బతుకు పోరాటంలో ఒకరి కష్టం.. మరొకరికి నేత్రానందం కలిగించడం అంటే ఇదేనేమో!. ఓ తల్లి ఏనుగు ఆర్తనాదాలు చేస్తూ.. నీటి పాయలో దాని బిడ్డను అటూ ఇటూ కదిలిస్తూ లేపే ప్రయత్నం చేస్తున్న వీడియో ఒకటి నెటిజన్ల గుండెల్ని బద్ధలు చేస్తోంది. అది శాశ్వత నిద్రలోకి జారుకుందని తల్లడిల్లుతుంటే.. ఆ వీడియో మాత్రం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. జీవం లేని గున్న ఏనుగును రెండు కిలోమీటర్లు తీసుకెళ్లి మరీ నీటిలో వేసి లేపే ప్రయత్నం చేసిందట ఆ తల్లి ఏనుగు.
ఎక్కడ.. ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు, ఆ గున్నేనుగు ఎలా మరణించిందో కారణం తెలియదుగానీ.. వన్యప్రాణులపై వీడియోలు పోస్ట్ చేసే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నందా (Susanta Nanda) ద్రవీభవించిన హృదయంతో ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. లే బిడ్డా.. లే అంటూ ఆ ఏనుగు ఘీంకారంతో చేసిన దిక్కులు పిక్కటిల్లిపోయేలా చేసిన ఆర్తనాదాలకు ఫలితం లేకుండా పోయింది.
This broke my heart. The calf has died but mother doesn’t give up. Carries the dead baby for two KMs and tries to revive it by placing in water. And the mother’s cries ranting the air😭😭
— Susanta Nanda (@susantananda3) June 15, 2023
Via @NANDANPRATIM pic.twitter.com/ufgPsYsRgE
Comments
Please login to add a commentAdd a comment