⇒ పోలీసులకు చిక్కిన ఇద్దరు నిందితులు
⇒ వారిలో ఒకరు మాజీ సైనికుడు
పెద్దపల్లి రూరల్: సైనికుడిగా సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన ఓ వ్యక్తి డబ్బు కోసం తుపాకీ విక్రయించేందుకు వచ్చి పెద్దపల్లి జిల్లా పోలీసులకు చిక్కాడు. రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ శుక్ర వా రం ఇక్కడ వివరాలను వెల్లడించారు. ప్రకా శం జిల్లా కంకిపాడుకు చెందిన చిలుకల రమణారెడ్డి ఆర్మీ ఉద్యోగి రిటైర్డ్ అయ్యాక మరికొందరితో కలసి మద్యం వ్యాపారం చేశాడు. ఆ సమయంలో విజయవాడకు చెందిన గొట్టేటి భరణికుమార్‌తో పరిచయ మేర్పడింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వీరి ద్దరు డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఆయుధాల వ్యాపారం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.
బీహార్ వెళ్లి అక్కడ 7.2 పిస్టల్, 25 రౌండ్లు బుల్లెట్లను కొనుగోలు చేశారు. వాటిని పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని ప్రాంతంలో అమ్మేందుకు వచ్చారు. పెద్దపల్లిలో విక్రయించాలని చూసినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో గోదావరిఖనిలో పరిచయ మున్న వారికి అమ్మేందుకు గురువారం ఆటోలో వెళ్తుండగా.. సమాచారమందుకున్న సీఐ మహేశ్, పెద్దపల్లి, బసంత్‌నగర్ ఎస్సైలు శ్రీనివాస్, విజయేందర్ పెద్దపల్లి శివారులోని రైల్వే ఫ్లైఓవర్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. తుపాకీ, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ దుగ్గల్ తెలిపారు.
తుపాకులు అమ్మేందుకు వచ్చి...
Published Sat, Mar 4 2017 1:08 AM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM
Advertisement