చిన్నపిల్లలు అన్నం తినమని మారాం చేసినా, నిద్రపోకుండా ఏడుస్తున్నా పెద్దవాళ్లు కథలు చెప్పేవారు. మరీ ముఖ్యంగా నానమ్మలు, అమ్మమ్మలు కథలు చెప్తూ పిల్లలకు బాల్యం నుంచే నీతి పాఠాలు బోధించేవారు. బడిలో చెప్పని ఎన్నో విషయాలను కథల రూపంలో తెలుసుకునేవారు. ఇప్పుడు ఫోన్‌ల వాడకం పెరిగిపోయాక కథలు చెప్పేవాళ్లే కరువయ్యారు.
కథలు చెప్తానంటున్న సుధామూర్తి
అయితే టీవీ, ఫోన్‌లోనూ పిల్లల కోసం బోలెడన్ని కార్టూన్ చిత్రాలు, యానిమేషన్ కథలు, పాటలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో తాను కూడా కథలు చెప్తానంటోంది ఇన్ఫోసిస్ చైర్ పర్సన్, రచయిత్రి సుధామూర్తి. ఆమె చిన్నపిల్లల కోసం ఎన్నో కథల పుస్తకాలు తీసుకొచ్చింది. పిల్లలకు అర్థమయ్యేలా సరళ భాషలో కథలు రాసి ఆకట్టుకుంది. ఈసారి ఓ అడుగు ముందుకువేసి యానిమేటెడ్ సిరీస్ చేసింది.
తను రాసిన కథలకు, పాత్రలకు ప్రాణం పోసి పిల్లల ముందుకు తీసుకొచ్చింది. 'స్టోరీ టైమ్ విత్ సుధా అమ్మ' పేరిట యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ చేసింది. మూర్తి మీడియా, కాస్మోస్ మాయ సంస్థల భాగస్వామ్యంతో ఈ సిరీస్ తెరకెక్కింది. మూర్తి మీడియా యూట్యూబ్ ఛానల్‌లో ఇది తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రసారమవుతోంది. ఈ సిరీస్‌లో మొత్తం 52 కథలు ఉంటాయి. స్టోరీ టైమ్ విత్ సుధా అమ్మ సిరీస్ అక్టోబర్ 31 నుంచి యూట్యూబ్‌లో ప్రసారమవుతోంది.
చదవండి: ఆదిపురుష్‌కు పని చేయడమే నేను చేసిన పెద్ద తప్పు.. దేశం వదిలి వెళ్లిపోయా..
Comments
Please login to add a commentAdd a comment