సిల్క్ స్పార్క్
పట్టు చీరల్లో పడతులు మెరిసిపోయారు. వెయ్యి ఓల్టుల వెలుగుల్లో క్యాట్‌వాక్‌లతో కేక పుట్టించారు. సిల్క్‌మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా మాదాపూర్ శిల్పకళా వేదికలో నిర్వహించిన ‘శ్రీమతి సిల్క్ మార్క్ 2014’ గ్రాండ్ ఫినాలేలో మోడల్స్‌ను తలపించేలా మగువలు మురిపించారు. పోటాపోటీగా సాగిన అంతిమ సమరంలో మొత్తం 18 మంది పోటీపడ్డారు. ఒకరిని మించి ఒకరు హంస నడకలతో వయ్యారాలు ఒలకబోశారు.
శ్రావణి తొలి స్థానం దక్కించుకున్నారు. నేహాసింగ్, సుస్మిత వరుసగా ఫస్ట్, సెకండ్ రన్నరప్‌లుగా నిలిచారు. సెరికల్చర్ మాజీ కమిషనర్ సీఎస్ రామలక్ష్మి, కొలార్జ్ సీఈఓ శ్రావణిరెడ్డి తదితరులు విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన సిల్క్ ఎక్స్‌పో ఈ నెల 29 వరకు కొనసాగుతుంది.
- మాదాపూర్