సాక్షి,ముంబై: ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్‌ఆర్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి మరోసారి తన ప్రత్యేకతను చాటు కున్నారు. విద్యావేత్త, రచయిత్రి, దాత, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి ఇన్ఫోసిస్ 40వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధామూర్తి వ్యాఖ్యలు ఇన్వెస్టర్లు సక్సెస్ మంత్రాగా నిలుస్తున్నాయి. సంస్థ 40 ఏళ్ల ప్రస్థానంపై తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తన భర్త నారాయణమూర్తికి తాను అప్పుగా ఇచ్చిన 10వేల రూపాయలు ఈ రోజు బిలియన్ డాలర్లుగా మారతాయని తాను కలలో కూడా ఊహించలేదంటూ ఆమె ఆనందాన్ని ప్రకటించారు. అంతేకాదు ఈ నేపథ్యంలో ప్రపంచంలో (కనీసం ఇండియాలో) తానే అత్యుత్తమ ఇన్వెస్టర్‌గా భావిస్తానని వ్యాఖ్యానించడం విశేషం. (బర్సో రే మేఘా మేఘా అంటున్న ఇన్ఫోసిస్ సుధామూర్తి: వీడియో చూస్తే ఫిదా)
ఈ సందర్బంగా సుధామూర్తి తన సక్సెస్ జర్నీని వివరించిన తీరు ఆకట్టుకుంటోంది. ఇన్ఫోసిస్ ఈ స్థాయికి రావడానికి ప్రారంభంలో తాము ఏడెనిమిదేళ్లు చాలా కష్టపడాల్సి వచ్చిందని చివరికి విజయం సాధించామని ఆమె తెలిపారు. ఏదైనా సక్సెస్ సాధించాలంటే కష్టపడి పనిచేయాలి. ఓపికతో ఉంటే విజయం దానంతట అదే వరిస్తుందని అప్ కమింగ్ పారిశ్రామికవేత్తలకు సూచించారు. (మరోసారి భారీ సేల్, మునుగుతున్న టెస్లా..ట్విటర్ కోసమే? ఇన్వెస్టర్లు గగ్గోలు)
సక్సెస్ కావాలంటే ఈ జనరేషన్‌కి ఓపిక చాలా అసవరమని తాను భావిస్తా అన్నారు. ఒక్క రోజులోనే ఏమీ సాధించలేం. రోమ్ నగరం ఒక రోజులో నిర్మాణం జరగలేదు కదా. అలాగే ఒక కంపెనీని నిర్మించాలంటే చాలా కష్టపడాలి. నిబద్ధతతో పనిచేయాలి. క్లిష్టమైన పరిస్థితిల్లో ఓపిక పట్టాలని చెప్పు కొచ్చారు. ఓపిగ్గా కష్టపడితే విజయం దానంతట అదే వస్తుంది. కానీ డబ్బు కోసం పరిగెత్తితే, మననుంచి డబ్బు కూడా పారిపోతుందని సుధామూర్తి అన్నారు. ఈ సందర్భంగా తన అల్లుడు, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గురించి కూడా సుధామూర్తి ప్రస్తావించారు.
40 ఏళ్ల ఇన్ఫోసిస్ ప్రస్థానం
► 1981లో 40 ఏళ్ల కిందట కేవలం 250 డాలర్ల పెట్టుబడితో, ఏడుగురు ఇంజనీర్లతో ప్రారంభమైంది ఇన్ఫోసిస్
►బెంగళూరులో ప్రధాన కార్యాలయంగా నాస్డాక్ లిస్టెడ్ IT కంపెనీ ఇన్ఫోసిస్.
► తొలి పెట్టుబడిదారు నారాయణ మూర్తి భార్య సుధామూర్తి భర్తకు రూ. 10 వేల అప్పు
► అత్యుత్తమ సేవలతో దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజంగా అవతరించింది
► నాలుగు దశాబ్దాల్లోనే కంపెనీ మార్కెట్ వాల్యూ 6.65 లక్షల కోట్ల స్థాయికి చేరింది
► మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 100 బిలియన్ డాలర్ల చేరుకున్న నాల్గవ భారతీయ కంపెనీగా అవతరించింది.
► దేశంలోని తొలి కంప్యూటర్ షేరింగ్ సిస్టమ్ కోసం పనిచేసిన నారాయణ మూర్తి
► సాఫ్ట్రోనిక్స్ అనే సంస్థను ప్రారంభించిన మూర్తి
► అక్కడే సుధామూర్తితో పరిచయం, ప్రేమ
► సంస్థకు నష్టాలు రావడంతో ఏడాదిన్నర తర్వాత సంస్థ మూసివేత
► ఉద్యోగ ఉంటేనే పెళ్లి అని సుధామూర్తి తండ్రి షరతు
► పుణేలోని ప్యాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్‌లో జనరల్ మేనేజర్‌గా ఉద్యోగం
► 1981లో నారాయణ మూర్తి ఉద్యోగానికి గుడ్‌బై..ఇన్ఫోసిస్ ఆవిర్భావానికి నాంది.
Comments
Please login to add a commentAdd a comment