ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభం | Mumbai International Film Festival (MIFF) 2014 begins in Agartala | Sakshi
Sakshi News home page

ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభం

Published Fri, Sep 5 2014 10:46 PM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM

Mumbai International Film Festival (MIFF) 2014 begins in Agartala

అగర్తలా : ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్‌ఎఫ్) శుక్రవారం అంగరంగ  వైభవంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవం మూడురోజులపాటు జరగనుంది. ఇందులోభాగంగా పురస్కారం పొందిన ఏడు దేశాలకు చెందిన 30 చిత్రాలను ప్రదర్శించనున్నారు.

ఫిలిమ్స్ డివిజన్, యునెటైడ్ ఫిలిమ్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (యూఎఫ్‌పీఏ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చిత్రోత్సవాన్ని త్రిపుర సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రి భానులాల్ సహా ప్రారంభించారు. కాగా ఈ 30 చిత్రాల్లో కొన్ని డాక్యుమెంటరీలు, మరికొన్ని లఘు చిత్రాలు, మరికొన్ని యానిమేషన్ సినిమాలు ఉన్నాయి. ఇవి ఆస్ట్రేలియా, భారత్, రొమేనియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బంగ్లాదేశ్, అజర్‌బైజాన్, నార్వే దేశాల్లో రూపొందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement