
క్యాట్‌వాక్‌తో మేలుకొలుపు!
బురదగుంటలో ఫ్యాషన్ షో...పర్యావరణ స్పృహను పెంచే ఒక ప్రయత్నం. వాస్తవానికి అది బురదగుంత కూడా కాదు. జావా దీవిలోనే పొడవైన సిటరమ్ నది. కాలుష్య కోరల్లో చిక్కి అలా తయారైంది. కొన్ని లక్షల మందికి తాగునీటి ఆధారమైన ఈ నదీతీరంలో కొలువై ఉన్న వస్త్ర పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు దాన్ని నాశనం చేశాయి.
పరిశ్రమల వ్యర్థాల నుంచి విడుదలయ్యే టాక్సిక్ కెమికల్స్ ఈ నదీ జీవన చిత్రాన్ని ఛిద్రం చేశాయి. అందుకే టాక్సిక్స్ వినియోగాన్ని నియంత్రించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. ఆ రసాయనాలు వినియోగించకుండా రూపొందించిన వస్త్రాలను ఇలా ఫ్యాషన్ షోగా ప్రదర్శించి పరిస్థితిని పూర్తిగా వివరించారు. ఇది కొంతమందిని మేలుకొల్పినా మంచిదే.