సమావేశంలో మాట్లాడుతున్న సీపీ దుగ్గల్
కోటపల్లి(చెన్నూర్): మారుమూల గ్రామీణ ప్రజలను చైతన్యపర్చడానికి, వారితో మమేకం కావడానికి పోలీసులు ఉన్నట్లు పోలీసు కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. మంగళవారం మండలలంలోని జనగామ గ్రామంలో కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన కళాబృందం ద్వారా ప్రజల్లో అవగాహన, చైతన్యం తీసుకరావడానికి, పోలీసులు ఉంది ప్రజల కోసమని తెలియజేసే విధంగా కళా ప్రదర్శనతో ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కళాప్రదర్శనతో మూఢ నమ్మకాలు, రోడ్డు ప్రమాదాలు, మద్యం సేవించడం వల్ల కలిగే నష్టాలు, ర్యాగింగ్, నక్సలిజం, బాల్యవివాహలు, గల్ఫ్ మోసాలు, ఎయిడ్స్, రైతుల అత్మహత్యలు వివిధ రకాల సమస్యలపై గురించి నాటకాల రూపంలో ప్రదర్శించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించాలని తెలిపారు.
గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా జేపీవో నరేష్‌కు తెలియపర్చాలని, గ్రామంలో ఎవరూ మద్యం బెల్ట్ షాపులను నిర్వహించవద్దని ఆన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ వేణుగోపాల్‌రావు, జైపూర్ ఏసీపీ సీతారాములు, సీఐలు రమేష్, కిషోర్, ఎస్సైలు వెంకన్న, భూమేష్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గట్టు లక్ష్మణ్ గౌడ్, సర్పంచ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment