broken heart
-
Puneeth Rajkumar: ‘అప్పు’ అస్తమయం.. గుండె పగిలేలా రోదనలు
-
‘అప్పు’ అస్తమయం.. గుండె పగిలేలా రోదనలు
బెంగళూరు: కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరన్న వార్తతో యావత్ సినిమా ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో నటీనటులతో పాటు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తాము ఎంతగానో ఆరాధించే నటుడు కానిలోకాలకు వెళ్లిపోయాడని తెలియడంతో అభిమానులు హతాశులయ్యారు. బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు.. పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని తలచుకుని గుండె పగిలేలా కన్నీరుమున్నీరయ్యారు. తాముగా ప్రేమగా పిలుచుకునే ‘అప్పు’మరణాన్ని జీర్ణించుకోలేక వేలాది మంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ రాజ్‌కుమార్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని వీరాభిమానులు కంటితడి పెట్టారు. అభిమానుల ఆక్రందనలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగిపోయింది. మరోవైపు వేలాదిగా తరలివచ్చిన అభిమానులను సముదాయించడం పోలీసులకు సవాల్‌గా మారింది. (పునీత్ రాజ్‌కుమార్ మృతి, షాక్‌లో భారత సినీ పరిశ్రమ) -
జీవితంలో గెలిచి.. కరోనాపై ఓడి!
న్యూఢిల్లీ: ఫ్లైయింగ్ సిఖ్‌గా ప్రఖ్యాతిగాంచిన అథ్లెట్ మిల్కాసింగ్ కరోనా అనంతర లక్షణాలతో శుక్రవారం కన్నుమూశారు. కేవలం ఐదు రోజుల ముం దే ఆయన భార్య నిర్మల్ కౌర్‌ను కరోనా రక్కసి బలితీసుకుంది. వీరిద్దరే కాదు దేశవ్యాప్తంగా ఎంతోమంది దంపతులు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. వయోధికులే కాదు... నిండు నూరే ళ్లు కలిసి జీవించాల్సిన యువ దంపతులూ ఎంద రో మహమ్మారి వల్ల అర్ధాంతరంగా తనువు చాలిం చారు. దశాబ్దాల క్రితం ఒక్కటైనవారు మాత్రమే కాదు, కొత్తగా పెళ్లయిన దంపతులు సైతం మరణించడంతో వారి కుటుంబాలకు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి. వారాల వ్యవధిలో.. కొన్ని సందర్భా ల్లో రోజుల వ్యవధిలోనే దంపతులు తుదిశ్వాస విడి చిన సంఘటనలు ఉన్నాయి. దంపతుల్లో ఒకరి మరణం గురించి తెలిసి మరొకరు షాక్‌తో కన్ను మూసిన ఉదంతాలు బయటపడ్డాయి. ఇందుకు ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ కారణమని నిపుణులంటున్నారు. అనాథలైన 3,261 మంది చిన్నారులు! కరోనా వల్ల దేశంలో ఎంతమంది దంపతులు మరణించారన్న స్పష్టమైన గణాంకాలు ప్రభుత్వం వద్ద లేవు. అయితే, కరోనా కాలంలో దేశవ్యాప్తంగా 3,261 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారినట్లు జాతీయ బాలల హక్కు పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) అంచనా వేసింది. అయితే, ఇవి 18 ఏళ్లలోపు పిల్లల గణాంకాలే. వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చావుబతుకుల్లోనూ కలిసే... రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా(89) కరోనా బారినపడ్డారు. గుర్గావ్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 20న చనిపోయారు. ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే శాంతి పహాడియా(87) కూడా కరోనా కారణంగా అదే ఆసుపత్రిలో మూడు రోజుల తర్వాత మృతిచెందారు. వారిద్దరికీ బాల్యంలోనే వివాహం జరిగింది. సుదీర్ఘకాలం కలిసి బతికిన పహాడియా దంపతులు దాదాపు ఒకేసారి స్వర్గానికి చేరుకున్నారని వారి కుమారుడు ఓంప్రకాశ్ పహాడియా కన్నీటిపర్యంతమయ్యారు. సీనియర్ జర్నలిస్టులు, దంపతులైన కల్యాణ్ బారువా, నీలాక్షి భట్టాచార్య కరోనా వల్ల గుర్గావ్ ఆసుపత్రిలో మే నెలలో మృతిచెందారు. పహాడియా దంపతుల తరహాలోనే కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరూ తుదిశ్వాస విడిచారు. రాజస్తాన్‌లోని బికనీర్ పట్టణానికి చెందిన దంపతులు ఓంప్రకాశ్, మంజుదేవీ గత ఏడాది నవంబర్‌లో 15 రోజుల వ్యవధిలో చనిపోయారు. వారికి 40 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా రాకాసి కరోనాను మాత్రం జయించలేకపోయారు. కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో నంజుండే గౌడ ఈ ఏడాది ఏప్రిల్ 30న మృతి చెందారు. పెళ్లయిన తొమ్మిదేళ్లకు భార్య మమత గర్భవతి కావడంతో ఆనంద డోలికల్లో మునిగిపోయిన నంజుండే గౌడ సంతానాన్ని చూసుకోకుండానే కన్నుమూశారు. మే 11న భార్య మమత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత మూడురోజులకే ఆమె కూడా కరోనాతో కన్నుమూసింది. పూర్తిగా కోలుకునేదాకా చెప్పొద్దు భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య.. భార్య మరణాన్ని భరించలేక భర్త గుండె పగిలి మరణించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. భార్యాభర్తలిద్దరికీ కరోనా సోకి ఒకరు చనిపోతే ఆ సమాచారాన్ని మరొకరికి తెలియజేయకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రెండో వ్యక్తి పూర్తిగా కోలుకునేదాకా చావు కబురు చెప్పొద్దని అంటున్నారు. ఒక్కోసారి జీవన సహచరి/సహచరుడి మరణం గురించి తెలియకపోవడం సైతం ఎంతో మేలు చేస్తుందని ముంబైకి చెందిన సైకియాట్రిస్టు హరీష్ షెట్టి అన్నారు. అధిక ఒత్తిడి, తీవ్రమైన భావోద్వేగానికి గురికావడం బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌కు కారణమని గుర్గావ్ సైకియాట్రిస్టు జ్యోతి కపూర్ వెల్లడించారు. దశాబ్దాలపాటు కలిసి బతికిన దంపతుల్లో ఒకరి ఎడబాటు మరొకరికి అంతు లేని దుఃఖాన్ని కలిగించడం సహజమేనని పేర్కొన్నారు. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుందని వివరించారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేనివారు బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌తో మరణిస్తుంటారని అన్నారు. భార్య ఆకస్మిక మరణం వల్ల భర్త మరణించే రిస్కు 18 శాతం, భర్త ఆకస్మిక మరణం వల్ల భార్య చనిపోయే రిస్కు 16 శాతం ఉంటుం దని తమ పరిశీలనలో తేలిందని చెప్పారు. -
ఓ కొడుకా.. నీ వెంటే వస్తున్నా..!
సాక్షి, కారేపల్లి: చెట్టంత కొడుకు మరణాన్ని తట్టుకోలేని ఓ తల్లి, ‘ఓరి కొడుకా.. నీ వెంటే వస్తున్నా’నన్నట్టుగా, గుండెపోటుతో మృతిచెందింది. కారేపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులో హోటల్ నిర్వహిస్తున్న షేక్ మరున్‌బీ(70) భర్త పదేళ్ల క్రితం మృతిచెందాడు. వీరికి ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఒక కుమార్తె, ఒక కుమారుడు మూగవారు. వివాహితురాలైన మరో కుమార్తె, భర్త మృతితో పుట్టింటిలోనే ఉంటోంది. రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన ఓ కుమారుడు కూడా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇంత పెద్ద కుటుంబాన్ని చిన్న కుమారుడైన ఇక్బాల్ పోషిస్తున్నాడు. గత నెల 31న రైలు ప్రమాదంలో ఇక్బాల్ మృతిచెందాడు. అప్పటినుంచి తల్లి మరున్‌బీ తీవ్ర మనోవేదనతో ఉంటోంది. ఆమె బుధవారం రాత్రి తీవ్రంగా అస్వస్థురాలైంది. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందింది. కుటుంబ పోషకుడైన సోదరుడు, తల్లి దూరమవడంతో ఆ ఇంటిలోని వారి పరిస్థితి దయనీయంగా మారింది. మూగవారైన జకియా, నిజాముద్దీన్‌ను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. -
తేలిగ్గా చావడం ఎలా అని ఫోన్‌తో వెతికి..
ముంబయి: తన స్నేహితులకు అతనెప్పుడూ సంతోషంగా కనిపించేవాడు. అంతెందుకు అతడు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు.. సరదా కబుర్లు. ఎప్పుడూ జాలీగా కనిపిస్తూ మిత్రులతో సందడి చేసే ఆ యువకుడికి తన తండ్రి మంచి ఆడి కారును ఈ మధ్యే పుట్టిన రోజు కానుకగా అందించాడు. బాగా కలిగిన కుటుంబం.. దేనికి లోటు లేదు. అయినా కూడా ఎవ్వరో అంచనా వేయలేని అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన బాధను కొంచెం కూడా బయటకు తెలియనివ్వకుండా, కనీసం ఇలా చేస్తాడా అని కూడా ఎవరూ ఊహించే అవకాశమే లేకుండా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబయిలోని ప్రతిష్టాత్మక బాంద్రా వర్లీ వంతెనపై నుంచి దూకి మృత్యువాతపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పవన్ జీత్ కోహ్లీ (24) అనే యువకుడు ఓ వ్యాపార వేత్త కుమారుడు. అతడికి ఇటీవలె పుట్టిన రోజు వేడుక పూర్తయింది. తండ్రి ఘనంగా నిర్వహించారు కూడా. అయితే, ఇటీవల కాలంలో తాను ప్రేమిస్తున్న ఓ అమ్మాయికి నిశ్చితార్థం అయిందని అతడికి తెలిసింది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడిలోకి వెళ్లాడు. ఇక తన ప్రియురాలు దక్కని తన జీవితం వృధా అనుకున్నాడు. తన స్మార్ట్‌ఫోన్‌లో తేలికగా చనిపోవడం ఎలా అని పలుమార్లు నెట్లో వెతికాడు. తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో క్యాబ్‌ను పిలిపించుకొని బాంద్రా వర్లీ వంతెనపైకి వెళ్లాడు. తనకు వాంతి వస్తుందని, పక్కకు ఆపాలని డ్రైవర్‌కు చెప్పి ఆ వెంటనే వంతెనపై నుంచి సముద్రంలో దూకేశాడు. రెండు రోజుల తర్వాత అతడి మృతదేహం లభించింది. చేతికి ఉన్న కడియం ద్వారా తల్లిదండ్రులు అతడి మృతదేహాన్ని గుర్తించారు.