3 వేల మందితో భారతమాతకు హారతి  | Three thousand students in Indian dressing | Sakshi
Sakshi News home page

3 వేల మందితో భారతమాతకు హారతి 

Published Sun, Jan 27 2019 3:25 AM | Last Updated on Sun, Jan 27 2019 3:25 AM

Three thousand students in Indian dressing - Sakshi

హైదరాబాద్‌: భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ భారతమాత వేషధారణలో మూడు వేల మంది విద్యార్థినులు అలరించారు. వీరంతా కలిసి శనివారం భారతమాతకు హారతి ఇచ్చారు. ఈ అద్భుత కార్యక్రమానికి హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వేదికైంది. మూడు వేల మందితో నిర్వహించిన ఈ కార్యక్రమం వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించుకుంది.

భారతమాత ఫౌండేషన్‌ చైర్మన్‌ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘భారతమాతకు హారతి’కార్యక్రమానికి ప్రవచన బ్రహ్మ చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల్లో దేశభక్తిని పెంచేందుకు స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రలను చదివేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు, దక్షిణామూర్తి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, భారతమాత ఫౌండేషన్‌ కన్వీనర్‌ శ్యాంసుందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement