ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాణయ మూర్తి పరిచయం అక్కర్లేని పేరు. రెండు దశాబ్ధాల పాటు టెక్నాలజీ రంగంలో విశేష కృషి చేసిన ఆయన తన అభిప్రాయాలను తెలపడంలో ఎప్పుడూ మెుహమాట పడరు.
ఇలా చేయడం వల్ల అనేకసార్లు విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. ఆయినప్పటికీ ఆయన మాత్రం తనపని తాను చేసుకుపోతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆసక్తికరంగా మారాయి.
కష్టపడి పనిచేసే వారికి రుణ పడి ఉండాలి
కొద్ది రోజుల క్రితం భారత యువత వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ వ్యవస్దాపకుడు నారాయణ మూర్తి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దేశంలోని విద్యావంతులు అత్యంత ఎక్కువగా కష్టపడే వారికి తక్కువగా కష్టపడి పనిచేసే వారు రుణ పడి ఉండాలని అన్నారు. ‘రైతులు, ఫ్యాక్టరీ కార్మికులు చాలా కష్టపడి పనిచేస్తారు’ అంటూ తన వైఖరిని సమర్థించుకున్నారు.
చాలా మంది భారతీయులు, ఎన్‌ఆర్‌ఐలు
చాలా మంది ప్రజలు శారీరకంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకుంటారు. కాబట్టి భారత్‌లో కష్టపడి పనిచేయడం అనేది ఓ సర్వ సాధారణం. అలాగే భారీ రాయితీలతో విద్యను పూర్తి చేసిన మనలో చాలా మంది ప్రభుత్వం అందించే సబ్సీడీలకు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక తాను చేసే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక వచ్చినప్పటికీ భారత్‌లో చాలా మంది, ఎన్‌ఆర్‌ఐలు తన వ్యాఖ్యల్ని ఏకీభవిస్తారని చెప్పారు.
ఈ వ్యాఖ్యల్లో తప్పు ఏమైనా ఉందా?
నా ఫీల్డ్‌లో నా కంటే మెరుగ్గా ఉన్నవారు ఎవరైనా ఉంటే నేను వారిని గౌరవిస్తాను. వారితో మాట్లాడుతాను. ఈ తరహా వ్యాఖ్యలు చేయడంలో తప్పు ఎక్కడ జరిగిందని మీరు అనుకుంటున్నారు? నేనైతే తప్పు ఉందని అనుకోను అని అన్నారు.
నేను చేసిన పనికి చింతిస్తున్నా
పనిలో పనిగా తన భార్య సుధా మూర్తి విషయంలో తాను చేసిన పనికి చింతిస్తున్నట్లు తెలిపారు. 1981లో కేవలం తన వాటాగా రూ.10,000తో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా నారాయమూర్తి మారారు. అయితే ఈ డబ్బును తన భార్య సుధా మూర్తి దాచుకున్న సొమ్మని పలుమార్లు గతంలోనే వెల్లడించారు. భార్య దాచుకున్న మెుత్తాన్ని వ్యాపార పెట్టుబడిగా పెట్టి దేశంలోని టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఇన్ఫోసిస్‌ను తీర్చిదిద్దటంలో ఆయన తన జీవితాన్ని వెచ్చించారు.
సహా వ్యవస్థాపకుల కంటే సుధా మూర్తికి
తాజా ఇంటర్వ్యూలో పెట్టుబడిగా డబ్బులిచ్చిన భార్యకు కంపెనీలో ఎందుకు అవకాశం కల్పించలేదని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తన భార్య డబ్బుతో కంపెనీని ప్రారంభించినప్పటికీ ఆమెతో పాటు కుటుంబాన్ని ఇన్ఫోసిస్‌కు దూరంగా ఉంచాలనే తన నిర్ణయం సరైంది కాదన్నారు.
ఇదే విషయంలో తాను చింతిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇతర సహ వ్యవస్థాపకుల కంటే సుధా మూర్తికి ఎక్కువ అర్హత ఉందని నమ్మినప్పటికీ.. తన భార్యను సంస్థలో చేరడానికి ఎప్పుడూ అనుమతించలేదని అన్నారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తి.. తన భార్య సుధా మూర్తిని క్షమాపణలు కోరేలా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment