People Welfare
-
మూసీ లెక్కలు చెప్పేందుకే ఢిల్లీకి రేవంత్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు మూ టల లెక్కలు చెప్పేందుకే సీఎం రేవంత్‌రెడ్డి హస్తిన పర్యటనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పేదల గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన బాస్‌లతో మంతనాలు చేస్తున్నారని మండిపడ్డారు. పదినెలల పాలనలో 23మార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రాష్ట్రానికి తెచి్చన నిధులు, చేసిన మేలు ఏమిటో చెప్పాలన్నారు. ఈ మేరకు సోమవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యధిక పర్యాయాలు ఢిల్లీకి వెళ్లిన సీఎంగా రేవంత్ రికార్డు సృష్టిస్తున్నారని అన్నారు.సీటు కాపాడుకునేందుకే: అధిష్టానం మెప్పు కోసం తరచూ ఢిల్లీకి వెళుతున్న సీఎం రేవంత్ తన బాస్ లకు జై కొట్టి సీటును కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నాడని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ పాలనపై కాంగ్రెస్ అధిష్టానం సంతృప్తిగా లేనందునే పదేపదే ఢిల్లీకి పిలిచి ఆయనకు చివాట్లు పెడుతోందన్నారు. సీఎం ఢిల్లీ పర్యటన తీరు చూస్తే ఐదేళ్లలో ఆయన 125 మార్లు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ఢిల్లీకి గులాంగిరీ తప్పదని గతంలో తాము చెప్పిందే వాస్తవమవుతోందన్నారు. నిధులు తెస్తానంటూ మోసగిస్తున్నాడు: కేంద్రంలోని పెద్దలను ఒప్పించి రాష్ట్రానికి నిధులు తెస్తానంటూ నమ్మబలుకుతున్న రేవంత్ ఇప్పటి వరకు రాష్ట్రానికి తెచ్చిన నిధుల లెక్క తేల్చాలన్నారు. కేంద్ర బడ్జెట్‌తోపాటు ఇటీవల వరద సాయంలో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని చెప్పారు. -
AP: ప్రజాప్రభుత్వ చిత్తశుద్ధికి తార్కాణం ఇది!
సాక్షి, తాడేపల్లి: అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు ఏ ఆటంకం లేకుండా అందాలనేది జగనన్న ప్రభుత్వ ఉద్దేశం. ఆ ఉద్దేశానికి తగ్గట్లే మేనిఫెస్టోను ప్రకటించి.. ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ పోతున్నారు సీఎం వైఎస్ జగన్. కులం, మతం, పార్టీ, ప్రాంతం.. లేకుండా అవినీతి, పక్షపాతానికి తావు లేకుండా పారదర్శకంగా.. నేరుగా లబ్ధిదారుల వద్దకే చేరుతున్నాయి కూడా. ఈ తరుణంలో.. రాష్ట్రంలోని వయోవృద్ధులకు, అర్హులైన ఇతరులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద.. నెలవారీ ఫించన్లను అందజేస్తోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ప్రతి నెల ప్రారంభంలో గ్రామ వలంటీర్లు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్‌ను దగ్గరుండి అందజేస్తున్నారు. ఇక సెప్టెంబర్ 2022 నెలకు సంబంధించిన ఫించన్‌ను అక్టోబర్ 1వ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నారు వలంటీర్లు. ఆ నగదు అక్షరాల 1,590.50 కోట్ల రూపాయలు. సుమారు 62.53 లక్షల మంది ఫించన్‌దారులకు ఈ నగదు పంచబోతున్నారు వలంటీర్లు. అయితే గత ఏడేళ్లలో సెప్టెంబర్ నెల గణాంకాలను ఓసారి పరిశీలిస్తే.. సెప్టెంబర్ 2022 - రూ.1,590.50 కోట్లు సెప్టెంబర్ 2021 - రూ.1,397 కోట్లు సెప్టెంబర్ 2020 - రూ.1,429 కోట్లు సెప్టెంబర్ 2019 - రూ.1,235 కోట్లు సెప్టెంబర్ 2018 - రూ. 477 కోట్లు సెప్టెంబర్ 2017 - రూ. 418 కోట్లు సెప్టెంబర్ 2016 - రూ. 396 కోట్లు సెప్టెంబర్ 2015 - రూ. 405 కోట్లు.. ఇలా గత ప్రభుత్వం మధ్యలో కోత ద్వారా పెన్షన్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే.. అధికారంలోకి రాగానే అర్హులైన వాళ్లందరినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుర్తించింది . అంతేకాదు లబ్ధిదారులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా వేల కోట్ల రూపాయలను సకాలంలో అందజేస్తూ తన చిత్తశుద్ధిని ప్రదర్శిస్తోంది జగనన్న ప్రభుత్వం. -
అన్నొచ్చిన వేళ.. కుప్పంలో పండుగ వాతావరణం
సాక్షి, చిత్తూరు: అక్కడేం ఎన్నికలు జరగడం లేదు. విజయోత్సవాల నిర్వహణ అంతకన్నా కాదు. అయినా పండుగకు ఏమాత్రం తీసిపోని వాతావరణం వెల్లివిరిసింది. రాజన్న బిడ్డ తమ గడ్డకు సీఎం హోదాలో వచ్చిన వేళ.. మురిసిపోయిన కుప్పం జనసంద్ర సంబురమే అదంతా!. అడుగడుగునా స్వాగత తోరణం.. వయసుతో సంబంధం లేకుండా ‘వైఎస్ జగన్’ నినాదాలు. తమ సంక్షేమం కోసం ఆలోచిస్తున్న నేతను చూడాలనే ఉత్సాహం, అంతకు మించి అభిమానం.. మూడు కిలోమీటర్ల మేర వాళ్లను ఎండనుసైతం లెక్కచేయకుండా నిలబెట్టింది. సంక్షేమ పథక అమలుతో పాటు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తమ చెంతకు వచ్చిన రాజన్న బిడ్డకు జనం పట్టిన నీరాజనం ఇది. కుప్పం పాత పేట వద్ద హెలిప్యాడ్ చెంత నుంచి సభా ప్రాంగణ వేదిక దాకా.. దారి వెంబడి వైఎస్ కుటుంబ అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు బారులు తీరారు. జగనన్న అంటూ యువత నినాదాల నడుమ.. ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది కుప్పం. తమ బాగోగులు చూస్తున్న మనవడి కోసం అవ్వాఅయ్యాలు.. పెద్దకొడుకులా కుటుంబానికి అండగా నిలుస్తున్నందుకు అమ్మలు, తోబుట్టువుల్లాగా తమను ఆదరిస్తున్నందుకు అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు.. విద్యను అందిస్తూ మేనమామ కోసం విద్యార్థులు కుప్పంలోనూ తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చంద్రబాబు ఇలాకాగా, టీడీపీ కంచుకోటగా జబ్బలు చరుచుకునే పచ్చ నేతలకు.. జన నేతకు లభిస్తున్న సాదర ఘనస్వాగతం ఏమాత్రం మింగుడుపడని విషయమే!. ముప్ఫైమూడు ఏళ్లలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని కుప్పంలో.. ఈ మూడేళ్లలో సీఎం జగన్ ఎంతో చేసి చూపించారని, జనసంక్షేమ పథకాలను తాము అర్థం చేసుకున్నామని అంటున్నారు అక్కడి జనం. ఇక ఈ జోష్‌తో.. వచ్చే ఎన్నికల్లో కుప్పం గడ్డ జగన్ అడ్డాగా మారబోతోందని, అక్కడ కూడా వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. -
జన సంక్షేమమే లక్ష్యంగా...
ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ 341 రోజుల సుదీర్ఘకాలం ప్రజాసంకల్పయాత్రలో జన జీవితాలను నిశితంగా గమనించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాని ప్రభావం ఎంత ఉన్నదో చెప్పడానికి అధికారం స్వీకరించింది మొదలు గత పక్షం రోజులుగా ఆయన చేస్తున్న ప్రసంగాలు, తీసుకుంటున్న నిర్ణయాలే తార్కాణం. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం తొలి సమావేశంలో చేసిన తీర్మానాలన్నీ దానికి కొనసాగింపు మాత్రమే. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయగానే నవరత్నాల్లో ఒకటైన అవ్వాతాతల పింఛన్ పెంపు హామీపై ఆయన తొలి సంతకం చేశారు. ఆ ప్రమాణస్వీకారోత్సవ సభలోనే తన ప్రాధమ్యాలేమిటో, రానున్న అయిదేళ్ల కాలంలో తన అడుగులు ఎటువైపో స్పష్టంగా తెలియజేశారు. అనంతరం గత గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన తొలి అధికార సమీక్షలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై దృష్టి సారించి రైతు సంక్షేమానికి చేయవలసిందేమిటో అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ప్రతి రైతు కుటుంబానికీ రూ. 12,500 పెట్టుబడి సహాయంగా అందించడానికి ఉద్దేశించిన వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అనుకున్న దానికంటే ముందే... అంటే రబీ నుంచే అమలు చేయాలని నిశ్చయించుకున్నట్టు ప్రకటించారు. దీని వెంబడే వివిధ వర్గాలవారి సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న అనేక ఇతర నిర్ణయాలు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశాయి. తొలి కేబినెట్ భేటీలోనే అవినీతి రహితమైన పారదర్శక పాలన లక్ష్యంగా పని చేయాలని మంత్రివర్గ సహచరులకు జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయడం... అవినీతి మరక అంటి, ఆరోపణలు రుజువైన పక్షంలో ఎవరినైనా మంత్రివర్గం నుంచి తొలగించడానికి వెనకాడబోనని చెప్పడం హర్షించదగ్గది. అయిదేళ్ల తెలుగుదేశం పాలనా కాలం ఎంతగా అవినీతిలో కూరు కుపోయిందో, అధికార యంత్రాంగం ఎంత నిస్సహాయంగా ఉండిపోయిందో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఇసుక మొదలుకొని బడా ప్రాజెక్టుల వరకూ అన్నిటిలోనూ అవినీతి వరదలై పారడం అందరినీ విస్మయ పరిచింది. మంత్రుల్ని డమ్మీలుగా మార్చి చంద్రబాబు, ఆయన అంతేవాసులు నలుగురైదుగురు పాలన మొత్తాన్ని చెరబట్టిన వైనం వల్ల రాష్ట్రం గత అయిదేళ్లలో నీరసించింది. వ్యవస్థలన్నీ పడకేశాయి. తన ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా దీని ఫలితాలను ప్రత్యక్షంగా చూడటం వల్లే మంత్రివర్గ సమావేశాన్ని జగన్ అత్యంత ప్రజాస్వామికంగా నిర్వహించారు. ఇందులో చర్చిస్తున్న అంశాలపై సూచనలు, సలహాలు, అభ్యంతరాలుంటే నిస్సంకోచంగా చెప్పవచ్చునని ఆయన సమావేశ ప్రారంభంలోనే మంత్రులకు సూచించారు. కనుకనే గ్రామ, పట్టణ వలంటీర్ల నియామకాలకు ఎలాంటి విద్యార్హతలుండాలనే అంశంలోనైనా, గిరిజన ప్రాంతాల్లో ఉండే వైద్య వలంటీర్ల జీతాల విషయంలోనైనా క్షేత్ర స్థాయి వాస్తవాలకు అనుగుణమైన నిర్ణయాలు వెలువడ్డాయి. సమావేశ ఎజెండాలో లేని వైద్య వలంటీర్ల జీతాల అంశంపై నిర్ణయం తీసుకోవడం కూడా దీనివల్లనే సాధ్యపడింది. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే జీతాలను రూ. 18,000 పెంచాలన్న ప్రతిపాదనపై చర్చ జరిగిన సందర్భంగా ఇది ఆర్థిక భారం అవుతుందేమోనని కొందరు సందేహం వ్యక్తం చేసినప్పుడు ‘వారు చేస్తున్న పనికి ఎంత జీతం ఇచ్చినా సరిపోద’ంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన మంత్రివర్గ సహచరుల ఆలోచనా దృక్పథాన్ని పదునుదేరుస్తాయి. పాలనలో నిరంతరం మానవీయ స్పర్శ ఉండాలన్న స్పృహను కలిగిస్తాయి. వివిధ శాఖలకు సంబంధించి తన ముందు కొచ్చే ఏ ప్రతిపాదన అయినా మంత్రులతో చర్చించి వారి ప్రమే యంతోనే రూపొందాలని అధికారులకు ఆయన స్పష్టం చేసిన తీరు కూడా ప్రశంసించదగ్గది. అన్ని శాఖల్లోనూ సంబంధిత మంత్రుల క్రియాశీల పాత్ర కీలకమని చెప్పడం ద్వారా వారి ఆలోచన లకూ, అభిప్రాయాలకూ అత్యంత ప్రాధాన్యత ఉంటుందని తెలియజేసినట్టయింది. ఇందువల్ల విధానాల రూపకల్పనలో యాంత్రికత స్థానంలో సృజనాత్మకత పెరుగుతుంది. ఈ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వైఎస్సార్ కాంగ్రెస్‌కు అందించిన ఆధిక్యత అసాధారణమైనది. దీనికి దీటుగా ఒక సమర్ధవంతమైన, క్రియాశీలమైన పాలనను అందించి వారి ఆకాంక్షలను నూరు శాతం నెరవేర్చాలన్న పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మంత్రివర్గం కూర్పులోనే ఆయన దీన్ని ప్రస్ఫుటం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండే నాయకుడు తన విధివిధానాలను ఖరారు చేసుకుని, దానికి అనుగుణమైన ఎజెండాను రూపొందించుకుని రంగంలోకి దిగుతాడు. ఆ దిశగా పరిపాలనా శకటాన్ని ముందుకు నడపాలంటే ముందుగా చేయాల్సింది మంత్రివర్గ నిర్మాణం. ఆ కసరత్తు అత్యంత సంక్లిష్టమైనది. నాయకుడి దీక్షాదక్షతలు, చాకచక్యమూ, ముందుచూపూ వెల్లడయ్యేది ఆ కసరత్తులోనే. అన్ని వర్గాలనూ, ప్రాంతాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. అటు సామాజిక న్యాయానికి, ఇటు ప్రాంతాల ఆకాంక్షలకు మధ్య సమతూకం చూడాలి. అనుభవాన్ని గుర్తించాలి. దిగ్గజాలనదగ్గవారిని ఎక్కడెక్కడ వినియోగిం చుకోవాలో లెక్కేసుకోవాలి. అదే సమయంలో కొత్తగా ఎదిగివస్తున్నవారిలో ఎవరెవరికి ఏఏ రంగాలపై లోతైన అవగాహన ఉన్నదో అంచనా వేసుకోవాలి. ఇన్నిటిని బేరీజు వేసుకుంటూ జగన్ రూపొందించిన కేబినెట్లో దాదాపు 60 శాతం మంత్రి పదవులు, అత్యంత కీలక శాఖలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు లభించాయి. అంతేకాదు... స్పీకర్ పదవిని కూడా బీసీ వర్గానికే ఇవ్వడం, ఎస్సీ మహిళకు హోంమంత్రిత్వశాఖ బాధ్యతలు అప్పగించడం, ముగ్గురు మహిళలకు కేబినెట్లో స్థానం కల్పించడం జగన్ విలక్షణ శైలికి అద్దం పడుతుంది. ఇప్పుడు కేబినెట్ తొలి సమావేశంలో జరిగిన చర్చలైనా, తీసుకున్న నిర్ణయాలైనా ప్రజానీకం ఆశలకూ, ఆకాంక్షలకూ అను గుణంగా ఉన్నాయి. ఇలాంటి పాలన చిరకాలం వర్థిల్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. -
ఉపాధి పనుల జోరు
సాక్షి,మక్తల్ :ఐదు రకాల ఫాంపాండ్స్ ఏర్పాటుకు ఉపాధి పథకం పనులను చేపడుతుంది. ఇందులో 20–20 సైజ్‌కు రూ.1లక్ష40వేలు, 9.5–9.5 రూ.82వేలు, 8 బై 8 రూ.71వేలు, 6 బై 6కు రూ.42 వేలు, 2 బై 2కు రూ.24 వేలు డబ్బులు వెచ్చిస్తారు. రైతులు తమ పొలాల్లో అతి తక్కువ భూమి ఒక అర గుంటలో ఈ నిర్మాణాన్ని చేపట్టవచ్చు. ఈ నిర్మాణం పూర్తయితే దీని ద్వారా వర్షపు నీటిని నిలువ చేయవచ్చు. తద్వారా నీరు భూమిలో భాగా ఇంకి భూగర్భజలాలు పెరుగుతాయి. అదే పనిగా వర్షం కురిస్తే నీటిని నిలువ చేసుకోవచ్చు. దీంతో పొలానికి ఈ నీటిని వినియోగించుకోవచ్చు. అదే విధంగా పొలాల్లో క్రిమిసంహారక మందులను వేసేందుకు ఈ నీటి ద్వారా మందులను కలిపి పిచికారీ చేసి చల్లవచ్చు. దీంతో పాటు పశువుల దప్పికను తీర్చేందుకు ఈ నీటిని తాపవచ్చు. 15–20 రోజుల వరకు వర్షం పడని సమయంలో ఈ నీటిని పొలాలకు మల్లించుకోవచ్చు. ఇన్ని ప్రయాజనాలు ఉన్న ఫాంపాండ్లను రైతులు తప్పనిసరి తమ పొలాల్లో నిర్మించుకునేటట్లు ఉపాధి పథకం ద్వారా అధికారులు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులు.. ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలో 8,390 జాబ్‌కార్డులు, 629 శ్రమశక్తి సంఘాలున్నాయి. ఇందులో ఈ ఏడాది 5 వేల నుంచి 6 వేల మందికి ఉపాధి పనులు కల్పిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఫాంపాండ్స్, ఫీడర్ చానల్స్, మ్యాజిక్ షోఫిట్స్, కామన్ షోఫిట్స్( ఇంకుడు గుంతలు), క్యాటిల్షెడ్స్(పశువుల పాకాలు), డంపింగ్‌యార్డుల నిర్మాణాలు, వైకుంఠధామాలు, గ్రామ కంఠాల్లో కంప చెట్ల తొలగింపు, చెట్లు నాటడం మొదలైన పనులు చేపడుతున్నారు. ఇంటింటికి ఇంకుడుగుంత.. భూగర్భజలాలు అడుగంటుతున్న నేపథ్యంలో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ఇంటింటికి ఇంకుడు గుంత నిర్మాణాలను ప్రభుత్వం ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరి అయితే గ్రామాల్లో, పట్టణాల్లో భూగర్భజలాలు బాగా వృద్ది చెంది బోర్లల్లో నీరు వస్తుందనేది ప్రభుత్వ లక్ష్యం. నీటి వినియోగం బాగా పెరిగిన దృష్ట్యా ఇంకుడు గుంతలు ఎంతో సత్పాలితాలు ఇస్తున్నాయి. అందుకే ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి ఈ ఏడాది నిర్మాణాలను చేపట్టింది. చేపల చెరువు.. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా చేపల చెరువుల నిర్మాణమొకటి. చేపల చెరువులకు రూ.96,500 కేటాయించింది. ఈ పనుల్లో సాముహిక చేపల చెరువు, వ్యక్తిగత చేపల చెరువుల నిర్మాణాలను ప్రభుత్వం ప్రోత్సహించింది. ఇందులో రైతులు మత్స్యకారులు ముందుకు వస్తే నిర్మాణాలను ఉపాధి పథకం ద్వారా చేపడుతుంది. ఇందులో రైతుకు ఉన్న నీటి వనరుల ద్వారా ఈ చెరువులో నీటిని నింపుకోవచ్చు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ చేపలతో ప్రయోజనం కలుగుతుంది. 3వేల మందికి ఉపాధి కల్పించాలి కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి పంచాయతీకి 150 మందికి, మండలంలో 3వేల మందికి ఉపాధి కల్పించాలి. ఫాంపాండ్స్ నిర్మాణాలు ఎక్కువ చేపట్టాలన్నారు. దీంతో పాటు డంపింగ్‌యార్డులను గ్రామాల్లో చేపట్టి, మూడు సంవత్సరాలు ఉపాధి పథకం ద్వారా ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులను నియమించుకోని వారికి దినసరి కూలీ చెల్లించి చెత్తను తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం. – రమేష్‌కుమార్, ఎంపీడీఓ, నర్వ -
జగన్‌తో సంక్షేమ రాజ్యం సాధ్యం
బొబ్బిలి రూరల్ విజయనగరం : రాజన్న సంక్షేమ రాజ్యం వై.ఎస్.జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీని వాసరావు(చిన్న శ్రీను) అన్నారు. బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామంలో గురువారం పర్యటించిన ఆయన ముందుగా గ్రామంలోని వైఎ స్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. సంక్షేమ ఫలాలు రాజశేఖర్‌రెడ్డి అందరికీ అందించారని, పింఛన్లు, ఇళ్లు పార్టీలకు అతీతంగా పంపిణీ చేశారని, అదే చంద్రబాబునాయుడు అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని, జగన్ అధికారంలోకి వస్తే ఏ రాష్ట్రంలో చికిత్సచేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తించేలా పథకం అమలు చేస్తారన్నారు. మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు వైఎస్సార్ సీపీ ఫ్యాన్ గుర్తుపై గెలిచి తమ ఆస్తులు కాపాడుకునేందుకు, పదవి కోసం పార్టీమారారని విమర్శించారు. ఆయన రెండేళ్ల పదవీకాలంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. చెరకు రైతుల బకాయిలపై ఎన్సీఎస్ యాజమాన్యాన్ని నిలదీశారా....? మూడు వేలమంది కార్మికులను రోడ్డున పడేసిన జ్యూట్ మిల్లు యాజమాన్యాన్ని ప్రశ్నించి కార్మికులను కాపాడారా...? అని ప్రశ్నించారు. తాము పీఏలు లేని నాయకులమని, 24గంటలూ అందుబాటులో ఉంటామని, అపాయింట్మెంట్ లేకుండా కలవొచ్చన్నారు. ఎంపీ అశోక్‌ను ఎవరైనా చూసారా...? ఆయన మనకు కనిపించని నాయకుడని, బొత్స సత్యనారాయణ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎవరూ భయపడొద్దని, వైఎస్సార్సీపీలోకి రావాలని పిలుపునిచ్చారు. బొబ్బిలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త శంబంగి వెంకట చినఅప్పలనాయుడు మాట్లాడుతూ తాము గతంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని, మంత్రిగా సుజయ్‌కృష్ణ రంగారావు ఏమి చేశారని ప్రశ్నించారు. ఆయన సోదరుడు బేబీనాయన యువతకు మద్యం, డబ్బులు ఇచ్చి పాడుచేస్తున్నారని, రాజకీయాలు భ్రష్టుపట్టించారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఇంటి గోపాలరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సావు కృష్ణమూర్తినాయుడు, పెద్దింటి రామారావు, బోను అప్పలనాయుడు, తెంటు సత్యంనాయుడు, శంబంగి వేణుగోపాలనాయుడు, అల్లాడ నగేష్, పువ్వల నరసింహులునాయుడు, అడబాల కృష్ణారావు, రేజేటి విసు, డమ్మా అప్పాజీ, పాలవలస ఉమాశంకరరావు, ఇంటిగోవిందరావు, దిబ్బగోపి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల కోసం పనిచేయడం అదృష్టం
శ్రీకాకుళం సిటీ : ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సర్వ సాధారణమని, ప్రజాసేవలో పనిచేయడం అందరి అదృష్టంగా భావించాలని జిల్లా ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ అన్నారు. జిల్లా పోలీస్ సమావేశ మందిరంలో సోమవారం ఎచ్చెర్ల సాయుధ దళ ఏఆర్ఎస్ఐ పైడిపాటి అప్పలనరసింహాచారి పదవీవిరమణ అభినందన కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1979వ సంవత్సరంలో కానిస్టేబుల్‌గా పోలీస్‌శాఖలో చేరి ఏఆర్ఎస్ఐ స్థాయికి ఎదిగిన అప్పలనరసింహాచారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, డీఎస్పీలు జి.చంద్రబాబు, ఎల్వీ శ్రీనివాసులు, సీఐ జి.శ్రీనివాసరావు, ఏఆర్ ఆర్ఐ డి.కోటేశ్వరరాబాబు, పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ కె.అప్పన్న, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ ప్రజల్లో చైతన్యానికే పోలీసులు
కోటపల్లి(చెన్నూర్): మారుమూల గ్రామీణ ప్రజలను చైతన్యపర్చడానికి, వారితో మమేకం కావడానికి పోలీసులు ఉన్నట్లు పోలీసు కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. మంగళవారం మండలలంలోని జనగామ గ్రామంలో కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన కళాబృందం ద్వారా ప్రజల్లో అవగాహన, చైతన్యం తీసుకరావడానికి, పోలీసులు ఉంది ప్రజల కోసమని తెలియజేసే విధంగా కళా ప్రదర్శనతో ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కళాప్రదర్శనతో మూఢ నమ్మకాలు, రోడ్డు ప్రమాదాలు, మద్యం సేవించడం వల్ల కలిగే నష్టాలు, ర్యాగింగ్, నక్సలిజం, బాల్యవివాహలు, గల్ఫ్ మోసాలు, ఎయిడ్స్, రైతుల అత్మహత్యలు వివిధ రకాల సమస్యలపై గురించి నాటకాల రూపంలో ప్రదర్శించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించాలని తెలిపారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా జేపీవో నరేష్‌కు తెలియపర్చాలని, గ్రామంలో ఎవరూ మద్యం బెల్ట్ షాపులను నిర్వహించవద్దని ఆన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ వేణుగోపాల్‌రావు, జైపూర్ ఏసీపీ సీతారాములు, సీఐలు రమేష్, కిషోర్, ఎస్సైలు వెంకన్న, భూమేష్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గట్టు లక్ష్మణ్ గౌడ్, సర్పంచ్ పాల్గొన్నారు. -
పథకాలు సద్వినియోగం చేసుకోండి
రామకృష్ణాపూర్(చెన్నూర్): ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అర్హులైన వారంతా వినియోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. దీన్‌దయాల్‌జయంతి ఉత్సవాల్లో భాగంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని పలు వార్డుల్లో గురువారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కోసం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకం, సడక్ బీమా యోజన పథకంతో పాటు వివిధ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాగా పట్టణానికి చెందిన పలువురు యువకులు పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరుముల్ల పోషం, జిల్లా ఉపాధ్యక్షుడు బంగారి వేణు, ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, నాయకులు మేకల రమేష్, సతీష్, పూర్ణచందర్, బత్తుల నరేష్, రాంకిషోర్ , యూసఫ్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాలనే కీలకం
⇒దీనిపై అభ్యర్థులు లోతుగా అధ్యయనం చేయాలి ⇒ గ్రూప్-1 మూడో పేపర్లో దీనిపై ప్రత్యేక యూనిట్ ⇒ గ్రూప్-2, గ్రూప్-3ల్లోనూ ప్రశ్నలు ⇒ పాలనలో విలువలపైనా ప్రత్యేక చర్చ ⇒ ‘సాక్షి’తో టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ భూపతిరావు సాక్షి, హైదరాబాద్: ‘సమాజంలో పాలనే ప్రధానం. ప్రజా సంక్షేమానికి పథకాలు రూపొందించాలన్నా.. రూపొందించిన పథకాలను అమలు చేయాలన్నా పాలనా వ్యవస్థ తప్పనిసరి. ఆ వ్యవస్థ సరిగ్గా పనిచేసినప్పుడే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుంది. లేదంటే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన వ్యవస్థది కీలక పాత్ర. అందుకే ఏ పోటీ పరీక్షలోనైనా పాలనకు సంబంధించిన ప్రశ్నలు కచ్చితంగా ఉంటాయి. టీఎస్పీఎస్సీ నిర్వహించనున్న వివిధ పోటీ పరీక్షల్లోనూ పాలనపై ప్రత్యేకంగా ప్రశ్నలు ఉండనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పేపర్-3లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ను ఒక యూనిట్‌గా సిలబస్‌లో చేర్చింది. గవర్నెన్స్ పేరుతో ఉన్న మూడో సెక్షన్లో పాలనకు సంబంధించిన సమకాలీన అంశాలపై అభ్యర్థులకు అవగాహన ఎంతో అవసరం. సమాజ, సామాజిక సమస్యలు, ప్రజలు, వారి జీవన విధానంపట్ల అవగాహన లేని వారు అధికారులైతే పాలన సరిగ్గా చేయలేరు. కాబట్టి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ప్రభుత్వ పాలనపట్ల కచ్చితంగా అవగాహన ఉండాల్సిందే’ అని ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్, టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ భూపతిరావు పేర్కొన్నారు. ప్రభుత్వ పాలన అంశంపై అభ్యర్థులు సిద్ధం కావాల్సిన తీరు గురించి ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు. సంపూర్ణ అవగాహన అవసరం.. సమాజం, ప్రభుత్వ పాలన ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. సమాజంలో ప్రజలు కీలకమైతే పాలనలో అధికారులు, ఉద్యోగులే కీలకం. ప్రజా సంక్షేమం కోసం పాలన ను పక్కాగా కొనసాగించాలంటే వారికి పాలనపట్ల సంపూర్ణ అవగాహన ఉండాలి. అందుకే గ్రూప్-1 సిలబస్‌లో ఈ అంశాన్ని చేర్చాం. గ్రూప్-1 మెయిన్స్ పేపర్-3లో ఇండియన్ సొసైటీ, కాన్ిస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ ఉన్నాయి. అందులో ప్రభుత్వ పాలన (గవర్నెన్స్) ఒక యూనిట్‌గా 50 మార్కులకు ఉంటుంది. ఇక గ్రూప్-1 ప్రిలిమినరీలోనూ 13 అంశాలు ఇస్తే అందులో 9వ అంశంగా భారతదేశంలో పరిపాలన, ప్రభుత్వ విధానం గురించి ఉంటుంది. గ్రూప్-2 జనరల్ స్టడీస్‌లోనూ తెలంగాణ రాష్ట్ర విధానాల అంశంలో దీని గురించి ఉంటుంది. అలాగే పేపర్-2 మూడో విభాగంలో సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్లో పాలనకు సంబంధించిన అంశాలు ఉంటాయి. వివిధ రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి ఉంటాయి. ఇందులో రెండో విభాగంలోనూ ఓవర్వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్ిస్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ ఐదో అంశంలో గ్రామీణ పట్టణ పాలనలో 73, 74 రాజ్యాంగ సవరణల ప్రభావం గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఐదు విభాగాలపై దృష్టిపెట్టాలి... గ్రూప్-1 పేపర్-3లో మూడో యూనిట్‌గా గవర్నెన్స్ ఉంటుంది. అందులో ఐదు ప్రధాన విభాగాలు ఉంటాయి. వాటిపై అభ్యర్థులు దృష్టి సారించాలి 1. గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, ఈ-గవర్నెన్స్ తదితరాలు ఇందులో కేంద్ర స్థాయిలో పాలన వ్యవస్థ ఏ విధంగా వ్యవస్థీకృతమైందన్న అంశంపై అవగాహన ఉండాలి. రాజ్యాంగబద్ధ సంస్థలు (ఎలక్షన్ కమిషన్, సర్వీస్ కమిషన్, కాగ్ తదితర) వాటి పని తీరుపై అవగాహన పెంపొందించుకోవాలి. ఎలక్షన్ కమిషన్, కాగ్ వంటివి శాసన వ్యవస్థపై చూపుతున్న ప్రభావం, వాటి పనితీరును విశ్లేషించగలగాలి. వాటికి సంబంధించిన నేపథ్యం, వాస్తవాలు తెలుసుకోవాలి. కేంద్ర మంత్రి మండలి, కేబినెట్ సెక్రటేరియట్, ప్రధాన మంత్రి కార్యాలయం, మంత్రి మండ లి సచివాలయం, కేంద్ర సచివాలయం, వివిధ శాఖలు, వాటి పనితీరు ఎలా ఉందన్నది తెలుసుకోవాలి. రాజ్యాంగబద్ధ సంస్థలు (ఎలక్షన్ కమిషన్ వంటి), యూపీఎస్సీ, ఫైనాన్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘం, ఎస్సీ, ఎస్టీ, మహిళా జాతీయ కమిషన్లు, వాటి పని తీరు, ప్రభావం గురించి ఇందులో ఉంటాయి. పార్లమెంటరీ కమిటీలు, ఎస్టిమేట్స్ కమిటీలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలు వాటి ఉద్దేశాలు, లక్ష్యాలు, సాధించిన ప్రగతికి సంబంధించిన కీలక అంశాలను విశ్లేషించాలి. 2. రాష్ట్ర స్థాయిలో పాలనా వ్యవస్థ ఎలా వ్యవస్థీకృతమైందన్నది తెలుసుకోవాలి. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయిలో పాలన ఎలా ఉంది, జిల్లా కలెక్టర్ల పాత్ర ఏమిటి, సచివాలయం, డెరైక్టరేట్లు ఏం చేస్తాయి, వాటి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయన్న దానిపై విశ్లేషించాలి. ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారు. ఎలా పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వారు పని తీరు ఎలా ఉందన్నది తెలియాలి. రాష్ట్ర ఆర్థిక సంఘం విధులు ఏమిటి, పాలనపై లెజిస్లేటివ్ నియంత్రణ ఎలా ఉంది, ఎగ్జిక్యూటివ్ నియంత్రణ, జ్యుడీషియరీ నియంత్రణపట్ల అవగాహన పెంపొందించుకోవాలి. ఇటీవల కాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి పాలనాపరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళా సాధికారత, ఆహార భద్రత వంటి పథకాలపైనా దృష్టి పెట్టాలి. కోఆపరేటివ్ విధానాలు ఏమిటి...వాటి పూర్వాపరాలను విశ్లేషించాలి. రాష్ట్ర స్థాయిలో ప్రధాన సంక్షేమ పథకాలు ఏమిటన్న అవగాహన ఉండాలి. ప్రస్తుతం అధికారాలన్నీ కేంద్ర స్థాయిలో ఉన్నాయి. బాధ్యతలు రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి. ఇలాంటప్పుడు ప్రజలకు ఆ ప్రయోజనాలు ఎలా అందుతున్నాయి.. అధికార వికేంద్రీకరణ ఎలా కొనసాగుతోందన్నది విశ్లేషించాలి. 3. ప్రధానంగా 73, 74 రాజ్యాంగ సవరణల తరువాత పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ సంస్థలు ఎలా పని చేస్తున్నాయి... 73, 74 రాజ్యాంగ సవరణల ఫలితాలు, ప్రయోజనాలు ఏమిటన్నది రాయగలగాలి. వాటి ప్రభావాన్ని విశ్లేషించాలి. స్థానిక సంస్థల పరిస్థితి ఏమిటి... వాటికి నిధులు ఎలా సమకూరుతున్నాయి... ప్రజా సమస్యల పరిష్కారంలో వాటి కృషి ఏమిటన్నది చెప్పేలా పరీక్షలకు సిద్ధం కావాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వివిధ సంస్థలు, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలు తీరు, ప్రయోజనాలు తెలియాలి. సామాజిక అభివృద్ధిలో ప్రభుత్వంతోపాటు పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాల భాగస్వామ్యాన్ని వివరించాలి. వాటి పనితీరు, ఫలితాలపై అవగాహన ఉండాలి. మహిళా సాధికారతకు ప్రభుత్వ కృషి వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. 