యాక్షన్ టీ ముంది జాగ్రత్త | Beware of tea before the action | Sakshi
Sakshi News home page

యాక్షన్ టీ ముంది జాగ్రత్త

Published Mon, Mar 3 2014 1:06 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

యాక్షన్ టీ ముంది జాగ్రత్త - Sakshi

యాక్షన్ టీ ముంది జాగ్రత్త

  • మన్యం ప్రజాప్రతినిధులపై మావోయిస్టుల గురి
  •      ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్
  •      136 మందికి హెచ్చరికలు
  •  విశాఖపట్నం, న్యూస్‌లైన్: రానున్న ఎన్నికల్లో మన్యంలో ప్రజాప్రతినిధులు లక్ష్యంగా ప్రత్యేక యాక్షన్ టీమును మావోయిస్టులు ఏర్పాటు చేశారని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. ఈమేరకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉందన్నారు. ఆదివారం ఉన్నతస్థాయి అధికారులతో ఎస్పీ సమీక్షించారు. అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. మావోయిస్టు హిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రజా ప్రతినిధులు, లక్ష్యంగా చేసుకున్నవారిని 136 మందిని గుర్తించి, వారికి హెచ్చరికలు జారీ చేశామన్నారు.

    బలపం పంచాయతీ సర్పంచ్ సీంద్రి కార్లను చంపడం హేయమైన చర్య అన్నారు. ఈ దుర్ఘటనను దృష్టిలో పెట్టుకుని ఏజెన్సీ మారుమూల ప్రాంతాలలో పర్యటించేటప్పుడు ప్రజా ప్రతినిధులు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. ఎటువంటి బందోబస్తు లేకుండా రాత్రిళ్లు ఏజెన్సీలో బస చేయరాదని ఎస్పీ సూచించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement