సుధామూర్తి చేయగలరు. రాయడం.
(ఇన్ఫోసిస్) నారాయణమూర్తి చేయలేని పని ఒకటి
న్యూ రిలీజెస్
సుధామూర్తి చేయగలరు. రాయడం. ఆమె గతంలో రాసిన How I Taught My Grandmother to Read & Other Stories లాంటి పుస్తకాలు అనేక భాషల్లో అనువాదం అయ్యాయి. సాహిత్యపరంగా వాటి నాణ్యత ఎలా ఉన్నా రీడబిలిటీ, చెప్పే విషయాన్ని ప్రాథమిక పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొని చెప్పడం వంటి లక్షణాలతో ఆమె ఆకట్టుకుంటున్నారు. ఆమె తాజా నవల House of Cards
కూడా ఇప్పుడు అదే కోవలో పాఠకులను ఆకట్టుకుంటోంది. మృదుల అనే స్త్రీ కథ ఇది. పల్లెటూళ్లో పుట్టి, తండ్రికి ముద్దు బిడ్డగా ఎదిగి, ఒక డాక్టర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది మృదుల. అతడు గవర్నమెంట్ సర్వీసులో బెంగళూరులో పని చేస్తూ ఉంటాడు. కాని కొద్ది కాలానికే ఆ పని మొహమ్మొత్తి
ప్రయివేటుగా ప్రాక్టీసు చేయడానికి నిశ్చయించుకుంటాడు. మృదుల ఏమో టీచర్‌గా తన ఉనికి కాపాడాలనుకుంటుంది. ఒకరు ఒక చోట. మరొకరు మరో చోట. ఈ పరుగులో అనుబంధాల మధ్య ఘర్షణ, వాటి విలువ, రాబోయే తరానికి (తన కుమారుడికి) మృదుల ఎలా ఆ పరంపరను విశదం చేసింది.... ఇదంతా చర్చిస్తుంది ఈ నవల. సాధారణంగా స్త్రీల ఆత్మగౌరవం, వారి వికాసం సుధామూర్తి ప్రథమ లక్ష్యం కాబట్టి ఈ నవల కూడా అ దృష్టికోణాన్నే కలిగి ఉంటుంది. హాయిగా చదివించే శైలి. తప్పక చదవ్వొచ్చు.
పెంగ్విన్ ప్రచురణ; వెల: రూ. 250