రిషి సునాక్ అతి చిన్న వయసులో బ్రిటన్ ప్రధాని అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతని అత్తగారు సుధా మూర్తి చేసిన వ్యాఖ్యలు.. అతని అధికార హోదాను మరోసారి వార్తల్లో హైలెట్‌గా నిలిచేలా చేసింది. ఈమేరకు ఇన్ఫోసిన్ వ్యవస్థాపకుడు, దిగ్జజ పారిశ్రామిక వేత్త నారాయణ మూర్తి భార్య సుధామూర్తి మాట్లాడుతూ..తన కూతురు కారణంగానే రిషి సునాక్ అతి చిన్న వయసులో యూకేకి ప్రధాని అయ్యారని ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న ఓ వీడియోలో అన్నారు. ఆ వీడియోలో..తన కూతురే దీన్ని సాధ్యం చేసిందన్నారు.
తాను తన భర్తను వ్యాపారవేత్తను చేస్తే తన కుమార్తె తన భర్తను ప్రధానిని చేసిందని చెప్పారు. "ఇదంతా భార్య మహిమే. భార్య భర్తను ఎలా మారుస్తుందో చూడండి. ఐతే నేను నా భర్తను మాత్రం మార్చలేకపోయాను..నేను ఆయన్ని కేవలం వ్యాపారవేత్తని చేశానని, కానీ నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అన్నారు. కాగా, రిషి సునాక్ 2009లో అక్షతామూర్తిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడేళ్లలోనే యూకేకి ప్రధాని అయిన ఎంపీగా నిలవడమే గాక, అతిపిన్న వయస్కుడైన ప్రధానిగా పేరుగాంచారు.
కాగా అక్షతమూర్తి ప్రపంచంలోని అత్యంత సంపన్న బిలియనీర్‌లలో ఒకరి కుమార్తె, దాదాపు 730 మిలియన్ల పౌండ్ల వ్యక్తిగత సంపదతో శక్తిమంతమైన మహిళగా ఉన్నారు. ఆమె తల్లిదండ్రులు, భారతదేశానికి చెందినవారు. అక్షతామూర్తి తండ్రి నారాయణమూర్తి ఇన్పోసిస్ వ్యవస్థాపకుడు, భారతదేశంలోని అత్యంత సంపన్నులో ఆయన ఒకరు.
Comments
Please login to add a commentAdd a comment