వరసిద్ధుని కొలువు పుష్ప శోభితం | flower decoration in kanipaka temple | Sakshi
Sakshi News home page

వరసిద్ధుని కొలువు పుష్ప శోభితం

Sep 22 2016 5:44 PM | Updated on Sep 4 2017 2:32 PM

విదేశీ పుష్పాలతో అలంకరించిన ధ్వజస్తంభం

విదేశీ పుష్పాలతో అలంకరించిన ధ్వజస్తంభం

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి కొలువు గురువారం విరుల సోయగంతో అలరారింది. కల్పవృక్ష వాహనసేవ సందర్భంగా ఆలయాన్ని పలు రకాల ఫలాలు, పుష్పాలతో అలంకరించారు.

–50కి పైగారకాలతో అలంకరణ
–మూడు టన్నుల వరకు వినియోగం
కాణిపాకం(ఐరాల): 
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి కొలువు గురువారం విరుల సోయగంతో అలరారింది.  కల్పవృక్ష వాహనసేవ సందర్భంగా ఆలయాన్ని పలు రకాల ఫలాలు, పుష్పాలతో అలంకరించారు.  ఫల, పుష్పాలతో చేసిన వినాయకుని ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే అంత్రాలయం, అర్ధమండపం, మూషిక మండపం, అన్వేటి, సుపథ మండపాలను విదేవీ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆన్వేటి మండపంలో ఏర్పాటు చేసిన ఆపిల్‌ పండ్ల  వినాయకుడు, పుష్పాలతో తయారు చేసిన వినాయకుడు, అలాగే బంగారు ధ్వజస్తంభానికి విదేశీ పుష్పాలంకరణలు భక్తుల ను  కట్టి పడేశాయి. పుష్పపల్లకి సేవ సందర్భంగా ఆలయం, పల్లకి అలంకరణలకు 50కి పైగా రకాల విదేశీ పుష్పాలు, సుమారు మూడు టన్నుల వరకు వినియోగించనున్నట్టు çకల్పవృక్ష వాహనసేవ ఉభయ దారులు తెలిపారు.
నేడు విమానోత్సవ సేవ 
 వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేకోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారికి విమానోత్సవ  సేవ జరుగుతుంది. కార్యక్రమం ఐరాల  కె.రామకృష్ణ పిళై ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
 
 
 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement