Neha singh
-
కాంగ్రెస్ శిబిరంలోకి సింగర్ నేహా సింగ్.. పోటీ చేస్తారా?
Singer Neha Singh Rathore : లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటనకు ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు మొదటి విడత అభ్యర్థుల జాబితాలు సైతం విడుదల చేశాయి. అయితే కొన్ని స్థానాలకు అభ్యర్థుల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా జానపద గాయని నేహా సింగ్ రాథోడ్ కాంగ్రెస్ టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్న చర్చ సాగుతోంది. ముంబైలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శిక్షణా శిబిరంలో నేహా సింగ్ రాథోడ్ ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆమె కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా నేహా సింగ్ రాథోడ్ మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు చేశారు. రాజకీయాల్లోకి రాబోతున్నారా అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయమని అడిగితే ఆలోచిస్తానని చెప్పారు. అలాగే త్వరలో తన కొత్త పాటను తీసుకువస్తున్నట్లు తెలిపారు. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబైలో లోక్‌సభ ఎన్నికల కోలాహలం అప్పుడే మొదలైపోయింది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనప్పటికీ నేతలు తమ కార్యకర్తలు, అనుచరులతో సన్నాహాలు ప్రారంభించారు. ముంబైలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శిబిరంలో కార్యకర్తలతో మాట్లాడిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. వ్యక్తిగత విబేధాలను పక్కనబెట్టి పార్టీ కోసం పని చేయాలని కోరారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడి లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీట్ల షేరింగ్‌కు ఎలాంటి ఫార్ములా ఖరారు కాలేదు. కానీ అన్ని పార్టీలు ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాయి. కాంగ్రెస్‌తో పాటు, శివసేన (యూబీటీ), ఎన్సీపీ శరద్ పవార్ వర్గం మహావికాస్ అఘాడిలో భాగంగా ఉన్నాయి. -
రాథోర్ పాటలకు పడి పోవాల్సిందే!
న్యూఢిల్లీ : ‘గౌరీ లంకేష్‌కు పట్టిన గతి నీకు పట్టవచ్చు’ అంటూ నేహా సింగ్ రాథోర్‌ను ఆమె స్నేహితులు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు. ఆ హెచ్చరికను ఆమె బుగ్గలపై చెదరని చిరు నవ్వుతో ఓ అభినందనగా స్వీకరిస్తున్నారు. హిందూ మత ఛాందస వాదులను విమర్శించినందుకు జర్నలిస్ట్, రచయిత గౌరీ లంకేష్‌ను 2017, సెప్టెంబర్‌లో బెంగళూరులో మతోన్మాదులు హత్య చేశారు. ‘ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు’ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఎప్పటికప్పుడు తన భోజ్‌పురి జానపద పాటల ద్వారా సునిశితంగా విమర్శిస్తోన్న నేహా సింగ్ రాథోర్‌కు గౌరీ శంకర్‌కు పట్టిన గతి పడుతుందన్నది ఆమె మిత్రులు, సామాజిక కార్యకర్తల ఆందోళన. ( అందరూ చస్తారు: ప్రయాణికురాలి హల్చల్) పాలక వర్గాలను విమర్శిస్తూ నేహా సింగ్ రాథోర్ పాడిన భోజ్‌పూర్ జానపదాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ ఆమెకు మంచి పేరు తెస్తున్నాయి. ‘ప్రజలకు ఉద్యోగాలిస్తారా లేదా నాటకాలేసుకుంటూ బతకమంటారా? నీవు అలంకరించిన అధికార పీఠం వంశపారంపర్యంగా నీ తండ్రి నుంచి వచ్చింది కాదనే విషయాన్ని తెలుసుకో!, అచ్చా దిన్ (మంచి రోజులు) వస్తాయని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, సంకలో జోలి, చేతికి చిప్ప ఇవ్వడమే మంచి రోజని తెలుసుకోలేక పోయాం!’ అనే భావాలతో ఆమె రాసి పాడిన పాటలు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్, బీహార్ సరిహద్దులోని జాండహ గ్రామంలో నివసిస్తోన్న రాథోర్, 2019 నుంచి పాటలు రాస్తూ, వాటికి సొంతంగా బాణీలు కూరుస్తూ పాడుతున్నారు. ‘ధరోహర్’ పేరిట ఆమె ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్‌కు దాదాపు లక్ష మంది సబ్‌స్రై్కబ్ చేశారు. ఆమె ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా మంచి ప్రజాదరణ సంపాదించారు. ఆమె అభిమానుల్లో సినిమా దర్శకులు, జర్నలిస్టులు, మాజీ అధికారులు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఉన్నారు. వారణాసికి వంద, పట్నాకు రెండు వందల కిలోమీటర్ల దూరంలోని జాండవ గ్రామంలో 8వ తరగతి వరకే పాఠశాల ఉండడంతో రాథోర్, రామ్‌గఢ్‌లో సెకండరీ ఎడ్యుకేషన్, యూపీలోని కాన్పూర్‌లో బీఎస్సీ చదివారు. -
సిల్క్ స్పార్క్
పట్టు చీరల్లో పడతులు మెరిసిపోయారు. వెయ్యి ఓల్టుల వెలుగుల్లో క్యాట్‌వాక్‌లతో కేక పుట్టించారు. సిల్క్‌మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా మాదాపూర్ శిల్పకళా వేదికలో నిర్వహించిన ‘శ్రీమతి సిల్క్ మార్క్ 2014’ గ్రాండ్ ఫినాలేలో మోడల్స్‌ను తలపించేలా మగువలు మురిపించారు. పోటాపోటీగా సాగిన అంతిమ సమరంలో మొత్తం 18 మంది పోటీపడ్డారు. ఒకరిని మించి ఒకరు హంస నడకలతో వయ్యారాలు ఒలకబోశారు. శ్రావణి తొలి స్థానం దక్కించుకున్నారు. నేహాసింగ్, సుస్మిత వరుసగా ఫస్ట్, సెకండ్ రన్నరప్‌లుగా నిలిచారు. సెరికల్చర్ మాజీ కమిషనర్ సీఎస్ రామలక్ష్మి, కొలార్జ్ సీఈఓ శ్రావణిరెడ్డి తదితరులు విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన సిల్క్ ఎక్స్పో ఈ నెల 29 వరకు కొనసాగుతుంది. - మాదాపూర్