
వేడుకలకు హాజరయ్యే వాళ్లు ముఖకాంతి పట్లనే ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కానీ, చిన్న చిన్న లోపాలను సవరించుకుంటే టాప్ టు బాటమ్ అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు.
∙డ్రెస్ ఎంపిక పండగ కళను రెట్టింపు చేసేదై ఉండాలి. చీరలైనా, డ్రెస్సులైనా.. కాంతిమంతమైన రంగులు, డిజైనర్ వర్క్, సౌకర్యంగా ఉండేవి ఎంచుకోవాలి.
∙దుస్తుల తర్వాత ఎదుటివారు చూపు ముందు కేశాలంకరణ మీద పడుతుంది. శిరోజాలను శుభ్రపరిచి, ఆరబెట్టుకున్నాక సంప్రదాయ అల్లికలను ఎంచుకోవాలి. వీటిలో జడ లేదా ముడులలోనే ప్రత్యేక అలంకరణ అదీ సౌకర్యంగా ఉండేది ఎంపిక చేసుకోవాలి.
∙ముఖారవిందానికి కళ తెచ్చేవి కళ్లు, కనుబొమ్మలు, పెదాలు, ఎండ, ఉక్కపోతను దృష్టిలో పెట్టుకొని ఫౌండేషన్ ఎక్కువ వాడకుండా కళ్లు, కనుబొమ్మలు, పెదాలను తీర్చిదిద్దుకోవాలి.
∙ముఖంపైనే ప్రత్యేక శ్రద్ధ చూపించడం కాదు సౌందర్యపోషణలో గోళ్లది కూడా పధాన పాత్ర. చేతులు, కాలి గోళ్లను చక్కగా కత్తిరించి, చుట్టూ మురికి లేకుండా శుభ్రపరిచి, నెయిల్‌పాలిష్ వేయాలి. ఆభరణాలు, శాండిల్స్, హ్యాండ్ బ్యాగ్... ఇతరత్రా అలంకరణలకు ఆ తర్వాత ప్రాధాన్యమివ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు మీ సౌందర్యాన్ని మరింతగా ఇనుమడిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment