vikramjit duggal
-
గ్రామీణ ప్రజల్లో చైతన్యానికే పోలీసులు
కోటపల్లి(చెన్నూర్): మారుమూల గ్రామీణ ప్రజలను చైతన్యపర్చడానికి, వారితో మమేకం కావడానికి పోలీసులు ఉన్నట్లు పోలీసు కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. మంగళవారం మండలలంలోని జనగామ గ్రామంలో కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన కళాబృందం ద్వారా ప్రజల్లో అవగాహన, చైతన్యం తీసుకరావడానికి, పోలీసులు ఉంది ప్రజల కోసమని తెలియజేసే విధంగా కళా ప్రదర్శనతో ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కళాప్రదర్శనతో మూఢ నమ్మకాలు, రోడ్డు ప్రమాదాలు, మద్యం సేవించడం వల్ల కలిగే నష్టాలు, ర్యాగింగ్, నక్సలిజం, బాల్యవివాహలు, గల్ఫ్ మోసాలు, ఎయిడ్స్, రైతుల అత్మహత్యలు వివిధ రకాల సమస్యలపై గురించి నాటకాల రూపంలో ప్రదర్శించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించాలని తెలిపారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా జేపీవో నరేష్‌కు తెలియపర్చాలని, గ్రామంలో ఎవరూ మద్యం బెల్ట్ షాపులను నిర్వహించవద్దని ఆన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ వేణుగోపాల్‌రావు, జైపూర్ ఏసీపీ సీతారాములు, సీఐలు రమేష్, కిషోర్, ఎస్సైలు వెంకన్న, భూమేష్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గట్టు లక్ష్మణ్ గౌడ్, సర్పంచ్ పాల్గొన్నారు. -
‘హైకోర్టు ఆదేశాల మేరకే నడుచుకుంటాం’
సాక్షి, పెద్దపల్లి/మంథని: అనుమానాస్పదరీతిలో మృతిచెందిన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన దళిత యువకుడు మంథని మధుకర్ రీ–పోస్టుమార్టమ్‌పై హైకోర్టు ఆదేశాల మేరకే నడుచుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్ తెలిపారు. పెద్దపల్లిలో గురువారం విలేకరులతో మాట్లాడారు. సిట్టింగ్ జడ్జి, ఫోరె న్సిక్ నిపుణుల సమక్షంలో రీ–పోస్టుమార్టమ్ జరపాలని మధుకర్ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారని, వారికి ఎక్కడా అడ్డు చెప్పలేదని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఉస్మానియా మెడికల్ కళాశాలకు లేఖ రాసి రీ–పోస్టుమార్టమ్‌కు ప్రాసెస్‌ను మళ్లీ మొదలు పెడతామని చెప్పారు. మధుకర్ మృతి కేసును నిష్పాక్షికంగా ఐపీఎస్ అధికారి సింధూశర్మ దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. పోలీసులపై ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు విశ్వాసం ఉంచి సహకరిం చాలని కోరారు. మధుకర్ కేసులో పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మ గ్రామస్తులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో అభిప్రా యాలను వీడియో కవరేజ్ మధ్య వివరాలు రాబట్టారు. సుమారు రెండు గంటల పాటు గ్రామంలోనే విచారణ కొనసాగింది. -
తుపాకులు అమ్మేందుకు వచ్చి...
⇒ పోలీసులకు చిక్కిన ఇద్దరు నిందితులు ⇒ వారిలో ఒకరు మాజీ సైనికుడు పెద్దపల్లి రూరల్: సైనికుడిగా సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన ఓ వ్యక్తి డబ్బు కోసం తుపాకీ విక్రయించేందుకు వచ్చి పెద్దపల్లి జిల్లా పోలీసులకు చిక్కాడు. రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ శుక్ర వా రం ఇక్కడ వివరాలను వెల్లడించారు. ప్రకా శం జిల్లా కంకిపాడుకు చెందిన చిలుకల రమణారెడ్డి ఆర్మీ ఉద్యోగి రిటైర్డ్ అయ్యాక మరికొందరితో కలసి మద్యం వ్యాపారం చేశాడు. ఆ సమయంలో విజయవాడకు చెందిన గొట్టేటి భరణికుమార్‌తో పరిచయ మేర్పడింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వీరి ద్దరు డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఆయుధాల వ్యాపారం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. బీహార్ వెళ్లి అక్కడ 7.2 పిస్టల్, 25 రౌండ్లు బుల్లెట్లను కొనుగోలు చేశారు. వాటిని పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని ప్రాంతంలో అమ్మేందుకు వచ్చారు. పెద్దపల్లిలో విక్రయించాలని చూసినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో గోదావరిఖనిలో పరిచయ మున్న వారికి అమ్మేందుకు గురువారం ఆటోలో వెళ్తుండగా.. సమాచారమందుకున్న సీఐ మహేశ్, పెద్దపల్లి, బసంత్‌నగర్ ఎస్సైలు శ్రీనివాస్, విజయేందర్ పెద్దపల్లి శివారులోని రైల్వే ఫ్లైఓవర్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. తుపాకీ, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ దుగ్గల్ తెలిపారు. -
నేరాల నియంత్రణకు కృషి
► సీపీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ► పోలీస్ కమిషనరేట్‌లో నూతన సంవత్సర వేడుకలు గోదావరిఖని : రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీ విక్రమ్‌జిత్ దుగ్గల్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. 2017 సంవత్సరంలో నేరాల నియంత్రణకు మరింత కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ విజేందర్‌రెడ్డి, మంచిర్యాల డీసీపీ జాన్ వెస్లీ, మంచిర్యాల ఏసీపీ చెన్నయ్య, పెద్దపల్లి ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు వెంకటేశ్వర్, దేవారెడ్డి, వాసుదేవరావు, వెంకటేశ్వర్లు, ఆర్ఐ సుందర్రావు పాల్గొన్నారు. హెచ్ఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మరో కార్యక్రమంలో సీపీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్, నాయకులు యాదగిరి సత్తయ్య, షబ్బీర్‌అహ్మద్, అజీజ్, హబీబ్‌బేగ్, పినకాశి మొగిలి పాల్గొన్నారు. అనాథ పిల్లలతో కలిసి.. కోల్‌సిటీ : గోదావరిఖని గాంధీనగర్‌లోని ఎండీహెచ్‌డబ్ల్యూఎస్ అనాథ పిల్లల ఆశ్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ శనివారం రాత్రి న్యూ ఇయర్ కేక్ కట్‌చేసి, పిల్లలకు మిఠాయి, పండ్లు పంపిణీ చేశారు. పిల్లల మధ్య వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని సీపీ వెల్లడించారు. అనాథ పిల్లలను ప్రోత్సహించానికి అందరూ ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ వెంకటేశ్వర్, ఎస్సై దేవయ్య, ఆశ్రమ నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్య, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ రూల్స్‌పై పోస్టర్ ఆవిష్కరణ గోదావరిఖని : జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సం దర్భంగా ట్రాఫిక్ రూల్స్‌కు సంబంధించిన పోస్టర్‌ను కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఆదివారం రాత్రి కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐసో టీం ఇండియా అధ్యక్షుడు ఘనశ్యామ్ ఓజా, సభ్యులు హిర్సాద్, సిరాజ్, సమద్ బాజుమల్, సలీం, తిరుపతి, అయోధ్య రవి తదితరులు పాల్గొన్నారు. -
రమేష్ కుటుంబానికి అండగా ఉంటాం: జిల్లా ఎస్పీ
నల్గొండ: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎస్సై రమేష్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని నల్గొండ జిల్లా ఎస్పీ దుగ్గల్ అన్నారు. శుక్రవారం దేవరకొండ మండలం శేరుపల్లిలో ప్రారంభమైన రమేష్ అంతిమ యాత్రలో ఎస్పీతోపాటు వివిధ పార్టీల నాయకులు, గిరిజన సంఘాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ దుగ్గల్ మాట్లాడుతూ... రమేష్ గిరిజన నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎస్సై అయిన తీరును వివరించారు. అయితే రమేష్ మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కేసును సీఐడీ పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుందని దుగ్గల్ చెప్పారు. -
'నిరుద్యోగులకు పోలీస్ శాఖ ద్వారా శిక్షణ'
భువనగిరి: నిరుద్యోగ యువకులకు పోలీస్ శాఖ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామని నల్లగొండ జిల్లా ఎస్పీ విక్రంజిత్ దుగ్గల్ తెలిపారు. బుధవారం భువనగిరికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో గుడుంబా నివారణకు యువత ముందుకు రావాలని కోరారు. సారా తయారీకి అవసరమైన నల్లబెల్లం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. హైవే పెట్రోలింగ్‌ను మరింత పటిష్టం చేస్తామని, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని ఎస్పీ దుగ్గల్ చెప్పారు. -
మావోయిస్టులా...దోపిడీదొంగలా..
జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మండిపాటు విశాఖపట్నం : మావోయిస్టుల దుశ్చర్యల కారణంగా గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ మండిపడ్డారు. జిల్లాలో మారుమూల గిరిజన గ్రామాల్లో వృద్ధాప్య, వితంతు పింఛన్లు, ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రజలకు నేరుగా పోస్టాఫీసుల ద్వారా డబ్బులు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దానిలో భాగంగా వీఆర్‌సీల ద్వారా వేలిముద్రలు, పని వివరాలు వంటివి నమోదు చేసి పోస్టాఫీసులో అందజేయడం ద్వారా గిరిజనులకు నేరుగా డబ్బులు అందుతాయన్నారు. ఈ ప్రక్రియకు నేడు మావోయిస్టులు చేసిన పిల్ల చేష్టల వల్ల తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. మావోయిస్టులు వారి అజ్ఞానంతో, అనాలోచిత విధానాలతో గిరిజనుల సమాచారం పొందుపరిచిన లాప్‌టాప్‌లు, వెబ్కేమ్లు, థంబ్మెషీన్, సెల్ఫోన్లు, కెమెరాలు, పర్సులు, ఏటీఎం, పాన్‌కార్డు, ఆధార్‌కార్డులు, పనిచేసే వారి జేబుల్లోని డబ్బులు, వ్యక్తిగత వస్తువులు కూడా దోపిడీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వారు మావోయిస్టులా లేక దోపిడీ దొంగలా..?అని జిల్లా ఎస్పీ ప్రశ్నించారు. గత నెల 14న, ఈ నెల 7వ తేదీన పెదబయలు మండలం ఇంబరి గ్రామం, కొయ్యూరు మండలం మఠం భీమవరం, చీడిపాలెం, బూదరాళ్ల, పలకజీడి పంచాయితీల్లో మావోయిస్టులు ఈ తరహా దాడులకు పాల్పడ్డారన్నారు. వారు తమ బూజు పట్టిన సిద్ధాంతాలతో గిరిజనుల జీవితాలతో ఆడుకోవడం మానుకోవాలని ఎస్పీ హితవు పలికారు. అభివృద్ధి గిరిజన గ్రామాలకు చేరాలని ప్రతి గిరిజన యువతీ, యువకులు, మేధావులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం తనతో సహా, పోలీస్ సిబ్బంది నిత్యం కృతనిశ్చయంతో పనిచేస్తామని ఎస్పీ తెలిపారు. -
తగ్గిన మావోయిస్టుల ప్రభావం
ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అనకాపల్లి రూరల్ : జిల్లాలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టిందని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ చెప్పారు. అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టుల కదలికలు జిల్లాలో పూర్తిగా తగ్గాయని చెప్పారు. జి.కె.వీధి, చింతపల్లి, కొయ్యూరు ప్రాంతాలలో ఉపాధి హామీ పనులకు ఆటంకం కలిగిస్తున్నారని, కూలీలు, పింఛన్‌దారులకు బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రలు, ఫోటోల సేకరణ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని చెప్పారు. ఇటువంటి వ్యవహార శైలి వల్లే గిరిజనుల్లో వారిపట్ల వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. కూంబింగ్ పార్టీలు, ఎస్ఐలు ఏజెన్సీలో గ్రామ సభలు ఏర్పాటుచేసి గిరిజనులను చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు. చిన్నాచితకా పారిశ్రామిక వేత్తలను, కాంట్రాక్టర్లను మావోయిస్టులు బెదిరిస్తున్నారన్న ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిని కూడా సీరియస్‌గా పరిగణిస్తామని చెప్పారు. జిల్లాలో మహిళలకు రక్షణగా పోలీస్స్టేషన్లలో వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ప్రజల కోసం ఇప్పటికే 1091, 100 నంబర్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. అనకాపల్లి మండలంలో అక్రమ ఇసుక, క్వారీలను నిరోధించడానికి ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశామన్నారు. మండలంలో లెసైన్స్‌లేని క్వారీలు ఎక్కువగా ఉన్నాయని, పరిశీలించాక న్యాయపరమైన చర్యలు చేపడతామని చెప్పారు. బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపనున్నట్లు తెలిపారు. నకిలీ బంగారం, మోటారు సైకిళ్ల దొంగలు ఎక్కువయ్యారని, వీరిపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా అనకాపల్లిలో మూడు నెలల శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన ఏఎస్పీ కల్మేష్‌ను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వి.ఎస్.ఆర్.మూర్తి, పట్టణ, రూరల్ సీఐలు చంద్ర, భూషణనాయుడు పాల్గొన్నారు. -
యాక్షన్ టీ ముంది జాగ్రత్త
మన్యం ప్రజాప్రతినిధులపై మావోయిస్టుల గురి ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ 136 మందికి హెచ్చరికలు విశాఖపట్నం, న్యూస్‌లైన్: రానున్న ఎన్నికల్లో మన్యంలో ప్రజాప్రతినిధులు లక్ష్యంగా ప్రత్యేక యాక్షన్ టీమును మావోయిస్టులు ఏర్పాటు చేశారని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. ఈమేరకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉందన్నారు. ఆదివారం ఉన్నతస్థాయి అధికారులతో ఎస్పీ సమీక్షించారు. అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. మావోయిస్టు హిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రజా ప్రతినిధులు, లక్ష్యంగా చేసుకున్నవారిని 136 మందిని గుర్తించి, వారికి హెచ్చరికలు జారీ చేశామన్నారు. బలపం పంచాయతీ సర్పంచ్ సీంద్రి కార్లను చంపడం హేయమైన చర్య అన్నారు. ఈ దుర్ఘటనను దృష్టిలో పెట్టుకుని ఏజెన్సీ మారుమూల ప్రాంతాలలో పర్యటించేటప్పుడు ప్రజా ప్రతినిధులు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. ఎటువంటి బందోబస్తు లేకుండా రాత్రిళ్లు ఏజెన్సీలో బస చేయరాదని ఎస్పీ సూచించారు. -
పోలీసు కుటుంబాలకు పరిహారం పంపిణీ
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు రూరల్ ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ శనివారం తన కార్యాలయంలో పరిహారం పంపిణీ చేశారు. చీడికాడ పోలీస్ స్టేషన్లో పనిచేసి మృతి చెందిన హెచ్‌సీ కె.అప్పన్న భార్య కోడా వెంకటలక్ష్మికి, హుకుంపేట పీఎస్ ఏఎస్ఐ ఎన్.సోమయ్య భార్య విజయకుమారికి, మంప పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్ సోబా రాంబాబు భార్య సర్వలక్ష్మిలకు తలో రూ.50 వేలు పంపిణి చేశారు. అదే విధంగా 2011-12,2012-14 విద్యా సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన సిబ్బంది పిల్లలకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. అనంతరం కంట్రోల్ రూం ఎస్ఐ సిహెచ్.రాంబాబు, అనకాపల్లి సీసీఎస్ ఎల్.తాతబ్బాయి, అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన చోటా సాహెబ్‌లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డి.ఎన్.కిశోర్, నర్సీపట్నం ఏఆర్ డీఎస్పీ దామోదర్, ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ సిహెచ్.వివేకానంద, జిల్లా అధ్యక్షుడు జె.వి.ఆర్.సుబ్బరాజు, సిబ్బంది పాల్గొన్నారు.