
బెంగళూరు: కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరన్న వార్తతో యావత్ సినిమా ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో నటీనటులతో పాటు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తాము ఎంతగానో ఆరాధించే నటుడు కానిలోకాలకు వెళ్లిపోయాడని తెలియడంతో అభిమానులు హతాశులయ్యారు.
బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు.. పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని తలచుకుని గుండె పగిలేలా కన్నీరుమున్నీరయ్యారు. తాముగా ప్రేమగా పిలుచుకునే ‘అప్పు’మరణాన్ని జీర్ణించుకోలేక వేలాది మంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
పునీత్ రాజ్‌కుమార్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని వీరాభిమానులు కంటితడి పెట్టారు. అభిమానుల ఆక్రందనలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగిపోయింది. మరోవైపు వేలాదిగా తరలివచ్చిన అభిమానులను సముదాయించడం పోలీసులకు సవాల్‌గా మారింది. (పునీత్ రాజ్‌కుమార్ మృతి, షాక్‌లో భారత సినీ పరిశ్రమ)
Comments
Please login to add a commentAdd a comment