4. అభివృద్ధి, వివిధ అభివృద్ధి ప్రక్రియలపై చర్చించేలా అవగాహనను పెంపొందించుకోవాలి. సివిల్ సొసైటీ, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్లు, పీపీపీ విధానం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వంటి అంశాలను విశ్లేషించాలి. సమాజ అభివృద్ధిలో ఎన్జీవోలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌ల పాత్ర ఏమిటన్నది తెలుసుకోవాలి. ప్రస్తుతం మరో ప్రధాన అంశం పీపీపీ విధానం. సమస్యలను కేవలం ప్రభుత్వమే పరిష్కరించలేదు కాబట్టి రోడ్లు, రైలు రంగాలను తీసుకుంటే.. పీపీపీ విధానంలో రోడ్లు వేయడం, మెట్రో రైలువంటి ప్రాజెక్టులు ప్రధానమైనవి ఈ కోవలోకే వస్తాయి. ప్రత్యేకంగా సామాజిక అభివృద్ధికి పారిశ్రామిక, వ్యాపార వర్గాల భాగస్వామ్యంపైనా విశ్లేషించాలి. 5. ప్రభుత్వ పాలనలో నైతిక విలువలు మరో ప్రధాన అంశం. ప్రభుత్వ పాలనలో స్మార్ట్ గవర్నెన్స్ కచ్చితంగా ఉండాల్సిందే. సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్, ట్రాన్స్పరెంట్ విధానానికి ప్రాధాన్యం ఇచ్చేదే స్మార్ట్ గవర్నెన్స్. అధికారంలో ఎవరున్నా రాజకీయాలతో సంబంధం లేకుండా అధికారులు, ఉద్యోగులు తటస్థంగా ఉండాల్సిందే. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ విధానాలను అమలు చేయాలి. క్షేత్రస్థాయిలో సరిగ్గా అవగాహన లేక ప్రస్తుతం నాయకులు, అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతున్న సందర్భాలున్నాయి. వాటి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టవచ్చని విశ్లేషించాలి. అవినీతిని ఎలా నిరోధించాలి.. అవినీతి నిరోధానికి ప్రస్తుతం ఉన్న లోకాయుక్త, ఏసీబీ, కన్జూమర్ ప్రొటెక్షన్ మెకానిజం, లోక్‌పాల్ వంటి వాటి పాత్ర ఏమిటన్న అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు, అధికారులు- రాజకీయ నాయకుల మధ్య సత్సంబంధాలు ఎలా ఉండాలన్నది చెప్పగలగాలి. సత్సబంధాలు లేకపోతే జరిగే నష్టాలను విశ్లేషించాలి. ఎథిక్స్ అండ్ వ్యాల్యూస్‌లో పబ్లిక్ సర్వెంట్‌గా వ్యవహరించే వ్యక్తికి ఉండాల్సిన అంకితభావం, విలువలు, నైతికత గురించి అడిగే అవకాశం ఉంటుంది. అలాగే లోకాయుక్త ప్రభావం, ఏసీబీ పనితీరు, లోక్‌పాల్ పరిస్థితి వాటి పని తీరుపై విశ్లేషించమని అడిగే అవకాశం ఉంటుంది. ఏం చదవాలంటే.. ప్రభుత్వ పాలనకు సంబంధించి తె లుగు అకాడమీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ముద్రించిన పుస్తకాలు ఉన్నాయి. పంచాయతీరాజ్ సిస్టం ఇన్ ఇండియా అనే పుస్తకం కూడా బాగుంటుంది. వీటితోపాటు జనరల్ బుక్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా పత్రికల్లో వచ్చే ఆర్టికల్స్, ఇతర వార్తాంశాలు, సమకాలీన అంశాలపై దృష్టి పెట్టాలి. ⇒ -
పేదలకు మాటలు.. పెద్దలకు చేతలు
⇒ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడతాం ⇒జిల్లాలో పార్టీ విస్తరణకు పకడ్బందీ ప్రణాళిక ⇒పోడు భూముల సమస్యపై మరో ఉద్యమం ⇒ఈ ప్రభుత్వానిదీ అవకాశవాద వైఖరే... ⇒సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పేదలకు మాటలు చెబుతూ పెద్దల కోసం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ అవకాశవాద వైఖరిని ఎండగట్టేందుకు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. శుక్రవారం నుంచి మూడురోజులపాటు మధిరలో జరిగే పార్టీ జిల్లా మహాసభలను పురస్కరించుకొని పార్టీ ఉద్యమ కార్యాచరణ- విస్తరణ అంశాలపై గురువారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత లేదు... ప్రజల సంక్షేమం కోసం రూపొందించిన అనేక పథకాల అమలులో కేసీఆర్ ప్రభుత్వానికే సరైన స్పష్టత లేదు. ప్రజలను ఆకట్టుకోవడానికి ఇచ్చే ప్రాధాన్యత పేదలకు సంక్షేమాన్ని పంచడానికి ఇవ్వలేకపోతున్నారు ఈ తరహా పాలనపై తమ పార్టీ రాబోయే రోజుల్లో ఆందోళనలు నిర్వహించడానికి సమాయత్తం అవుతోంది. జిల్లాలో సీపీఎంను అన్ని మండలాలు, గ్రామాల్లో మరింత పటిష్టపరిచేందుకు కార్యాచరణ రూపొందించుకుంటాం. ప్రజా ఉద్యమాల నిర్మాణం..ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించిన ఘనత మా పార్టీకి ఉంది. రూ.3.50లక్షలతో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తామన్న కేసీఆర్ ఇప్పుడు మాట మారుస్తున్నారు. అందులో రూ.లక్ష పేదలు చెల్లించాలన్న నిబంధన పెట్టారు. లక్ష రూపాయలు ఇవ్వగలిగిన వారు పేదవారు ఎలా అవుతారు?. ఎన్నో ఉద్యమాలు నిర్మించాం.. మూడేళ్లుగా జిల్లాలో ప్రధాన సమస్యల పరిష్కారం కోసం మా పార్టీ అనేక ఉద్యమాలు నిర్వహించింది. పాలక వర్గాలు దిగివచ్చి పలు సమస్యలను పరిష్కరించాయి. మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం మరిన్ని ఉద్యమాలు చేస్తాం. జిల్లాలో రూ.10 వేల కోట్లతో 10 లక్షల ఎకరాల భూమిని సాగు చేసే అవకాశం ఉంది. మూడు పంటలు పండించడానికి అనువైన పరిస్థితి ఉంది. వీటిపై ప్రభుత్వాన్ని కదిలించేందుకు సాగునీటి సాధన యాత్ర నిర్వహించాం. దుమ్ముగూడెం నుంచి పాలేరు వరకు, అక్కడి నుంచి ఖమ్మం వరకు 12 రోజులపాటు 1000 మందితో నిర్వహించిన పాదయాత్ర ప్రభుత్వాన్ని కదలించింది. మా ఆందోళనల ఫలితంగా అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ రూ.100 కోట్లు అదనంగా కేటాయించింది. దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా జిల్లా సస్యశ్యామలం కావాలంటే ప్రభుత్వం రూపొందించిన డిజైన్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఖమ్మం రూరల్ మండలం వరకే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మున్నేరు మీద అక్విడేట్ నిర్మించి దీని ద్వారా పాలేరు వరకు పొడిగిస్తే రెండున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశం ఉంది. అలాగే మరో రెండున్నర లక్షల ఎకరాలకు సాగర్ ద్వారా నీరు అందుతుంది. మేము చేసిన పోరాటాల ఫలితంగానే దుమ్ముగూడెం నుంచి సాగర్ టేల్‌పాండ్‌ను రద్దు చేశారు. దీనిపై కేసీఆర్ ప్రభుత్వం విధి విధానాలను వెల్లడించాల్సి ఉంది. భవిష్యత్‌లోనూ జిల్లాలో మిత్రపక్షమైన సీపీఐతో కలిసి ఐక్య కార్యాచరణ ఉద్యమాలు నిర్వహిస్తాం. ఐక్య ఉద్యమాల ఆవశ్యకత పెరిగింది... తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐక్య ఉద్యమాల ఆవశ్యకత మరింత పెరిగింది. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలనే డిమాండ్‌తో త్వరలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని యోచిస్తున్నాం. బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే డిమాండ్‌తో మరో ఉద్యమం చేస్తాం. జిల్లాలో అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. అటవీ అధికారులు, గిరిజనులను అనేక ఇబ్బందులు, వేధింపులకు గురి చేస్తున్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పూర్తి హక్కు కల్పించేందుకు గిరిజనులతో కలిసి ఓ పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. జిల్లాలో దళితులు, గిరిజనులకు విద్య, వైద్య, ఉపాధి, ఆరోగ్య అంశాల్లో తీరని అన్యాయం జరుగుతోంది. వీరికి ఆయా అంశాల్లో న్యాయం జరిగేందుకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వారి సంక్షేమానికే కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకతపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో జిల్లా నుంచి సీపీఎం ప్రధాన భూమిక పోషిస్తోంది. గత ప్రభుత్వాల బాటలోనే టీఆర్ఎస్...గత ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై పోరాడుతున్న పార్టీలపై నిర్బంధం కొనసాగించాయి. ఈ ప్రభుత్వం సైతం అదే ధోరణితో వ్యవహరిస్తోంది. జిల్లాలో అన్ని వర్గాల ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న సీపీఎం తమకు గల ప్రజా పునాదిని రాజకీయంగా మలచుకోవడంలో కొంత వెనుకబడి ఉంది. పకడ్బందీ రాజకీయవ్యూహాలతో తిరుగులేని శక్తిగా ఎదుగుతాం. నిజాం నవాబు నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి, వారి మూకల చేతిలో అమరులైన కొమరంభీమ్, దొడ్డి కొమురయ్యల త్యాగనిరతిని శ్లాఘిస్తూనే.. నిజాం నవాబును గొప్పవాడిగా పొగడటం కేసీఆర్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. దీనిపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను కేసీఆర్ నివృత్తి చేయాలి. టీఆర్ఎస్ వైఖరిని స్పష్టం చేయాలి. రాజకీయంగా గతంలో జరిగిన పొరపాట్లను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో అటువంటివి జరగకుండా మరింత చైతన్యవంతంగా వ్యవహరిస్తాం. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వకుండా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఆ తర్వాత పార్టీలో మెజార్టీ సభ్యులు వ్యక్తం చేశారు. జిల్లాలో తునికాకు సేకరిస్తున్న గిరిజనులకు న్యాయమైన కూలి, పూర్తిస్థాయి బోనస్ లభించేందుకు ఉద్యమాలు చేయాలని యోచిస్తున్నాం. మూడు రోజులపాటు మధిరలో జరిగే జిల్లా మహాసభల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు తదితరులు పాల్గొంటారు.