Infosys Narayana Murthy: ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి జీవితానికి సంబంధించిన ఏదో ఒక విశేషం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. ప్రారంభ రోజుల్లో ఆయన పడిన అవమానం గురించిన అంశం తాజాగా బయటకు వచ్చింది. భార్య సుధామూర్తికి కోపం తెప్పించిన ఈ ఘటన గురించి నారాయణమూర్తి ఏం చెప్పారంటే..
ఇన్ఫోసిస్ ప్రారంభ రోజులలో క్లయింట్ వర్క్ కోసం నారాయణ మూర్తి ఒకసారి యూఎస్ వెళ్ళినప్పుడు, ఒక అమెరికన్ వ్యాపారవేత్త తన ఇంటిలో నాలుగు బెడ్‌రూమ్‌లు ఉన్నప్పటికీ నారాయణమూర్తిని స్టోర్‌రూంలో పడుకోబెట్టాడు. కిటికీలు లేని ఆ రూంలో చుట్టూ అట్టపెట్టెల మధ్య ఒక పెట్టెపైనే ఆ రాత్రి ఆయన నిద్రించారు. సుధా మూర్తి, నారాయణ మూర్తి జీవితాల్లో తొలినాళ్ల గురించి భారతీయ-అమెరికన్ రచయిత్రి చిత్రా బెనర్జీ దివాకరుణి రచించిన "యాన్ అన్‌కామన్ లవ్: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి" జీవితచరిత్ర పుస్తకంలో ఈ విశేషాలు వెల్లడయ్యాయి.
న్యూయార్క్‌కు చెందిన డేటా బేసిక్స్ కార్పొరేషన్ అనే కంపెనీ అధినేత డాన్ లీల్స్.. నారాయణమూర్తి పట్ల కొన్ని సందర్భాల్లో అనుచితంగా ప్రవర్తించేవాడు. తరచుగా చెల్లింపులను ఆలస్యం చేసేవాడు. మ్యాన్‌హట్టన్ వెళ్లినప్పుడు తనకే కాకుండా ఇతర ఇన్ఫోసిస్ సహచరులకు సైతం హోటల్‌లను బుక్ చేసుకోవడానికి అనుమతినిచ్చేవాడు కాదు. ఇలా మూర్తి ఒకసారి క్లయింట్ వర్క్ కోసం యూఎస్ వెళ్ళినప్పుడు, డాన్ లీల్స్ ఆయన్ను స్టోర్‌రూమ్‌లో పడుకోబెట్టాడు. కిటికీలు కూడా లేని ఉన్న ఆ రూంలో చుట్టూ అట్టపెట్టెల మధ్యే ఆ రాత్రి ఆయన నిద్రించాడు. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న కంపెనీ కోసం నారాయణమూర్తి ఇలాంటి అవమానాలను ఎన్నో సహించారు.
అతిథి దేవుడిలాంటివారని తన అమ్మ అంటుండేదని, అతిథులతో వ్యవహరించిన తీరుని బట్టే నువ్వు ఎలాంటివాడివో తెలుస్తుందని చెబుతూ ఈ ఘటన గురించి భార్య సుధా మూర్తితో నారాయణమూర్తి చెప్పారు. అనుకోకుండా వాళ్ల నాన్న ఎవరినైనా ఇంటికి ఆహ్వానించినప్పుడు తన తల్లి తాను తినకుండా అతిథికి అన్నం పెట్టేదని గుర్తు చేసుకున్నారు. కానీ డాన్ లీల్స్ తాను విలాసవంతమైన బెడ్‌పై పడుకుని తనను మాత్రం స్టోర్‌రూంలో పెట్టెపై పడుకోబెట్టాడని నారాయణమూర్తి చెప్పగా సుధామూర్తికి మాత్రం ఈ ఘటన కోపం తెప్పించినట్లు పుస్తకంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment