పట్నా : కడుపున పుట్టిన బిడ్డ పట్ల కన్నతల్లే కర్కశంగా వ్యవహరించింది. సాధారణంగా పిల్లలు ఏడుస్తుంటే...ఆపమని అదిలిస్తాం....బెదిరిస్తాం. అప్పటికీ వాళ్లు ఆపకుంటే ’రెండంటిస్తాం’ అని చెబుతాం. అయితే ఆపకుండా ఏడుస్తున్న కొడుకు నోరు మూయించేందుకు .... ఓ తల్లి...ఏకంగా అతగాడి పెదాలకు ఫెవీక్విక్ (గమ్) రాసి, అంటించేసింది. అయితే ఈ విషయాన్ని గమనించిన తండ్రి... కొడుకును ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ప్రస్తుతం చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించడంతో తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సంఘటన బిహార్‌లోని చాహాప్రాలో శనివారం చోటుచేసుకుంది.
ఈ ఘటనపై బాధిత చిన్నారి తండ్రి మాట్లాడుతూ...’పనుండి బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాను. నేను వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బాబు ఏడవడం లేదు. అయితే అతడి నోటి నుంచి నురుగు వస్తోంది. దాంతో ఏం జరిగిందని నా శోభను భార్యను అడిగాను. ఆపకుండా ఒకటే ఏడుస్తున్నాడని, అందుకే కొడుకు ఏడుపు ఆపేందుకు గమ్ రాసినిట్లు చెప్పింది.’ అని పేర్కొన్నాడు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment