baby elephant
-
అమ్మ ఒడి ‘హాయిగా’... గున్న ఏనుగు సాక్షిగా..!
చెన్నై: తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్‌లో తప్పిపోయిన గున్న ఏనుగును తల్లి చెంతకు చేర్చారు. తల్లిని కలిసిన అనంతరం చిన్న ఏనుగు అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోయింది. ఈ దృశ్యాలను అటవీ సిబ్బంది కెమెరాలో బంధించారు. ఈ చిత్రాన్ని ఐఏఎస్ అధికారి సుప్రీయా సాహు సోషల్ మీడియాలో పంచుకోగా.. విశేష స్పందనలు వచ్చాయి. గున్న ఏనుగును తల్లి వద్దకు చేర్చినందుకు అటవీ అధికారులకు ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా అభినందనలు తెలిపారు. అటవీ సిబ్బందికి నెటిజన్లు ధన్యవాదాలు తెలిపారు. జంతువుల్లోనైనా అమ్మ ప్రేమ ఒక్కటేనని కొనియాడారు. When a picture is worth a million words ❤️ the rescued baby elephant after uniting with the mother takes an afternoon nap in her mother's comforting arms before moving again with the big herd. Picture taken by Forest field staff somewhere in Anamalai Tiger reserve who are keeping… https://t.co/EedfkKjLHj pic.twitter.com/ttqafSudyM — Supriya Sahu IAS (@supriyasahuias) January 2, 2024 ఇదీ చదవండి: Ram Mandir: రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే.. -
ఓ తల్లి కడుపుకోత.. దిక్కులు పిక్కటిల్లిపోయేలా ఆర్తనాదాలు
బతుకు పోరాటంలో ఒకరి కష్టం.. మరొకరికి నేత్రానందం కలిగించడం అంటే ఇదేనేమో!. ఓ తల్లి ఏనుగు ఆర్తనాదాలు చేస్తూ.. నీటి పాయలో దాని బిడ్డను అటూ ఇటూ కదిలిస్తూ లేపే ప్రయత్నం చేస్తున్న వీడియో ఒకటి నెటిజన్ల గుండెల్ని బద్ధలు చేస్తోంది. అది శాశ్వత నిద్రలోకి జారుకుందని తల్లడిల్లుతుంటే.. ఆ వీడియో మాత్రం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. జీవం లేని గున్న ఏనుగును రెండు కిలోమీటర్లు తీసుకెళ్లి మరీ నీటిలో వేసి లేపే ప్రయత్నం చేసిందట ఆ తల్లి ఏనుగు. ఎక్కడ.. ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు, ఆ గున్నేనుగు ఎలా మరణించిందో కారణం తెలియదుగానీ.. వన్యప్రాణులపై వీడియోలు పోస్ట్ చేసే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నందా (Susanta Nanda) ద్రవీభవించిన హృదయంతో ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. లే బిడ్డా.. లే అంటూ ఆ ఏనుగు ఘీంకారంతో చేసిన దిక్కులు పిక్కటిల్లిపోయేలా చేసిన ఆర్తనాదాలకు ఫలితం లేకుండా పోయింది. This broke my heart. The calf has died but mother doesn’t give up. Carries the dead baby for two KMs and tries to revive it by placing in water. And the mother’s cries ranting the air😭😭 Via @NANDANPRATIM pic.twitter.com/ufgPsYsRgE — Susanta Nanda (@susantananda3) June 15, 2023 -
బిడ్డ జోలికి రాబోయింది.. నరకం చూపెట్టి ఉరికించింది
Elephant Viral Video: ప్రాణకోటిలో తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది. ప్రశాంతతకు మారుపేరైన ఏనుగులు తమ గున్నేనుగుల్ని ఎంత భద్రంగా చూసుకుంటాయో.. వాటికి ఆపద ఎదురైనా, ఎదురవుతుందని తెలిసినా పట్టరాని ఆవేశం ప్రదర్శిస్తుంటాయి. ఎంతదాకా అయినా వెళ్తుంటాయి. తాజాగా.. అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది. తల్లి పక్కనే ఉందనే భరోసాతో ఓ చిన్న నీటి మడుగులో గున్నేనుగు సేదతీరి ఉంటుంది. పక్కనే తల్లి ఏనుగు నీటిని జల్లుకుంటూ వేసవి తాపం చల్లార్చుకుంటుంది. ఇంతలో ఆ మడుగులో దాగి ఉన్న ఆపదను గుర్తించింది ఆ ఏనుగు. మొసలి ఒక్కసారిగా తల పైకెత్తడంతో.. వేగంగా స్పందించి కాలితో కసాబిసా మొసలిని తొక్కిపడేసింది. తల్లి చాటున భద్రత ఎరిగిన ఆ బిడ్డ.. అమ్మ పొత్తిళ్లలోకి చేరిపోయింది. నీళ్లలో ఉంటే ప్రాణం పోతుందనుకుందో ఏమో.. మొసలి బయటకు వచ్చి అపసోపాలు పడుతూ అక్కడి నుంచి పరారైంది. సోషల్ మీడియాలో నిత్యం ఈ తరహా వీడియోలు పోస్ట్ చేసే ఐఎఫ్ఎస్ సుశాంత నందా ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ఏనుగులు తమ బిడ్డలను రక్షించుకోవడంలో ఏ మేరకు ముందుకు వెళతాయన్నది మనసును కదిలించేది. ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. మొసలి లొంగిపోవలసి వచ్చింది’ అంటూ సందేశం ఉంచారాయన. ఎక్కడ, ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదుగానీ ఆ వీడియోను మీరూ చూసేయండి. The extent to which elephants can go in protecting their calves is mind boggling. Here is a small incidence. The Crocodile had to surrender 👌 pic.twitter.com/ntbmBtZm9F — Susanta Nanda (@susantananda3) April 14, 2023 -
వదిలి వెళ్లొద్దంటూ యజమానిపై ఏనుగు ప్రేమ
-
కన్నా.. వద్దు రా.. వాళ్లసలే మనుషులు!
వైరల్: నేటి పరిస్థితుల్లో.. సమాజంలో మనిషికి మనిషే శత్రువు. ఇంకా చెప్పాలంటే నోరు లేని జీవులే ఈ విషయంలో ఎంతో నయం. కనీసం అవి గుంపుగా బతుకుతున్నాయ్ అన్నాడు ఓ రచయిత. అయితే తన స్వార్థం కోసం మూగజీవాలను బలి తీసుకుంటున్న పరిస్థితుల్లో.. మనుషుల పట్ల అవి అప్రమత్తంగా ఉండడంలో ఏమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. జనావాసాల్లోకి వచ్చే మూగజీవుల పట్ల మనుషులు వ్యవహరించే తీరే అందుకు నిదర్శనం కూడా. ఒక్కోసారి వాటి మానానా అవి వెళ్తున్నా కూడా వెంటపడి మరీ వేధించడం, హింసించడం, విషాదకరమైన ఘటనలూ చూస్తున్నాం. అయితే.. ఏనుగులంటే సాధారణంగా.. కాస్త బుద్ధిజీవులు. ఒక్కోసారి వాటి తెలివి తేటలు ఆశ్చర్యపరుస్తుంటాయి. ఆకలి తీర్చుకునే విషయంలోనే కాదు.. మిగతా విషయాల్లోనూ గజరాజుల బుర్రే బుర్ర. గుంపులుగా జీవిస్తూ.. ఒక్కోసారి ప్రమాదాలను ముందుగా పసిగడుతుంటాయి. అందుకేనేమో.. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓ జాతీయ ఉద్యానవనంలో.. ఏ తల్లి ఏనుగు.. గున్న ఏనుగులు రోడ్డు దాటుతున్నాయి. ఇంతలో అక్కడే ఆగి ఉన్న టూరిస్టుల వాహనం వైపు గున్నేగును అడుగులు వేసింది. అది చూసి.. ఆ తల్లి ఏనుగు ఎక్కడికి వెళ్తావ్ అన్నట్లుగా వెనక్కి లాగేసుకుంది. పాతదా? కొత్తదా? ఎక్కడ జరిగింది అనే క్లారిటీ లేదు.. కానీ, మిలియన్నర వ్యూస్‌తో ప్రస్తుతం ఈ వీడియో ట్విటర్ ద్వారా వైరల్ అవుతోంది. Mother elephant stops its child from approaching the tourists.. pic.twitter.com/ASruHsJKnn — Buitengebieden (@buitengebieden) September 3, 2022 ఇదీ చదవండి: తలకిందులుగా ఇరుక్కుపోయిన మహిళ, ఆ తర్వాత ఏమైందంటే.. -
గున్న ఏనుగు చుట్టూ బాడీగార్డులు.. ఓ లుక్కేయండి
వైరల్: బాడీగార్డులు అంటే.. పెద్ద పెద్ద కండలు వేసుకుని.. అరడుగుల పైన ఉండి టైట్ టీ షర్టులు, హాఫ్షర్టులు వేసుకునే ఉండాలా?. సెక్యూరిటీ అంటే తుపాకులతో, కర్రలతో కాపలాగా ఉండాలా??. ఒక చిన్ని గున్న ఏనుగు.. జెడ్ ఫ్లస్ ఫ్లస్ ఫ్లస్ రేంజ్ భద్రత నడుమ వెళ్తుండడం ఎప్పుడైనా చూశారా?. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద అప్లోడ్ చేసిన సరదా వీడియో ఇప్పుడు అలాగే అనిపిస్తోంది. కోయంబత్తూర్ సత్యమంగళం అడవుల్లో అప్పుడే పుట్టిన ఓ ఏనుగు గున్నకు ఇలా ఏనుగులు ఎస్కార్టుల్లాగా వెళ్లాయి. రెప్పార్పకుండా కింది వీడియోను చూసేయండి మరి!. No body on earth can provide better security than an elephant herd to the cute new born baby. It’s Z+++. Said to be from Sathyamangalam Coimbatore road. pic.twitter.com/iLuhIsHNXp — Susanta Nanda IFS (@susantananda3) June 22, 2022 చదవండి: తిండిబోతు ఏనుగులు.. వదిలేస్తే రోజులో 18 గంటలు తింటూనే.. -
తల్లి గుండె బద్ధలైంది.. బిడ్డ శవాన్ని మోసుకుంటూ వెళ్లింది!
వైరల్: అప్పటిదాకా తల్లి చాటుగా పెరిగిన బిడ్డ.. ఆ తల్లి కళ్ల ముందే మరణిస్తే ఎలా ఉంటుంది?. మనిషి అయినా నోరు లేని జీవి అయినా అమ్మ ప్రేమ ఒక్కటే కదా!. అందుకే ఆ తల్లి ఏనుగు తల్లడిల్లింది. బరువెక్కిన గుండెతోనే బిడ్డను మోసుకుంటూ బయలుదేరింది. హృదయ విదారకమైన ఘటన.. వైరల్ అవుతూ ఎంతో మందిని కంటతడి పెట్టిస్తోంది. తన కళ్ల ముందే మరణించిన ఓ గున్న ఏనుగును మోసుకుంటూ ముందుకెళ్లింది ఓ ఏనుగు. ఆ నడక ఆగిపోకుండా.. చాలా దూరం అలా ముందుకు సాగింది. హఠాత్తుగా ఏమైందో తెలియదు.. ఆ తల్లి ఏనుగు, గున్నేనుగు శవంతో కనిపించకుండా పోయింది. బెంగాల్ జలపైగురిలో టీ ఎస్టేట్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంబరీ టీ ఎస్టేట్‌లో ఓ ఏనుగు.. తన కళ్ల ఎదురుగా చనిపోయిన గున్న ఏనుగు దేహాన్ని ఎత్తే ప్రయత్నం చేసింది. ఇబ్బంది పడుతూనే తొండంతో ఆ శవాన్ని పైకి ఎత్తి దంతాల మధ్య పట్టుకుని ముందుకు ప్రయాణం మొదలుపెట్టింది. పచ్చి నీళ్లు, ఆహారం ముట్టకుండా ముందుకు సాగింది. బిడ్డ కిందపడిపోయిన శక్తినంతా కూడదీసుకుని మళ్లీ పైకి ఎత్తి ముందుకు సాగింది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. A mother elephant seen carrying carcass of her dead calf in Ambari Tea Estate, Jalpaiguri, West Bengal, India! 