వ్యాసం రాశారు. మళ్లీ కొన్ని కొత్త అంశాలను పరిచయం చేశారు కూడా. అయితే విశ్వనాథ ఆవిష్కరించిన అంశాన్ని, నిజానికి ఆయన వేదనని విమర్శకులు సరిగా అంచనా వేయలేకపోయారన్నదే సుప్రసన్నాచార్య ఆరోపణ. కానీ స్థలకాలాలను బట్టి విశ్వనాథ కొన్ని అవగాహనలలో ఇప్పుడు సామంజస్యం కనిపించకపోవచ్చునని కూడా రచయిత అంటారు. ఏ విధంగా చూసినా వేయిపడగలు నవల ఇతివృత్తం జీవలక్షణం కలిగి ఉంది. అభిమానులనీ, వ్యతిరేకులనీ కూడా అందుకే ఇంతగా ఆలోచింపజేస్తోంది. ఈ వ్యాసంతో పాటు ఇంకా ‘మహాకవి విశ్వనాథ’, ‘వేదమే సీతాదేవి- తపసా జ్వలన్తీం’, ‘కల్పవృక్షం- బాలకాండ’, ‘మరోసారి వేయిపడగలు చదివిన అనుభవం’, ‘గిరికుమారుని ప్రేమగీతాలు’, ‘తొలిచివేసే విరహం’ వంటి 12 వ్యాసాలు ఉన్నాయి. విశ్వనాథ సాహిత్యం లేదా, అసలు సాహిత్యం మీద ఇటీవల వచ్చిన చిక్కనైన విమర్శ ‘రసరాజధాని’. కల్హణ రస రాజధాని: 120 ఏండ్ల విశ్వనాథకు సాహిత్య నీరాజనం; రచన: ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య; పేజీలు: 158; వెల: 120; ప్రతులకు: రచయిత, ఇం.నం. 9-1-190, రాధికా థియేటర్ ఎదురుగా, గిర్మాజీపేట, వరంగల్-2 -
ఆ నేడు 15 సెప్టెంబర్, 1860
జ్ఞాన సముద్రుడు మహా గ్రంథాలే కాదు... మహనీయుల జీవితాలు కూడా మౌనంగా దారి చూపుతాయి. అటువంటి మహనీయుడైన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను గుర్తు తెచ్చుకోవడం అంటే... ఎప్పటికప్పుడు సరికొత్త స్ఫూర్తిని అందిపుచ్చుకోవడమే. జ్ఞానం ఉన్నచోట క్రమశిక్షణకు లోటు రావచ్చు. క్రమశిక్షణ ఉన్నచోట జ్ఞానలేమి కనబడవచ్చు. కానీ మోక్షగుండం మేధస్సు ఎంత పదునైనదో, క్రమశిక్షణ అంత గట్టిది. ఉపన్యాసం ఇవ్వాల్సిన రోజు నాలుగు గంటలకి నిద్రలేచి నోట్స్ తయారు చేసుకోవడం, మెరుగులు దిద్దుకోవడం లాంటివి చేసేవారు. తన బట్టలు తానే ఉతుక్కొని, ఐరన్ చేసుకునేవారట. ఏ పనీ ఆషామాషీగా చేయడం ఆయనకు ఇష్టముండేది కాదు... అది ఉపన్యాసమైనా సరే, ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనైనా సరే. జీవితానికి సంబంధించిన నైతికవిలువలు, జ్ఞానధోరణులకు విశ్వేశ్వరయ్య జీవితం ప్రతీకగా మారింది. ‘‘విశ్వేశ్వరయ్యకు ఉన్నంత జ్ఞానం ఉంది’’ అంటారు జ్ఞానానికి సంబంధించిన అంచనాల్లో. ‘‘వీధిదీపాల కింద కష్టపడి చదువుకున్నారు’’ అంటూ తల్లిదండ్రులు పిల్లలకు విశ్వేశ్వరయ్య జీవితాన్ని పాఠంగా చెబుతారు. ఎంత కాలం గడిచినా.... చరిత్రను వెలిగించే స్ఫూర్తిదాయకమైన అరుదైన పేర్లు కొన్ని ఉంటాయి. విశ్వేశ్వరయ్య పేరు అలాంటిదే. ఆయన పుట్టిన రోజును ‘ఇంజనీర్స్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన నుంచి సరికొత్త స్ఫూర్తిని ఎప్పటికప్పుడు అందుకుంటున్నాం. -
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఖబడ్దార్..!
- విలేకరులకు బాబూమోహన్ అనుచరుల హెచ్చరిక - రూ. 50వేలు ఇచ్చినట్లు నేను చెప్పలేదు - కాంట్రాక్టర్ రవీందర్‌గౌడ్ సంగారెడ్డి మున్సిపాలిటీ: అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్‌పై వ్యతిరేక కథనాలు రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని టేక్మాల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు యూసుఫ్, అల్లాదుర్గం మండల పరిషత్ ఉపాధ్యక్షుడు భిక్షపతి విలేకరులను హెచ్చరించారు. కొందరు పనిగట్టుకొని ఎమ్మెల్యేపై అసత్య కథనాలు రాస్తున్నారని, ఇకపై అలాంటివార్తలు వస్తే సహించేది లేదన్నారు. ఇటీవల జేఎన్టీయూలో విద్యార్ధులకు, మెస్ కాంట్రాక్టర్ మధ్య వివాదం జరిగి, నెలకు రూ. 50 వేలు ఎమ్మెల్యేకు కాంట్రాక్టర్ ఇస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ కథనాన్ని ఖండించేందుకు మెస్ కాంట్రాక్టర్ రవీందర్‌గౌడ్ గురువారం సంగారెడ్డిలోని ఐబీ అతిథి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవీందర్‌గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తారా.. అంటూ మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే ఆదేశాల మేరకే మెస్ కాంట్రాక్టు కోసం టెండర్ వేశానని ఇందులో ఎమ్మెల్యేకు మామూళ్లు ఇస్తున్న వచ్చిన ఆరోపణలు నిరాధారమన్నారు. నిబంధనల ప్రకారమే మెస్ కాంట్రాక్టు తీసుకున్నానన్నాన్నారు. టెండర్ సమయంలో ఐదుగురు దరఖాస్తులు తీసికెళ్లినా ఎవరూ వేయలేదని, దీంతో ఎమ్మెల్యే తనను వేయమని కోరితే టెండర్ వేశానన్నారు. తాను ఎమ్మెల్యేకు నెలకు రూ.50 వేలు ఇస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాను అన్నట్లు నిరూపిస్తే జేఎన్టీయూ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానన్నారు. -
వాల్మీకి- బెర్నార్డ్ షా మధ్య భేదం
1983లో మరణించిన అంబటిపూడి వెంకటరత్నం రాసిన ‘వ్యాసతరంగాలు’ ఒకచోట కూర్చి వాటిని తాజాగా అందుబాటులోకి తెచ్చారు వారి కుమారుడు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి. ఇందులో సంస్కృతభాషా సంబంధ వ్యాసాలు, కవిత్వతత్త్వ విచార వ్యాసాలతోపాటు రచయిత ఎరిగిన చెళ్లపిళ్ల, వేలూరి, శ్రీపాద, విశ్వనాథ, గడియారం, మధునాపంతుల వ్యక్తిత్వచిత్రణ వ్యాసాలున్నాయి. డాక్టర్ ఐ.సచ్చిదానందం పరిష్కర్తగా వ్యవహరించిన ఈ పుస్తకంలోని(పేజీలు: 208; వెల: 100; ప్రతులకు: డాక్టర్ డి.నరేష్‌బాబు, శ్రీషిర్డి సాయిబాబా ట్రస్టు, జూలేపల్లె, గోస్పాడు మండలం, కర్నూలు జిల్లా-518674; ఫోన్: 9491416696) ఒక వ్యాసంలో వాల్మీకి-బెర్నార్డ్ షా మధ్య భేదాన్ని పట్టుకోవడంలో వెంకటరత్నం అంతరంగం తెలుస్తుంది: ప్రాచ్యము, ఆద్యము ‘వాల్మీకి’ రచనము. పాశ్చాత్యము అధునాతనము ‘షా’ రచనము. ప్రపంచము ఇన్ని శతాబ్దములు నడచి వచ్చినది. జ్ఞానమును వృద్ధిచేసి కొనినది. బహుపథములు పరిశీలించినది. స్త్రీచే మోసపోవుచు అధఃపతితుడైన మహావీరుని జూపించినది పాశ్చాత్య కవిత. ఇక ప్రాచ్య కవిత కథా శిల్పమున అధునాతనము వలెనే తేజరిల్లినది. కాని, విశేషము గాంచుడు. స్త్రీ హృదయము పురుషోన్నతికి తోడుపడినది. పడిపోవువాని పెకైత్తినది. అజ్ఞానిని జ్ఞానిని చేసినది. ఇట్లున్నవి ఇరువురి రచనములు. ‘క్చ ౌజ ఈ్ఛట్టజీడ’ని అనువదించితిని. ‘చూడాల’ అను ఏకాంక రచనము జేసితిని. ఈ రెంటిని ఒక దాని చెంత నొకటి నిల్పిన ప్రాచ్య పాశ్చాత్య చిత్తములు, ప్రాచీనతా నవతలు, భారతీయ భారతీయేతరములు ఒక దాని వెంట నొకటిగా కథాంశము ‘కథా లక్ష్యములు’ కవి హృదయములు పొడకట్టినవి. హృదయము వాల్మీకికి నమస్కరించినది. షాను జూచి నవ్వినది. -
నో సెక్యూరిటీ.. నో డిపాజిట్
సాక్షి, గుంటూరు: జిల్లాలో పౌర సరఫరాల శాఖ గాడి తప్పింది. లెసైన్స్‌ల మంజూ రులో నిబంధనలకు తిలోదకాలు ఇస్తోంది. ఇష్టారాజ్యం గా లెసైన్స్‌లు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికీ గండి కొడుతోంది. ఫుడ్ సేఫ్టీ యాక్ట్-2006 ప్రకారం ప్రతి ఏటా ఆర్టికల్స్ తయారు చేసే దుకాణాల నుంచి లెసైన్స్ రెన్యువల్ ఫీజును సెక్యూరిటీ డిపాజిట్‌గా వసూలు చేయాలి ఆర్టికల్స్ తయారు చేసే దుకాణాలుగా పిలువబడే రైస్ మిల్లులు, రేషన్ షాపులు, ఎంఎల్ఎస్ పాయింట్లు, పసుపు, మిరప ట్రేడర్లు, బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తారు. రైస్ మిల్లులకు ఏడాదికి రూ. ఐదు వేలు, మిగతా వాటికి రూ. రెండు వేలు చొప్పున డిపాజిట్‌గా రాబట్టాలి. లెసైన్స్ రెన్యువల్ సమయంలోనే పౌర సరఫరాల శాఖ దీనిని వసూలు చేయాలి.మూడేళ్లుగా అధికారులు సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేయకుండా లెసైన్స్‌లను రెన్యువల్ చేస్తున్నట్లు సమాచారం. అధికారులు తనిఖీలు చేసిన సమయంలో ఏవైనా లోపాలు ఉంటే ఈ డిపాజిట్ నుంచి రికవరీ పెడతారు. ప్రభుత్వానికీ వడ్డీ రూపంలో ఆదా యం సమకూరుతోంది. 2011 నుంచి 2014 వరకు సెక్యూరిటీ డిపాజిట్ కింద పౌర సరఫరాల శాఖ ఫీజు వసూలు చేయడం లేదని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. దీనివల్ల రూ. 2.08 కోట్ల మేర ఆదాయానికి గండి పడినట్లు లెక్కలు కట్టారు. ఈ విషయాన్ని విజిలెన్స్ ఎస్పీ కేవీ మోహన్‌రావు ‘సాక్షి’ వద్ద ధ్రువీకరించారు. ఇష్టారాజ్యంగా లెసైన్స్‌ల మంజూరు... పౌరసరఫరాల శాఖ నిబంధనలు పక్కన పెట్టి జిల్లాలో ఇష్టారాజ్యంగా లెసైన్స్‌లు మంజూరు చేస్తున్నట్లు సమాచారం. దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాల్సిన అధికారులు లంచాల కోసం చూసీచూడనట్టు ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
వీలయినంత మేర, అదుగో అలా జీవిద్దాం!
పద్యానవనం ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మి పాము పదినూఱేండ్లున్ మడువున కొక్కెర యుండదెకడు నిల పురుషార్థపరుడు కావలె సుమతీ. ఎన్నేళ్లు బతికామన్నది కాదు, బతికినన్నాళ్లు ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యమంటారు పెద్దలు. చెరువులో కొంగ సుదీర్ఘకాలం జీవిస్తుంది, ఉడుము నూరేళ్లు బతుకుతుంది, పాము వెయ్యేళ్లు సజీవంగా పడుంటుంది.... ఏం సార్థకం? మనిషై పుట్టాక ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు సాధించాలి. ధర్మాన్ని ఆచరించడం. అర్థం సముపార్జించడం. కామం అనుభవించడం. మోక్షం పొందడం. ఇలా ఒకటికొకటి అనుసంధాన పరుస్తూ వాటి సాధనకు కృషి చేయాలి. అలా చేయలేని నాడు ఎన్నాళ్లు జీవిస్తే మాత్రం ఏం సార్థకం, ఇతర అనామక అల్ప జీవుల్లానే బతుకు వ్యర్థం అంటాడు సుమతీ శతక కారుడైన బద్దెనామాత్యుడు. వీటి గురించి తెలిసి, తగినంత ప్రజ్ఞతో జీవించే వారు కొందరయితే, ఈ చతుర్విధ పురుషార్థాలపై లోతైన అవగాహన లేకుండానే వాటిని ఏదో రూపంలో, కొంచెం అటు ఇటుగా ఆచరిస్తూ జీవితాలు వెళ్లదీసే వారు మరికొందరు. నిండుతనం కొరవడిన కొందరి జీవితాల్లో ఏదో ఒకటో, రెండో, ఎక్కువో ఇవేవీ లేకుండానే జీవితాలు తెల్లారి పోతున్నాయి. అందుకు అనేకానేక కారణాలుంటాయి. తమ పరిధిలోని ప్రభావకాలు కొన్నయితే, తమ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేని అంశాలు కూడా వారి వారి జీవితాల్ని ప్రభావితం చేసినపుడు కోరినా కొన్ని లభించకపోవచ్చు. అది కచ్చితంగా లోపమే, పరిపూర్ణమైన జీవితం కాదు అంటారు లాక్షణికులు. సృష్టిలోని జీవుల జీవిత కాలాల్ని ఈ అంశంతో ముడిపెట్టి సాపేక్షంగా చెప్పడానికి బద్దెన పద్యం రాసినా, వాటి వాటి ఆయువు వ్యత్యాసాలకు శాస్త్రీయమైన కారణాలున్నాయి. ఉచ్చ్వాస-నిశ్వాస ల నిడివి, ఊపిరితిత్తుల గరిష్ట వినియోగం తదితరాలపై ఆధారపడి జీవుల ఆయుష్షు ఉంటుందన్నది శాస్త్రీయంగా ధృవపడిన విషయం. ఒక నిమిషంలో ఎక్కువ సార్లు ఉచ్ఛ్వాస-నిశ్వాసలు జరిపే కుక్క లాంటి జీవులు స్వల్పకాలమే జీవిస్తాయి. ఊపిరిని నియంత్రించి నిమిషంలో అతి తక్కువ సార్లు ఉచ్ఛ్వాస-నిశ్వాసాలు జరిపే తాబేలు, పాము వంటి జీవులు సుదీర్ఘకాలం జీవిస్తాయి. ఈ సూత్రం ఆధారంగానే పూర్వ కాలంలో మునులు ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ఊపిరిని నియంత్రించి, నిమిషానికి అతి తక్కువ ఉచ్ఛ్వాస-నిశ్వాసలు జరపడం ద్వారా ఆయుర్దాయాన్ని పెంచుకున్నారు. వందల ఏళ్లు, వందకు పైగా ఏళ్లు జీవించారనే కథనాలు మనకు ఆశ్చర్యం కలిగించినా వాస్తవమే అనడానికి ఆధారాలున్నాయి. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఇటువంటి విషయాలు చెబితే పుక్కిటి పురాణాలుగా మనం కొట్టిపారేస్తాం. అదే, ఏ రాబిన్ శర్మ వంటి రచయితో ‘ద మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ’లాంటి నవలలు రాసి, హిమాలయ పర్వత పంక్తుల్లో సన్యాసులు నూరేళ్లకుపైగా బతుకుతున్నారని ఆసక్తికరంగా రాస్తే, నిజమే అయివుంటుంది, అనుకుంటాం! అది మన నైజం. ఊపిరిని నియంత్రించి శ్వాసను శాసించే ప్రాణాయామంలో ఆ శక్తి ఉందని అష్టాంగయోగ చెప్పిన పతంజలి ఏనాడో స్పష్టం చేశాడు. నిష్టతో ఆచరించడాన్ని, దానికి తోడు ఇతర జీవన శైలి, ప్రక్రియల్ని బట్టి కూడా ఇది ఫలితాల్నివ్వడం ఆధారపడి ఉంటుంది. ఆయుష్షుతో నిమిత్తం లేకుండా బతికినన్నాళ్లు గొప్పగా, ఆదర్శప్రాయంగా జీవించడం అన్నది మరణానంతరం కూడా మనిషికి బతుకునిస్తుంది. అది కీర్తి, యశస్సు, పేరు ప్రతిష్ఠలకు సంబంధించిన అంశం. అందుకేనేమో, అబ్రహం లింకన్ ‘‘ఎంత కాలం జీవించావన్నది కాదు, జీవిత కాలంలో ఎంత బతుకును ఇమిడ్చావన్నది ముఖ్యం’’ అంటాడు. జగద్గురు శంకరాచార్య, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, చెగువెరా, వట్టికోట ఆళ్వార్‌స్వామి వంటి వారు తక్కువ వయసులోనే జీవితాలు ముగించినా తరాలతరబడి జీవించే ఉన్నారు. కీర్తి, యశస్సు అన్నవి అజరామరమైనవై, మనం లెక్కగట్టే ఈ ఆయుష్షు కేవలం శరీరానికి సంబంధించిందే అయితే దాన్ని ఉపయుక్తంగా వాడాలి. ‘పరోపకారార్థమిదం శరీరం’ పరుల సేవ కోసమే ఈ శరీరం అన్న పెద్దల మాట ప్రకారం నడుచుకోవడం వల్ల కూడా మనిషి చిరంజీవి కాగలడు. వేదవ్యాసుడు శ్రీమద్భాగవతంలో, ‘‘ఏతావజ్జన్మ సాఫల్యం దేహినా మిహ దేహిషు! ప్రాణైరర్థైర్ దియా వాచా శ్రేయ ఏవాచరేత్ సదా!!’’ అని ఒక గొప్ప మాట చెప్పాడు. ‘మనిషి తన సంపదలు, బుద్ధి, వాక్కు మొదలైన శక్తుల్ని ఇతరుల సంక్షేమం కోసం ఎంతగా వెచ్చిస్తాడో, అతని జీవితం అంత ఫలప్రదమైనదీ, అర్థవంతమైనదీ అవుతుంది’ అని దానర్థం. వీలయినంత మేర అదుగో, అలా జీవిద్దాం. - దిలీప్‌రెడ్డి -
Wisdom is preferable to riches
DEECET - 2014 English ARTICLES 'A/An' is an indefinite article and 'The' is a definite article. Let us see a few tips pertaining to the usage of articles: 1. 'A' is used before words beginning with a consonant sound. 'A' is used before words like university, useful, unicorn, union, European and one, etc., because these words begin with a consonant sound. E.g. I saw an one-eyed man. (Incorrect) I saw a one-eyed man. (Correct) 2. 'An' is used before words beginning with a vowel sound. The words, honest, heir, honour etc. take 'an' before them as they begin with a vowel sound. E.g. It is a honour to him. (Incorrect) It is an honour to him. (Correct) 3. 'The' is used: 1. Before the names of rivers, seas, holy books, group of islands, deserts, newspapers and oceans. E.g. My uncle lives in United States of America. (Incorrect) My uncle lives in the United States of America. (Correct) 2. As an adverb before compa- ratives. E.g. The higher you climb colder it gets. (Incorrect) The higher you climb the colder it gets. (Correct) 3. Before superlatives. E.g. She is cleverest girl in the class. (Incorrect) She is the cleverest girl in the class. (Correct) 4. When the object is unique. E.g. the earth, the sky, the sun 5. Before a proper noun, when it is qualified by an adjective. E.g. The immortal Kalidas. 6. With a class of things. E.g. The dog is a faithful animal. 7. Before musical instruments. E.g. I know how to play the Saxophone. 8. Before an adjective, when the noun is hidden. E.g. The rich should be kind and helpful. 4. Omission of article: 1. Before names of materials. E.g. Platinum is an expensive metal. 2. Before a common noun used in its widest sense. E.g. Man is mortal. 3. Usually before proper names. E.g. Delhi is the capital of India. 4. Before abstract nouns used in general sense. E.g. Wisdom is preferable to riches. 5. Before languages. E.g. English is an international language. 6. Before names of relations. E.g. Father is very happy today. 7. Before predicative nouns denoting a unique position that is normally held at one time by one person only. E.g. He was elected secretary of the Board. 8. Before places visited for their primary purpose. E.g. She goes to the college. (Incorrect) She goes to college. (Correct) SEQUENCE OF TENSES We have studied the agreement of subject and verb in one of our previous session. Yet another area which needs to be carefully studied is the sequence of tenses. Let us see the tips regarding this. 1. If the verb in the main clause is in the present tense, the verb in the sub-ordinate clause can be in any tense. E.g. He thinks that she works hard. The boy says that he will do his homework. 2. If the verb in the main clause is in the past tense, the verb in the subordinate clause must be in any of the past tense forms only. E.g. She replied that she had no money with her. They found that he was dishonest. DIRECT AND INDIRECT SPEECH While changing a sentence from direct speech to reported speech the following rules should be borne in mind: 1. The reported words are not placed within inverted commas. 2. No comma is placed after said. 3. The reported speech is introduced by the conjunction that. 4. The tense of the verb is changed from the Present to the Past. 5. Words showing nearness are changed into words showing distance. 6. The Introductory Verb in questions is changed to ask, inquire, demand, or some other word having a similar meaning. 7. The Introductory Verb in reporting a Command or a Request is changed to request, order, command, beseech, advise, or some other word having a similar sense. 8. In reporting an Exclamation or a Wish the Introductory Verb is changed to wish, exclaim, pray, cry, bless, or some other similar verb. ACTIVE AND PASSIVE VOICE A verb is in the active voice when the person or thing denoted by the subject is the doer of the action. A verb is in the passive voice when the person or thing denoted by the subject is the receiver of the action. Rules for changing a sentence from active to passive: 1. Identify the subject, the verb and the object: SVO 2. Change the object into subject 3. Put the suitable helping verb or auxiliary verb. In case helping verb is given, use the same. But note that the helping verb given agrees with the object. 4. Change the verb into past participle of the verb. 5. Add the preposition "by" 6. Change the subject into object. QUESTION TAGS Question tags are formed with the auxiliary or modal verb from the statement and the appropriate subject. 1. A positive statement is followed by a negative question tag. (Auxiliary+n't+pronoun?) 2. A negative statement is followed by a positive question tag. (Auxiliary +pronoun?) 3. The question tag uses the same verb as the main part of the sentence. If there is an auxiliary verb ('have', 'be') then the question tag is made with the auxiliary verb. 4. If the main part of the sentence doesn't have an auxiliary verb, the question tag uses an appropriate form of 'do'. 5. When the verb in the main sentence is in the present simple we form the question tag with do / does. 6. If the verb is in the past simple we use did. 7. If there is a modal verb in the main part of the sentence the question tag uses the same modal verb. Note: Be careful with question tags in sentences that start with 'I am'. The question tag for 'I am' is 'aren't I? -
యాక్షన్ టీ ముంది జాగ్రత్త
మన్యం ప్రజాప్రతినిధులపై మావోయిస్టుల గురి ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ 136 మందికి హెచ్చరికలు విశాఖపట్నం, న్యూస్‌లైన్: రానున్న ఎన్నికల్లో మన్యంలో ప్రజాప్రతినిధులు లక్ష్యంగా ప్రత్యేక యాక్షన్ టీమును మావోయిస్టులు ఏర్పాటు చేశారని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. ఈమేరకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉందన్నారు. ఆదివారం ఉన్నతస్థాయి అధికారులతో ఎస్పీ సమీక్షించారు. అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. మావోయిస్టు హిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రజా ప్రతినిధులు, లక్ష్యంగా చేసుకున్నవారిని 136 మందిని గుర్తించి, వారికి హెచ్చరికలు జారీ చేశామన్నారు. బలపం పంచాయతీ సర్పంచ్ సీంద్రి కార్లను చంపడం హేయమైన చర్య అన్నారు. ఈ దుర్ఘటనను దృష్టిలో పెట్టుకుని ఏజెన్సీ మారుమూల ప్రాంతాలలో పర్యటించేటప్పుడు ప్రజా ప్రతినిధులు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. ఎటువంటి బందోబస్తు లేకుండా రాత్రిళ్లు ఏజెన్సీలో బస చేయరాదని ఎస్పీ సూచించారు. -
పెదబయలులో నకిలీ రూ.వెయ్యి నోట్లు
కిరాణా వ్యాపారికి టోకరా చలామణి వెనక గంజాయి స్మగ్లర్లు నష్టపోతున్న గిరిజనులు పెదబయలు, న్యూస్‌లైన్: మన్యంలో నకిలీ కరెన్సీ నోట్ల చలామణి ఎక్కువగా సాగుతోంది. మన్యంలో ప్రస్తుతం గంజాయి, గిరిజనులు పండించి పంటల అమ్మకాల సీజన్ కావడంతో స్మగ్లర్లు నకిలీ నోట్లను గుట్టుగా చలామణి చేస్తున్నారు. గతంలో మన్యంలో రూ.100, రూ.500 నకిలీ నోట్లు ఉండేవి. ప్రస్తుతం రూ.వెయ్యి విలువైన నోట్లు కూడా చలామణిలో ఉన్నాయి. పెదబయలు మండల కేంద్రం లోని ఓ కిరాణా వ్యాపారికి ఆదివారం రెండు రూ.వెయ్యి నోట్లు వచ్చాయి. అవి అసలైన నోట్లని భావించిన ఓ గిరిజన రైతు తీసుకొచ్చాడు. చివరకు అవి నకిలీవనితెలిసి బాధపడ్డాడు. గత వారం పెదబయలు వారపు సంతల్లో పిప్పళ్లను విక్రయించినప్పుడు ఈ నోట్లు ఇచ్చారని న్యూస్‌లైన్ ముందు వాపోయాడు. వారపు సంతలు, కుగ్రామాల్లో గంజాయి విక్రయించే రైతులకు కూడా స్మగర్లు నకిలీ నోట్లను ముట్టజెబుతున్నారు. వారపు సంతల్లో పసుపు, పిప్పళ్లు విక్రయించే రైతులకు వస్తున్న డబ్బులో కూడా ఇవి ఉంటున్నాయి. పోలీసులు స్పందించి నకిలీ నోట్ల ముఠాను పట్టుకుని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.