ప్రస్తుత జనరేషన్‌లో కో-ఎడ్యుకేషన్ కామన్ అయిపోయింది. విద్యార్థులు జండర్ బేధం లేకుండా విద్యనభ్యసిస్తున్నారు. కాగా, కో-ఎడ్యుకేషన్‌పై కేరళ సీఎం పినరయి సన్నిహితుడు వెల్లపల్లి నటేశన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
కాగా, వెల్లపల్లి నటేశన్ తాజాగా కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ ‘జండర్ న్యూట్రల్ పాలసీ’ గురించి స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ‘క్లాస్ రూమ్స్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడానికి మేము మద్దతు తెలపడం లేదు. భారతదేశానికి అంటూ ప్రాచీన కాలంగా ఓ సంస్కృతి ఉంది. అమ్మాయిలు, అబ్బాయిలు కౌగిలించుకోవడం, కలిసి కూర్చోవడం వంటి చర్యలను మన సంస్కృతి ఒప్పుకోదు. ఇలాంటిది మన సంస్కృతికి విరుద్ధం. మనమందరం ఇంగ్లండ్, అమెరికాలో బ్రతకడంలేదంటూ వ్యాఖ్యలు చేశారు.
Girls, boys sitting together in classes against Indian culture: Kerala leader #VellappallyNatesanhttps://t.co/RsvHXARxCB
— India TV (@indiatvnews) August 29, 2022
ఈ క్రమంలోనే 18 ఏళ్ల లోపు వారు లేదా కళాశాలల్లో యువకులు చదువుకుంటున్నప్పుడు ఒకరినొకరు కలిసి కూర్చుని కౌగిలించుకోకూడదని ఆయన అన్నారు. ఇలా వారు కలిసి కూర్చోవడం దేశానికే ప్రమాదకరమన్నారు. పిల్లలు పెద్దయ్యాక, పరిపక్వత వచ్చిన తర్వాత, వారు కోరుకున్నది చేయగలరని చెప్పారు. ఇలా అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చుంటున్న కారణంగానే విద్యార్థులు చదువులో రాణించలేకపోతున్నారు. అలాగే, విద్యా సంస్థలు మంచి గ్రేడ్లను సాధించలేకపోతున్నాయి. దీంతో, విద్యాసంస్థలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి నిధులు పొందలేకపోతున్నాయి అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment