Watch: Infosys At 40 Sudha Murty Dance With Shreya Ghoshal, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Infosys At 40: బర్సో రే మేఘా మేఘా అంటున్న ఇన్ఫోసిస్‌ సుధామూర్తి: వీడియో చూస్తే ఫిదా

Published Thu, Dec 15 2022 6:33 PM | Last Updated on Thu, Dec 15 2022 8:24 PM

Infosys at 40 Sudha Murty dance with Shreya Ghoshal viral video here - Sakshi

న్యూఢిల్లీ: విద్యావేత్త, రచయిత్రి, పరోపకారి, ఇన్ఫోసిస్‌  ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి  అంటే పరిచయం అక్కర లేని పేరు. ఇన్ఫోసిస్ 40వ వార్షికోత్సవ ఈవెంట్‌లో ఆమె స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఉరిమే ఉత్సాహం ఉంటే చాలు సంతోషానికి వయసుతో పని లేదంటూ ఆమె సరదాగా కాలు కదిపిన  వీడియో   సోషల్‌  మీడియాలో తెగ షేర్‌  అవుతోంది. (10 వేలతో..వేల కోట్లు... మీరూ ఇలా చేయండి!)

ఈ ఈవెంట్‌లో బాలీవుడ్‌ గాయని, మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్‌తో కలిసి సుధా మూర్తి  చిన్నగా  స్టెప్పు లేశారు. బుధారం రాత్రి  ఎలక్ట్రానిక్స్ సిటీ బెంగళూరులోని  ప్రధాన కార్యాలయంలో జరిగిన ఇన్ఫోసిస్ @ 40 ఈవెంట్‌లో చాలా చురుగ్గా పాల్గొన్న సుధామూర్తి గురు సినిమాలోని "బర్సో రే మేఘా మేఘా" పాటకు ఉత్సాహంగా పదం కలిపారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌ నటించిన ఈ పాటకు సుధామూర్తి  ఆనందం  ఇంటర్నెట్‌లో అందరినీ ఆకట్టుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement