సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు మూ టల లెక్కలు చెప్పేందుకే సీఎం రేవంత్‌రెడ్డి హస్తిన పర్యటనలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పేదల గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన బాస్‌లతో మంతనాలు చేస్తున్నారని మండిపడ్డారు. పదినెలల పాలనలో 23మార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రాష్ట్రానికి తెచి్చన నిధులు, చేసిన మేలు ఏమిటో చెప్పాలన్నారు. ఈ మేరకు సోమవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యధిక పర్యాయాలు ఢిల్లీకి వెళ్లిన సీఎంగా రేవంత్ రికార్డు సృష్టిస్తున్నారని అన్నారు.
సీటు కాపాడుకునేందుకే: అధిష్టానం మెప్పు కోసం తరచూ ఢిల్లీకి వెళుతున్న సీఎం రేవంత్ తన బాస్ లకు జై కొట్టి సీటును కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నాడని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ పాలనపై కాంగ్రెస్ అధిష్టానం సంతృప్తిగా లేనందునే పదేపదే ఢిల్లీకి పిలిచి ఆయనకు చివాట్లు పెడుతోందన్నారు. సీఎం ఢిల్లీ పర్యటన తీరు చూస్తే ఐదేళ్లలో ఆయన 125 మార్లు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ఢిల్లీకి గులాంగిరీ తప్పదని గతంలో తాము చెప్పిందే వాస్తవమవుతోందన్నారు. నిధులు తెస్తానంటూ మోసగిస్తున్నాడు: కేంద్రంలోని పెద్దలను ఒప్పించి రాష్ట్రానికి నిధులు తెస్తానంటూ నమ్మబలుకుతున్న రేవంత్ ఇప్పటి వరకు రాష్ట్రానికి తెచ్చిన నిధుల లెక్క తేల్చాలన్నారు. కేంద్ర బడ్జెట్‌తోపాటు ఇటీవల వరద సాయంలో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment