షడ్గజాలు
రంగులు కాంతిమంతంగా, చూపులకు ఆకర్షణీయంగా, మేనికి హాయిగా అనిపించే లైట్‌వెయిట్ పట్టుచీరలు మన ప్రాంతీయ హ్యాండ్లూమ్స్ సొంతం. ఇవి ఈ పండగకే కాదు వేసవికీ ప్రత్యేకం అనిపిస్తాయి.
►జార్జెట్ చీరలైనా లేతరంగులైతే సంప్రదాయ వేడుకలకు హాయిగొలిపే సౌందర్యాన్ని అద్దుతాయి. అతివల అందాన్ని వెయ్యింతలు చేస్తాయి.
►మేనికి సర్వత్రా హాయినిచ్చే కాటన్ చీరలలో ఎన్నో వెరైటీలు. వాటికి డిజైనర్ టచ్ ఇస్తే ఎన్నో ఆధునిక హంగులు.
►సంప్రదాయానికి కాస్త వెస్ట్రన్ టచ్ అద్దితే చీరకట్టుతో స్టైలిష్‌గా వెలిగిపోవడం ఎలాగో తెలుసుకోవచ్చు. పార్టీవేర్‌గా అల్లుకుపోయే లేతరంగు ముచ్చట పండగవేళకు ప్రత్యేకతను చాటుతుంది.
►విరిసిన నవ్వులతో పోటీపడుతూ లతలు, పువ్వులు ప్రకృతి పండగకు కొత్త శోభను మోసుకొస్తాయి.
►ఆభరణాల ఊసు లేకుండా అందంగా రూపుకట్టే పట్టుచీరలు పండగలకు ప్రత్యేకం. వేసవి వేడుక కళాత్మకంగా మారాలంటే తొలి ఎంపిక పట్టుచీరదే అవుతుంది.
►ఉగాది పచ్చడిలో ఆరు రుచుల్లాగ చీరల్లో ఆరు అభిరుచులు ఇవిగో ఆరు గజాల అరవిందాలు.