కడ్తాల్: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని హైదరాబాద్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రిఫ్మన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్‌పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన దసరా ఉత్సవాలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (సీజీఆర్) వ్యవస్థాపకుడు కె.లక్ష్మారెడ్డి, చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు ఆయుధపూజ, జమ్మిపూజలో పాల్గొన్నారు.
విద్యార్థులతో కలిసి కోలాటం వేశారు. ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు తమను ఆకట్టుకున్నాయని తెలిపారు. ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. సీజీఆర్ సంస్థ, గ్రేస్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన తూర్పు కనుమల పర్యావరణ నివేదికను ఆండ్రూ ఫ్లెమింగ్, జోయల్ రిఫ్మన్‌లకు అందించారు. కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ మాజీ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, పారిశ్రామికవేత్తలు విజయభాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సూదిని పద్మారెడ్డి, దేవేంద్ర ఫౌండేషన్ డైరెక్టర్ విజయేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment