Kolkata: సీఎం మమత చేసిందేమీ లేదు: బాధితురాలి తండ్రి | Crying Video of Kolkata Junior Doctor's Father | Sakshi
Sakshi News home page

Kolkata: సీఎం మమత చేసిందేమీ లేదు: బాధితురాలి తండ్రి

Published Wed, Sep 11 2024 8:52 AM | Last Updated on Wed, Sep 11 2024 9:36 AM

Crying Video of Kolkata Junior Doctor's Father

కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్‌ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా బాధితురాలి తండ్రి పడుతున్న ఆవేదనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో బాధితురాలి తండ్రి సీఎం మమతా బెనర్జీపై పలు ఆరోపణలు చేశారు. అత్యాచార బాధితురాలి తండ్రి రోదిస్తూ ‘ఈ కేసులో సీఎం (మమతా బెనర్జీ) పాత్రపై మాకు సంతృప్తి లేదు. ఆమె ఏ పనీ చేయలేదు. ఈ ఘటనలో డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తి ప్రమేయం ఉందని మేము మొదటి నుంచి చెబుతున్నాం. ఈ సంవత్సరం దుర్గాపూజను ఎవరూ జరుపుకోరని మేము భావిస్తున్నాం. ఎవరైనా సంబరాలు చేసుకున్నా వారు ఆనందంగా జరుపుకోలేరు. ఎందుకంటే అందరూ బెంగాల్ ప్రజలే, దేశం నా కూతురిని తన కూతురిగా భావిస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఇది కూడా చదవండి: సుప్రీం డెడ్‌లైన్‌ బేఖాతరు.. సమ్మె ఆపని బెంగాల్‌ డాక్టర్లు

కాగా ఈ ఘటనను అనువుగా మలచుకుని కేంద్రం తమపై కుట్ర పన్నుతున్నదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇందులో కొన్ని వామపక్ష పార్టీల ప్రమేయం కూడా ఉందన్నారు.  అన్నారు. రాష్ట్ర సచివాలయం నబన్నలో జరిగిన పరిపాలనా సమీక్షా సమావేశంలో మమత మాట్లాడుతూ బాధితురాలి తల్లిదండ్రులకు తాను ఎప్పుడూ డబ్బు ఇవ్వజూపలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం  బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు. పొరుగు దేశంలో నెలకొన్న గందరగోళాన్ని కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని, భారత్‌, బంగ్లాదేశ్‌లు వేర్వేరు దేశాలన్న విషయాన్ని వారు మరిచిపోయారని మమత పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement