Animation films
-
పిల్లలు ఇష్టపడే యానిమేటెడ్ సిరీస్.. ఫ్రీగా చూసేయండి..
చిన్నపిల్లలు అన్నం తినమని మారాం చేసినా, నిద్రపోకుండా ఏడుస్తున్నా పెద్దవాళ్లు కథలు చెప్పేవారు. మరీ ముఖ్యంగా నానమ్మలు, అమ్మమ్మలు కథలు చెప్తూ పిల్లలకు బాల్యం నుంచే నీతి పాఠాలు బోధించేవారు. బడిలో చెప్పని ఎన్నో విషయాలను కథల రూపంలో తెలుసుకునేవారు. ఇప్పుడు ఫోన్ల వాడకం పెరిగిపోయాక కథలు చెప్పేవాళ్లే కరువయ్యారు. కథలు చెప్తానంటున్న సుధామూర్తి అయితే టీవీ, ఫోన్లోనూ పిల్లల కోసం బోలెడన్ని కార్టూన్ చిత్రాలు, యానిమేషన్ కథలు, పాటలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో తాను కూడా కథలు చెప్తానంటోంది ఇన్ఫోసిస్ చైర్ పర్సన్, రచయిత్రి సుధామూర్తి. ఆమె చిన్నపిల్లల కోసం ఎన్నో కథల పుస్తకాలు తీసుకొచ్చింది. పిల్లలకు అర్థమయ్యేలా సరళ భాషలో కథలు రాసి ఆకట్టుకుంది. ఈసారి ఓ అడుగు ముందుకువేసి యానిమేటెడ్ సిరీస్ చేసింది. తను రాసిన కథలకు, పాత్రలకు ప్రాణం పోసి పిల్లల ముందుకు తీసుకొచ్చింది. 'స్టోరీ టైమ్ విత్ సుధా అమ్మ' పేరిట యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ చేసింది. మూర్తి మీడియా, కాస్మోస్ మాయ సంస్థల భాగస్వామ్యంతో ఈ సిరీస్ తెరకెక్కింది. మూర్తి మీడియా యూట్యూబ్ ఛానల్లో ఇది తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రసారమవుతోంది. ఈ సిరీస్లో మొత్తం 52 కథలు ఉంటాయి. స్టోరీ టైమ్ విత్ సుధా అమ్మ సిరీస్ అక్టోబర్ 31 నుంచి యూట్యూబ్లో ప్రసారమవుతోంది. చదవండి: ఆదిపురుష్కు పని చేయడమే నేను చేసిన పెద్ద తప్పు.. దేశం వదిలి వెళ్లిపోయా.. -
యానిమేషన్ స్టూడియోకు నిప్పు
టోక్యో: జపాన్లోని ప్రముఖ యానిమేషన్ స్టూడియోకు ఓ వ్యక్తి నిప్పుపెట్టడంతో మంటల్లో చిక్కుకుని 33 మంది చనిపోగా దాదాపు అంతే సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. జపాన్ వాసులను షాక్కు గురిచేసిన ఈ ఘటన క్యోటోలో చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం ఓ దుండగుడు స్థానిక క్యోటో యానిమేషన్ స్టూడియోలోకి ప్రవేశించాడు. ‘మీరు చస్తారు’ అని అరుచుకుంటూ ప్రవేశ ద్వారం వద్ద గుర్తు తెలియని ద్రవాన్ని చల్లి, ఆ వెంటనే నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఉద్యోగులంతా ప్రాణ భయంతో పైనున్న మూడంతస్తులకు చేరుకునేందుకు ప్రయత్నించారు. అయితే, వారు మంటల తీవ్రత నుంచి తప్పించుకోలేకపోయారు. మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది 33 మృతదేహాలను వెలికి తీశారు. ఇందులో 20 మృతదేహాలు మూడో ఫ్లోర్లోనే పడి ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 36 మంది కాలిన గాయాలపాలు కాగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. బాధితుల్లో చాలా మంది కంపెనీ ఉద్యోగులేనని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన నిందితుడి(41)ని కూడా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అతడు కంపెనీ ఉద్యోగి కాదని మాత్రమే పోలీసులు వెల్లడించారు. తన వస్తువును క్యోటో యానిమేషన్ కంపెనీ దొంగతనం చేసిందని నిందితుడు ఆరోపిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ప్రమాదానికి అతడు గ్యాసొలిన్ను వాడి ఉంటాడని భావిస్తున్నారు. ఘటన స్థలి నుంచి పోలీసులు కొన్ని కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, అవి నిందితుడివేనా కాదా అనేది తెలియరాలేదు. ప్రమాదం సమయంలో ఆ భవనంలో 70 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. లకీ స్టార్, కె–ఆన్, హరుహి సుజుమియాతోపాటు పోకెమాన్, విన్నీది పూహ్ వంటి యానిమేషన్ చిత్రాలతో క్యోటో యానిమేషన్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. కాగా, జపాన్లో ఇటువంటి విద్రోహ చర్యలు జరగడం చాలా అరుదు. 2001లో టోక్యోలో అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా 44 మంది ప్రాణాలు కోల్పోయారు. 2016లో ఓ వ్యక్తి టోక్యోలోని నర్సింగ్ హోం వద్ద కత్తితో దాడి చేసి 19 మందిని పొట్టనబెట్టుకున్నాడు. స్టూడియో వద్ద సహాయక చర్యలు -
ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభం
అగర్తలా : ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవం మూడురోజులపాటు జరగనుంది. ఇందులోభాగంగా పురస్కారం పొందిన ఏడు దేశాలకు చెందిన 30 చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఫిలిమ్స్ డివిజన్, యునెటైడ్ ఫిలిమ్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (యూఎఫ్పీఏ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చిత్రోత్సవాన్ని త్రిపుర సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రి భానులాల్ సహా ప్రారంభించారు. కాగా ఈ 30 చిత్రాల్లో కొన్ని డాక్యుమెంటరీలు, మరికొన్ని లఘు చిత్రాలు, మరికొన్ని యానిమేషన్ సినిమాలు ఉన్నాయి. ఇవి ఆస్ట్రేలియా, భారత్, రొమేనియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బంగ్లాదేశ్, అజర్బైజాన్, నార్వే దేశాల్లో రూపొందాయి.