Catwalk
-
ఎలినోర్ 1.0 ఫ్యాషన్..
మాదాపూర్: మోడల్స్, సినీతారలు ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తు హోయలోలికించారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో మంగళవారం ఎలినోర్ 1.0 ఫ్యాషన్ ఫర్ ఫండ్‌రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్యాషన్‌షోను వినూత్న పద్ధతిలో సంగీతం, నృత్యం, పాఠశాల విద్యార్థులతో థియోటర్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రావణ్‌కుమార్ థీమ్‌కు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన భారతీయ ఫ్యాషన్ వర్ణచిత్రాన్ని ప్రదర్శించారు. బ్రిటిష్ పాలనలో, స్వదేశీ ఉద్యమం తరువాత, రేగల్ వర్గాల వైభవంతో, ఆధునిక భారతదేశం వరకూ వస్త్రధారణ ధోరణులను ప్రదర్శించారు. ఈ మొత్తాన్ని జిల్లా పరిషత్ పాఠశాలలో 700 మంది చిన్నారులకు కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి వెచి్చంచనున్నట్లు శ్రవంతి కందారు తెలిపారు. ర్యాంప్‌వాక్‌లో సినీతారలు సంయుక్తమీనన్, ఫరియా అబ్దుల్లా, మిస్ ఇండియా వరల్డ్ 2023 నందినిగుప్త, సిమ్రాన్ చౌదరి, యుక్తిథారేజా, సాన్వే మేఘన, శివాతి్మక రాజశేఖర్, పావని కరణం, దీప్తివర్మ, భరత్ గార్లపాటి, రాహుల్ విజయ్ పాల్గొన్నారు. -
నడి రోడ్డుపై మహిళల ఫ్యాషన్ షో.. ఎందుకో తెలుసా?
భోపాల్: మహిళలు నడిరోడ్డుపై.. నీటి కుంటల వద్ద హొయలొలుకుతూ క్యాట్ వాక్ చేశారు. రోడ్డుపై ఫ్యాషన్ షో మొదలుపెట్టడం మధ్యప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. వారు అలా ఎందుకు చేశారో తెలుసా..? తమ ప్రాంతంలో రోడ్లు బాగా లేవని చెప్పేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు మహిళలు తెలిపారు. రోడ్డుపై గుంతలతో తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్పేందుకు.. అధికారుల నిర్లక్ష్యం చూపించేందుకు తాము ఈ తరహా ఆందోళన చేసినట్లు వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: పదో తరగతి పాసయిన మాజీ సీఎం.. దాంతోపాటు ఇంటర్ కూడా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని హోషంగాబాద్, ధనిశ్‌నగర్‌లో రోడ్లు బాగా లేవు. గుంతలు తేలడంతో రోడ్డు ప్రమాదకరంగా మారింది. దీనికి తోడు వర్షాలకు నీరు నిలిచి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టింపు లేకపోవడంతో నారీమణులు కొంగు బిగించి రోడ్డు బాట పట్టారు. ధర్నాలు, కార్యాలయాల ముట్టడితో పని లేదని విన్నూత్నంగా చేద్దామని ఫ్యాషన్ షో ప్లాన్ వేశారు. అనుకున్నదే తడువుగా ధనీశ్‌నగర్ మహిళలు బయటకు వచ్చారు. రోడ్డుపై గుంతలు ఉన్న చోట.. నీరు నిలిచిన చోట ప్రత్యక్షమయ్యారు. ఫ్యాషన్ షో మాదిరి క్యాట్ వాక్ చేస్తూ నడిచారు. బురదలోనే నడిచారు. రోడ్డు మరమ్మతులు వెంటనే చేయాలని తమ అందచందాలతో డిమాండ్ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో తాము ఈ విధంగా నిరసన చేపట్టినట్లు మహిళలు తెలిపారు. రోడ్డుపై ప్రమాదకరంగా గుంతలు తయారయ్యాయని వాపోయారు. మున్సిపల్ అధికారులు పన్నుల వసూళ్లపై చూపించే శ్రద్ధ ప్రజల సమస్యలను పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం చెల్లించే పన్నులను ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ మహిళల విన్నూత్న నిరసన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
క్యాట్‌వాక్ చేస్తూ కుప్పకూలి..
సౌపౌలో : ఫ్యాషన్ వీక్‌లో క్యాట్‌వాక్ చేస్తూ కుప్పకూలిన బ్రెజిల్ మోడల్ మరణించాడని నిర్వాహకులు తెలిపారు. సౌపోలో ఫ్యాషన్ వీక్ (ఎస్పీఎఫ్డబ్ల్యూ) ఈవెంట్ ముగింపు రోజు క్యాట్‌వాక్ చేస్తూ మోడల్ టేల్స్ సోర్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, అనంతరం చికిత్స పొందుతూ మరణించాడని నిర్వాహకులు వెల్లడించారు. 26 ఏళ్ల సోర్స్ క్యాట్‌వాక్ చేసి వెనుతివరిగి వస్తూ రన్‌వేపై పడిపోగా, హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించగా, అప్పటివకే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. సోర్స్ మరణం పట్ల ఫ్యాషన్ వీక్ నిర్వాహకులు సహా తోటి మోడల్స్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఎరుపు సింగారం..నడక వయ్యారం
-
ఆడిపాడిన బ్యూటీషియన్లు
-
ఆడిపాడిన బ్యూటీషియన్లు
బీచ్‌రోడ్ (విశాఖ తూర్పు) : అతివల అందాలకు మెరుగుదిద్దే బ్యూటీషియన్లంతా వేడుక చేసుకున్నారు. క్యాట్‌వాక్‌తో కేక పుట్టించారు. అందమైన భామలంతా ఒకే చోట చేరి హొయలుపోయారు. ఆడిపాడుతూ బ్యూటీషియన్స్ డేకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టారు. సంప్రదాయ వస్త్రధారణతోపాటు వెస్ట్రన్ స్టయిల్ జోడించి వారెవ్వా అనిపించారు. సోమవారం అంతర్జాతీయ బ్యూటీషియన్స్ డే సందర్భంగా ఓ ప్రైవేటు హోటల్లో విశాఖ బ్యూటీ థెరిపిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పీ చైర్ పర్సన్ లాలం భవానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో కళ్లు తిప్పుకోనివ్వలేదు. లేటెస్ట్ సాంగ్స్‌కు కాలు కదుపుతూ మహిళలు ఆకాశమే హద్దుగా ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో వీ టీమ్ వీరుమామా, అసోసియేషన్ అధ్యక్షురాలు అనురాధ, కార్యదర్శి లక్ష్మి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా తల్లీకూతుళ్లు కీడ్ని పూర్తిగా పాడైపోయిన కూతురుకు తన కిడ్నీ ఇచ్చి మరోసారి జన్మనిచ్చింది ఆ తల్లి. మురళీనగర్‌లో బ్యూటీ క్లినిక్ నడుపుతున్న గీతా శిరీష్‌కు ఐశ్వర్య అనే కూతురు ఉంది. తనకు 2014లో కిడ్నీ పాడైందని డాక్టర్లు తెలిపారు. ఐశ్వర్యకు సంవత్సరం పాటు డయాలసిస్ చేశారు. కిడ్నీ మార్చక పోతే ఆమె బతకదని డాక్టర్లు చెప్పారు. దీంతో కిడ్నీ ఇచ్చి పునర్జన్మ ప్రసాదించింది తల్లి గీతాశిరీష్. బ్యూటీషియన్ డేలో తల్లీకూతుళ్లు క్యాట్‌వాక్, డ్యాన్స్‌లతో అందర్నీ ఆకర్షించారు. తల్లి ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పిన గీతాశిరీష్కు ఈ సందర్భంగా నిర్వాహకులు సన్మానించారు. ఐశ్వర్య ప్రస్తుతం గీతం యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోంది. -
హైదరాబాద్‌లో సినీతార తాప్సీ సందడి
-
క్రేజీక్రేజీ క్యాట్‌వాక్
పెదవాల్తేరు: క్యూట్‌క్యూట్‌గా హాట్‌హాట్‌గా అందమైన భామలు క్యాట్‌వాక్ చేశారు. కళ్లుచెదిరే అందాలతో విరబూసిన పుష్పాల్లా వావ్ అనిపించారు. కలర్‌ఫుల్ శారీస్‌తో..గాగ్రాలతో కేక పుట్టించారు. వారికి పోటీగా హ్యాడ్సమ్ గైయ్స్ వెరైటీ గెటప్స్‌తో మైమరిపించారు. ఈ క్రేజీ ఈవెంట్‌కు హోటల్ గ్రీన్‌పార్కు వేదికైంది. ట్విలైట్ ఈవెంట్ మేనేజ్మెంట్ ‘మిస్టర్ అండ్ మిస్ పర్ఫెక్ట్–2016’ పోటీల్లో భాగంగా గ్రాండ్ ఫినాలే ఆదివారం జరిగింది. వయ్యారి హంస నడకలతో బ్యూటీలంతా సత్తా చాటారు. లైట్ మ్యూజిక్...కళ్లుచెదిరే లేజర్ లైటింగ్ మధ్య తారల్లా మెరిసిపోయారు. మిస్టర్ అండ్ మిస్ ఆంధ్రప్రదేశ్ కిరీటాన్ని కైవసం చేసుకునేందుకు యువతీ,యువకులు పోటీపడ్డారు. ఐదు విభాగాల్లో ఈపోటీలను నిర్వహించారు. క్యాట్‌వాక్ మధ్యలో వెస్ట్రన్ డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. ప్రఖ్యాత ట్రై నర్ అరుణ్ రతన్ 28 మంది మోడల్స్‌కు శిక్షణ ఇచ్చారు. ఈవెంట్‌కు న్యాయనిర్ణేతలుగా మిస్‌యూనివర్స్–2015 నోయోతాలోథ్, మిస్టర్ గ్లోబల్ ఫణికుమార్ వ్యవహరించారు. స్పెషల్ అంట్రాక్షన్గా సింగర్స్ రేవంత్, దామిని, సాహితి తనగానామతంతో హుషారెత్తించారు. కార్యక్రమంలో నటుడు ఆదిత్య ఓం పాల్గొన్నారు. -
ఆవులకు అందాల పోటీలు!
హరియాణాః ఆవులకు పాలిచ్చే విషయంలో పోటీలు పెట్టడం చూశాం. అలాగే ఎడ్ల బండి పోటీలగురించీ విన్నాం. కానీ హరియాణా ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఆవులకు అందాల పోటీలు నిర్వహిస్తోంది. తొలిసారిగా రోఠక్ జిల్లా ఆ పోటీలకు వేదిక కానుంది. ఫ్యాషన్ షోలో పాల్గొన్న వాటిలో ఎంపికైన వాటికి బెస్ట్ కౌ, బెస్ట్ బుల్ అవార్డులు అందిస్తారు. యజమానులు అందంగా అలంకరించి తెచ్చిన ఆవులు, ఎద్దులు ర్యాంప్ పై క్యాట్ వాక్ కూడ చేసి చూపరులను అలరించనున్నాయి. పోటీల్లో పాల్గొని విజేతలైన ఆయా ఆవులు, ఎద్దుల యజమానులకు లక్ష రూపాయల చొప్పున బహుమానం అందిస్తారు. దేశీ ఆవులకు నిర్వహించే ఫ్యాషన్ షో కు హరియాణా సిద్ధమైంది. ఆవులు ర్యాంప్ పై క్యాట్ వాక్ చేసి.. ఇప్పడు అందర్నీ ఆకట్టుకోనున్నాయి. రాష్ట్రంలోని రోఠక్ జిల్లా, బహుఅక్బర్పూర్ గ్రామంలో జరిగే ఆవుల సౌందర్య పోటీల్లో అన్నింటికంటే అందంగా ఉన్న, అత్యధిక పాలను అందించే ఆవులను ఎంపిక చేసి బెస్ట్ కౌ, బెస్ట్ బుల్ అవార్డులు అందిస్తారు. వాటి యజమానులకు లక్ష రూపాయల చొప్పున బహుమానం కూడ ఇస్తారు. ఆవుల అభివృద్ధికోసం పశుపాలనా విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి హరియాణా గోసేవా ఆయోగ్ ఛైర్మన్ భానే రాం మంగళా ముఖ్య అతిథిగా హాజరౌతారు. ఇతర నగర ప్రముఖులు, అధికారులు, నాయకుల అధ్యక్షతన జరిగే కార్యక్రమం మే 6, 7 తేదీల్లో జరగనున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. 'కౌ ర్యాంప్ క్యాట్ వాక్' షో... బహుఅక్బర్ పూర్ వెటర్నరీ కళాశాల ప్రాంగణంలో జరగనున్నట్లు నోడల్ అధికారి ప్రేమ్ సింహ్ వెల్లడించారు. ఈ ర్యాంప్ షోలో ఆరు రాష్ట్రాలకు చెందిన వివిధ దేశీ ఆవులు పాల్గొంటాయని తెలిపారు. పోటీల్లో పాల్గొనాలనుకునే ఆయా పశువుల యజమానులు మే 5 తేదీ సాయంత్రానికి కార్యక్రమ స్థలానికి చేరుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. మే 6వ తేదీ ఉదయం, సాయంత్రం ప్రదర్శనలో పాల్గొని ఎంపికైన ఆవులతో 7వ తేదీ క్యాట్ వాక్ కార్యక్రమాన్ని మనోరంజకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొని విజేతలైన ఆవులు, ఎద్దుల యజమానులకు వ్యవసాయ మంత్రి ఓం ప్రకాష్ ఘన్ ఖడ్ బహుమతులు ఇచ్చి సన్మానిస్తారు. ఆవులకు ఇటువంటి క్యాట్ వాక్ షో దేశంలోనే మొదటిసారి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గో సంరక్షణ, అభివృద్ధి కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. -
క్యాట్ వాక్‌తో కేకపుట్టించిన సమంత
-
సరికొత్తలుక్‌లో ’సైనా ’
-
క్యాట్‌వాక్‌తో మేలుకొలుపు!
బురదగుంటలో ఫ్యాషన్ షో...పర్యావరణ స్పృహను పెంచే ఒక ప్రయత్నం. వాస్తవానికి అది బురదగుంత కూడా కాదు. జావా దీవిలోనే పొడవైన సిటరమ్ నది. కాలుష్య కోరల్లో చిక్కి అలా తయారైంది. కొన్ని లక్షల మందికి తాగునీటి ఆధారమైన ఈ నదీతీరంలో కొలువై ఉన్న వస్త్ర పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు దాన్ని నాశనం చేశాయి. పరిశ్రమల వ్యర్థాల నుంచి విడుదలయ్యే టాక్సిక్ కెమికల్స్ ఈ నదీ జీవన చిత్రాన్ని ఛిద్రం చేశాయి. అందుకే టాక్సిక్స్ వినియోగాన్ని నియంత్రించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. ఆ రసాయనాలు వినియోగించకుండా రూపొందించిన వస్త్రాలను ఇలా ఫ్యాషన్ షోగా ప్రదర్శించి పరిస్థితిని పూర్తిగా వివరించారు. ఇది కొంతమందిని మేలుకొల్పినా మంచిదే. -
అదిరేటి డ్రస్సు మేమేస్తే..
-
ర్యాంప్‌పై గర్భిణుల క్యాట్ వాక్!
-
విల్లా మెరుపుల్
వెస్ట్రన్ విరుపుల జోరులోనే సంప్రదాయ సొగసులూ పల్లవించాయి. సోమాజిగూడ విల్లా మేరీ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన విల్లా ఫిస్టా అకడమిక్ ఎక్సలెన్స్ అదిరిపోయింది. సంప్రదాయ, మోడరన్ దుస్తుల్లో అమ్మాయిల క్యాట్ వాక్‌లు, డ్యాన్స్‌లు జోష్‌ఫుల్‌గా సాగాయి. ఈ నెల 26 వరకు జరిగే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పంజగుట్ట -
సిల్క్ స్పార్క్
పట్టు చీరల్లో పడతులు మెరిసిపోయారు. వెయ్యి ఓల్టుల వెలుగుల్లో క్యాట్‌వాక్‌లతో కేక పుట్టించారు. సిల్క్‌మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా మాదాపూర్ శిల్పకళా వేదికలో నిర్వహించిన ‘శ్రీమతి సిల్క్ మార్క్ 2014’ గ్రాండ్ ఫినాలేలో మోడల్స్‌ను తలపించేలా మగువలు మురిపించారు. పోటాపోటీగా సాగిన అంతిమ సమరంలో మొత్తం 18 మంది పోటీపడ్డారు. ఒకరిని మించి ఒకరు హంస నడకలతో వయ్యారాలు ఒలకబోశారు. శ్రావణి తొలి స్థానం దక్కించుకున్నారు. నేహాసింగ్, సుస్మిత వరుసగా ఫస్ట్, సెకండ్ రన్నరప్‌లుగా నిలిచారు. సెరికల్చర్ మాజీ కమిషనర్ సీఎస్ రామలక్ష్మి, కొలార్జ్ సీఈఓ శ్రావణిరెడ్డి తదితరులు విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన సిల్క్ ఎక్స్పో ఈ నెల 29 వరకు కొనసాగుతుంది. - మాదాపూర్ -
సమంతా క్యాట్ వాక్ చేస్తే..!
-
దుమ్మురేపిన 'నాసా' ఉత్సవాలు