🙁🙁pic.twitter.com/9YBachPy8M — Aman Verma (@amanverm_a) May 29, 2022 బనారహత్ బ్లాక్ దూవార్స్ రీజియన్‌లోని చునాభటి టీ గార్డెన్ సమీపంలోని అడవిలో శుక్రవారం ఉదయం ఆ గున్నేనుగు మరణించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అది ఎలా చనిపోయింది కారణం మాత్రం నిర్ధారించుకోలేకపోయారు. అయితే చనిపోయిన తన బిడ్డను మోసుకుంటూ మరో 30-35 ఏనుగులతో కూడిన మందతో ఆ తల్లి ఏనుగు ముందుకు ప్రయాణం మొదలుపెట్టింది. దాదాపు కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి.. చునాభటి నుంచి అంబరి టీగార్డెన్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచి డయానా టీ గార్డెన్ నుంచి న్యూదువార్స్ టీ గార్డెన్ వైపు వెళ్లింది. చివరకు రెడ్బంక్ టీ గార్డెన్‌లోని పొదల్లో బిడ్డ శవాన్ని ఉంచింది. మిగతా ఏనుగులన్నీ అడవి వైపు మళ్లాయి. కానీ.. ఆ ఏనుగుల కదలికలను పరిశీలించిన అధికారులకు ఆ గున్నేనుగు శవం దొరకలేదు.. సరికదా ఆ తల్లి ఏనుగు మంద నుంచి కనిపించకుండా పోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ తల్లి ఏనుగును ఎలాగైనా కనిపెట్టి.. అడవుల్లోకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
కన్నా.. లేరా.. బిడ్డ ప్రాణాలు పోతుంటే తల్లడిల్లిన తల్లి ఏనుగు
కళ్లముందే బిడ్డ చనిపోతే తల్లికి కలిగే కడుపుకోత అంతా ఇంతా కాదు! మనుషులైనా జంతువులైనా. కళ్లముందే బిడ్డ ప్రాణాలు పోతుంటే తల్లడిల్లిపోతున్న తల్లి ఏనుగు దృశ్యం చూసినవారందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటన కేరళలోని మలప్పురాలో జరిగింది. అడవిలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుండగా మధ్యలో వ్యవసాయ భూమిలో బావికి కనెక్ట్ చేసిన విద్యుత్ తీగతో విద్యుదాఘాతానికి గురైంది మూడేళ్ల ఏనుగు పిల్ల. అంతే షాక్‌తో విలవిల్లాడిపోయి ప్రాణాలొదిలింది. అదిచూసిన తల్లి ఏనుగు తల్లడిల్లింది. కంటనీరు పెట్టుకుంది. కన్ను మూసిన బిడ్డను తొండంతో చాలాసేపు తట్టిలేపే ప్రయత్నం చేసింది. బిడ్డలో కదలికలేకపోవడంతో ఆశలొదులుకుంది. నెమ్మదిగా వెనక్కి జరిగింది. విచారణకోసం అటవీశాఖ అధికారులు వచ్చేవరకు తల్లితోపాటు మూడు ఏనుగులు దానికి కాపలాగా ఉన్నాయి. ఆ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పిల్లఏనుగు విద్యుత్ తీగను నమిలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
Puneeth Rajkumar: గున్నకు పునీత్ పేరు
సాక్షి, శివమొగ్గ (కర్ణాటక): శివమొగ్గ తాలూకాలోని సక్రె బైలు ఏనుగుల శిబిరంలో ఇటీవల జన్మించిన బుజ్జి ఏనుగుకు పునీత్ రాజ్‌కుమార్ అని అధికారులు పేరు పెట్టారు. ప్రముఖ యువ నటుడు పునీత్ ఇటీవల కాలధర్మం చెందడం తెలిసిందే. కొన్ని నెలల క్రితం సక్రె బైలు ఏనుగుల శిబిరంలో సినిమా షూటింగ్‌కు వచ్చిన పునీత్ ఏనుగులతో సరదాగా గడిపారు. ఇందుకు గుర్తుగా గున్న ఏనుగుకు హీరో పేరును పెట్టారు. -
ఈ ఏనుగు కథ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది
మానవులే చిన్న చిన్న సమస్యలు వస్తే కంగారు పడిపోతాం. ఏదైన వ్యాధి బారినపడితేనే చాలా ఆందోళనకు గురి అవుతాం. మన బంధువులు, స్నేహితులు ధైర్యం చెబితే గానీ కుదుటపడం అలాంటి ఒక చిన్న జంతువు పిల్ల అయితే ఎంత భయపడుతోందో కదా. కానీ ఇక్కడ ఉన్న ఈ అనాథ ఏనుగు పిల్ల కెర్రియో ఎంతో ధైర్యంగా తనకు వచ్చిన వ్యాధిని ఎదుర్కొంటుంది.. (చదవండి: అతి పెద్ద నిధి.. 30 ఏళ్లుగా పరిశోధన!) పాపం దాని కాళ్లకు పక్షవాతం వచ్చి నిస్తేజంగా ఉండిపోతుంది. కానీ అది దాని సంరక్షకుని సాయంతో ఆ వ్యాధిని జయించడానికి ప్రయత్నించటమే కాక ఏవిధంగానైనా నడవాలని సంకల్పించుకుంటుంది. ఆఖరికి దాని ఉక్కు సంకల్పం ముందు ఆ వ్యాధి పరారై పోయింది. ఎంతో ఉత్సాహంగా నడవడానికి ప్రయత్నిస్తుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఏ విధంగానైనా జీవితాన్ని కొనసాగించాలనే దాని సంకల్పం గొప్పది అంటూ రకరకాలుగా ట్వీట్‌చేశారు. (చదవండి: ఛీ నా ఇల్లంతా పాడుచేసి....మొత్తం తినేసింది) Kerrio’s iron-clad will to get on with life is inspirational. This orphaned #elephant was rescued with paralysis in her hind legs. But as you can see, she is becoming stronger and more mobile with each passing day. Read her story: https://t.co/A7q5XCiH5W pic.twitter.com/ngtrwFmTIf — Sheldrick Wildlife (@SheldrickTrust) November 2, 2021 -
చూడ్డానికి పిల్ల...కానీ చెరుకు గడలను ఎలా లాగించేస్తుందో!
కుక్క పిల్లలు, కోడి పిల్లలు, ఎత క్యూట్‌గా గెంతులేస్తూ చూడముచ్చటగా ఉంటాయి. అప్పుడే పుట్టిన దూడలు, పెంపుడు జంతువుల పిల్లలు ఎంత ముద్దు ముద్దుగానో ఉంటాయి. పైగా వాటిని వదల బుద్ధి కూడా కాదు. వాటి చిలిపి చేష్టలు భలే సరదాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక పిల్ల ఏనుగు అలాగే చూడముచ్చటగా ఉంది. (చదవండి: వాట్ ఏ ఎక్స్ప్రెషన్స్...ఎవ్వరికైనా నవ్వు రావల్సిందే....) పైగా పింక్ కలర్ దుస్తులతో భలే అందంగా ముద్దుగా ఉంది. అంతేకాదు చెరుకగడలు తినడానికి ఎంతలా ప్రయత్నిస్తుందంటే చివరకు కాలు ఎత్తి లాగడానికీ కూడా చూస్తుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: సింహం సైలంట్‌గా ఉందని వేళాకోళం చేశావో..) Gannu teaching how to eat sugarcane perfectly 😘 pic.twitter.com/4ZIukc0lxN — :象: (@olIolooIl) October 27, 2021 -
పనివాడితో పిల్ల ఏనుగు పోట్లాట..ఎవరు గెలిచారో?
జంతువులు చిన్న వయసులో ఉన్నప్పుడు ఎంత ముద్దొస్తాయో అవి చేసే చిలిపి పనులు కూడా అంతే ముద్దుగా ఉంటాయి. అవి పేరకే జంతువులు గానీ మనలో ఒకరిగి ఇమిడిపోయి జీవిస్తుంటాయి. మనతో పోట్లాడేందుకు, మనతో ఆడుతూ, మన ఆహారం లాక్కునేందుకు పోటీ పడుతూ.. ఇలా అవి చేసే ప్రతీ పని మనకు ఎంతో ఉల్లాసానిస్తుంటాయి. మన ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకునే వాళ్లకు ఇదంతా అనుభవం ఉంటుంది. ఇలాంటి చిలిపి పనులు చేస్తున్న ఓ గున్న ఏనుగు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎన్‌క్లోజర్‌లో పనిచేసే కార్మికుడిని ఓ గున్న ఏనుగు సరదాగా ఆటపట్టించింది. అతనితో మజాక్లు చేస్తూ, ఆ కార్మికుడిని పనిచేయనీకుండా అడ్డుకుంది. అన్ని చేస్తూ మళ్లీ తనకి ఏమీ తెలీదు నేను తల్లిచాటు పిల్లనంటూ పెద్ద ఎనుగు వెనకాలే నక్కింది. ఇలా ఆ పనివాడితో కాసేపే సరదాగా పోట్లాడుతూ, కిందపడేసి రెజ్లింగ్‌లో మాదిరిగా ఆతనిపై కాసేపు ఉండిపోయింది. చివరకు నేనే గెలిచానోచ్.. అంటూ పనివాడి పైనుంచి పైకి లేచింది. ఈ ముద్దొచ్చే వీడియోను గన్నుప్రేమ్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే 93 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 11 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ‘సో క్యూట్ గన్నూ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ( చదవండి: ‘వావ్.. నేను ఇంత అందంగా ఉంటానా’ ) Affectionate Gannu wants to play with Hooman, but he is busy working Who will win? 🤭😝 pic.twitter.com/OFkr72FGKc — Gannuprem (@Gannuuprem) April 8, 2021 -
వైరల్ : ఏనుగు పిల్ల, కుక్క వీడియో
ఏనుగు పిల్ల, కుక్కతో పచ్చిక బయళ్లలో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత అటవీశాఖ అధికారి సుశాంతా నందా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. "స్నేహనికి ఆకారం, పరిమాణంతో సంబంధం లేదు" అని క్యాప్షన్ జతచేశారు. ఎనిమిది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియోలో ఏనుగు పిల్ల తన స్నేహితులలో ఒకరైన కుక్కతో ఆడుతూ కనిపించింది. పచ్చిక బయళ్లలో ఇద్దరూ ఆడుతూ ఒకదాని వెనక మరొకటి పరిగెడుతూ ఆనందిస్తున్నాయి. ఈ చిన్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాదాపు 11,000 మంది వీక్షించారు. అనేక మంది లైక్స్, రీట్వీట్లు కూడా చేశారు. "అబ్బా... ఎంత బాగుంది" అన్నారు ఓ నెటిజన్. మరొక వ్యాఖ్య, "ఈరోజు ఒక గొప్ప వీడియో చూశాను" లాంటి చాలా వ్యాఖ్యలు వచ్చాయి. Friends come in all size and shapes... pic.twitter.com/PaDOQzG6c4 — Susanta Nanda (@susantananda3) November 26, 2020 -
వైరల్ వీడియో: గున్న ఏనుగు వాకింగ్!
సాక్షి, బెంగుళూరు: సాధారణంగా పెంపుడు జంతువులు తమతో పాటు వాకింగ్ చేస్తే యజమానులు చాలా సంతోష పడతారు. అవి తమతో పాటు నడవటం, పరుగెత్తటం చూసి మురిసిపోతారు. తాజాగా మైసూర్‌లోని జూ సంరక్షణలో ఉన్న ఓ గున్న ఏనుగు తన కేర్ టేకర్ వెంట నడుస్తూ, పరుగెత్తే వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కర్ణాటక జూ తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ‘మైసూర్ జంతు ప్రదర్శనశాలలో వేదవతి అనే చిన్నఏనుగు సోము సంరక్షణలో పెరుగుతోంది. వేదవతి కాకుండా మరో ఐదు గున్న ఏనుగులు అతని సంరక్షణలో ఉన్నాయి’ అని పేర్కొంది. మరో వీడియోను పోస్ట్ చేసి.. ‘వేదవతి ఎలా పరుగెత్తుతుందో చూడండి. ఈ చిన్న ఏనుగు రోజూ నడవటానికి ఇష్టపడుతుంది. మైసూర్ జంతు ప్రదర్శనశాలలో వేదవతి చేరినప్పుడు కేవలం 89 కిలోల బరువు మాత్రమే ఉండేది. రెండు నెలల వ్యవధిలో సోము సంరక్షణలో సుమారు 20 కేజీల బరువు పెరిగింది. కేర్ టేకర్ సోము ప్రతి రోజు వేదవతిని జూ చూట్టు వాకింగ్‌కి తీసుకెళ్తాడు. ఈ గున్న ఏనుగు రోజుకు మూడు సార్లు జూ చుట్టు పరుగులు తీస్తూ వ్యాయామం పూర్తి చేసుకుంటుంది’ అని కామెంట్ కర్ణాటక జూ తెలిపింది. ‘కరోనా కాలంలో మేము బంధీలమయ్యాంది. గున్న ఏనుగుకు ఎప్పుడూ స్వేచ్ఛే’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #Vedavathi lives walking and running, #Somu takes around three times in a day. Look how she runs!! She was 89 kgs , when arrived now 110kgs, gained any 20kgs in two months.@aranya_kfd @CZA_Delhi @AnandSinghBS @KarnatakaWorld @PIBBengaluru pic.twitter.com/PFPlpFshWi — Zoos of Karnataka (@ZKarnataka) July 13, 2020 -
గున్న ఏనుగు పరుగు..
-
వైరల్: థ్యాంక్స్ చెప్పిన తల్లి ఏనుగు.. నెటిజన్లు ఫిదా
మనకు సహాయం చేసిన వ్యక్తులకి కృతజ్ఞత చెప్పడం మన కనీస ధర్మం. ఈ విషయం తెలిసీ తెలియక చాలా మంది కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతుంటారు. కొంత మంది అయితే చెప్పేదేముందిలే అంటూ లైట్ తీసుకుంటారు. కానీ జంతువులు మాత్రం పొందిన సహాయాన్ని మర్చిపోలేవు. దీనికి తాజాగా వైరల్ అయిన ఓ వీడియోనే నిదర్శనం. బావిలో పడిపోయిన తన బిడ్డను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పింది ఓ తల్లి ఏనుగు. సేఫ్‌గా బయట పడ్డాముగా ఇంకేముందిలే అని మనుషుల్లా అలోచించకుండా..తన సైగలతో రక్షించిన వారందరికి థ్యాంక్స్ చెప్పింది. వీడియోలో ఏముందంటే.. ఓ పిల్ల ఏనుగులో అనుకోకుండా లోతైన బావిలో పడిపోయింది. పైకి వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా రాలేకపోయింది. తల్లి ఏనుగుతో సహా మిగతా ఏనుగులు కూడా ఏమీ చేయలేకపోయాయి. అరుపులు విన్న స్థానికులు లోయలో పడిన ఏనుగును సురక్షితంగా బయటకు తీశారు. జేసీబీలో సహాయంతో మట్టిని బావిలోకి తోస్తూ ఏనుగు బయటకు వచ్చేలా చేశారు. బయటపడ్డ ఏనుగు వెంటనే తన తల్లి ఉన్న గుంపులోకి పరగెత్తింది. పిల్ల ఏనుగు రావడంతో గుంపు అంతా అడవిలోకి వెళ్లింది. తల్లి ఏనుగు మాత్రం మరలా వెనక్కి తిరిగి తొండం పైకిలేపి ఊపుతూ కాపాడిన వారికి కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘అది అద్భుతమైన జంతువు’, ‘హృదయాలను కదలించే ఘటన..మనుషులు జంతువులతో సహజీవనం చేయ్యొచ్చు’, ‘వావ్.. జంతువుల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు’, ‘ బిడ్డను కాపాడిన వారిని తల్లి ఏనుగు ఆశీర్వదించింది’, ‘మనుషుల కంటే జంతువులే బెటర్’ అంటూ నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం తెలియరాలేదు. -
బుజ్జి గజరాజు అమేజింగ్ వీడియో!
అప్పుడప్పుడే తప్పటడుగులు వేసే బుజ్జాయిలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. అదేవిధంగా ఈ బుజ్జీ గజరాజు పక్షులను వెంటాడుతూ చేసిన విన్యాసాలు కూడా ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఓ బుజ్జీ ఏనుగు తన కన్నా కాస్తా చిన్నవిగా ఉన్న జెనీవాను కోళ్లను చూసి ముచ్చటపడినట్టు ఉంది. వాటిని వెంటాడి ఆట పట్టించాలనుకుంది. వాటి వెంటపడి చుట్టూ తిరిగింది. అలా తిరుగుతూ అమాంతం పడిపోయింది. అలా పడిపోవడం సిగ్గనిపించిందేమో.. వెంటనే తన సమీపంలో ఉండి తన ఆటను చూస్తున్న తల్లి ఏనుగు దగ్గరికి పరిగెత్తుకెళ్లి.. దాని చాటున దాగుండి పోయింది. చూడటానికి ఎంతో ముద్దుగా ఉన్న ఈ బుజ్జీ ఏనుగు వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్‌గా మారిపోయింది. దక్షిణ స్వీడన్‌లోని బోరాస్ జూలో ఈ వీడియోను చిత్రీకరించారు. -
పక్షులతో పిల్ల ఏనుగు ఆటలు.. వైరల్ వీడియో
దక్షిణ స్వీడన్ లోని ఓ జూలో ఏనుగు పిల్ల ఆటలు ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 24 గంటల్లోనే లక్షకు పైగా వ్యూస్, వేల లైక్స్ తో వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. స్థానిక బోరాస్ జూలో ఏ చోట తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు ఉన్నాయి. వాటికి కొద్ది దూరంలో కొన్ని పక్షులు ఉన్నాయి. ఇంతలో పిల్ల ఏనుగుకు ఆ పక్షులతో సరదాగా ఆడుకోవాలనిపించింది. ఏనుగు పిల్ల అనుకున్నదే తడువుగా చుట్టూ ఉన్న పక్షుల వెంట పరుగులు తీసింది. చిన్న గజరాజు అయినా, ఆకారంలో తమతోపోచ్చితే పెద్దది కనుక పక్షులన్నీ భయంతో పరుగులు తీశాయి. దీంతో పక్షులను ఎలాగైనా పట్టుకోవాలన్న కోరికతో కాసేపు పరుగులు తీసిన చిన్న ఏనుగు ఒక్కసారిగా కింద పడిపోయింది. ఇక తన ఆటలు చాలని తల్లి ఏనుగు వద్దకు వెళ్లింది. జూకు వచ్చి ఓ సందర్శకుడు ఈ సన్నివేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘నేను భయపడ్డాను.. నాకు భయంగా ఉందంటూ’ ప్రతి పక్షి మనసులో అనుకున్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, కింద పడ్డాను మమ్మీ అంటూ చిన్న గజరాజు తల్లి వద్దకు మళ్లీ పరుగులు తీసిందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. -
ఫుట్బాల్లా పిల్ల ఏనుగుతో ఆడుకుంది!
ఏనుగులు ఎక్కడ చూసినా గుంపులుగానే కనిపిస్తాయి. అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు, పిన్ని, బాబాయ్, పెదనాన్న... ఇలా ఓ పెద్ద కుటుంబమే కలిసి తిరుగుతూ ఉంటాయి. దక్షిణాఫ్రికాలోని అడ్డో ఎలిఫెంట్ నేషనల్ పార్కులో కూడా ఇలాగే కొన్ని ఏనుగులు గుంపుగా వెళ్తున్నాయి. వాటిలో చాలా వరకు పెద్ద ఏనుగులు ఉండగా, ఓ బుల్లి ఏనుగు పిల్ల.. అదేనండీ, గున్న ఏనుగు కూడా ఉంది. దాన్ని చూసిన ఓ పెద్ద ఏనుగుకు ముచ్చట వేసిందో ఏమో గానీ, ఒక్కసారిగా దాన్ని ఎత్తి కుదేసింది. అయితే.. అదేదో కోపంతో పడేసినట్లు కాకుండా, ఆత్మరక్షణ విద్యలు నేర్పిస్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. ఎందుకంటే, పడేసిన కొద్ది క్షణాల్లోనే మళ్లీ అదే పెద్ద ఏనుగు ఆ గున్న ఏనుగును జాగ్రత్తగా తొండంతో లేపి నిలబెట్టింది. అలా రెండు మూడు సార్లు ఏదో ఫుట్‌బాల్‌తో ఆడుకున్నట్లుగా ఆ పిల్ల ఏనుగుతో కాసేపు ఆడుకుంది. మధ్యలో ఓ మాదిరిగా ఎదిగిన ఏనుగులు కూడా గున్న ఏనుగును జాగ్రత్తగా కాపాడి పక్కకు తీసుకెళ్లాయి. పెద్ద ఏనుగులు ఇలా గున్న ఏనుగులను పడేయడం, వాటికి హాని చేయడం బాధాకరమని పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. కానీ నిజానికి ఆ పెద్ద ఏనుగు తీరు చూస్తుంటే మాత్రం దానికి హాని చేసేలా లేదు. అత్యంత జాగ్రత్తగా తన కాలి అడుగు దానిమీద పడకుండా జాగ్రత్త పడటమే కాక, కింద పడిపోతున్న గున్నను పైకి లేపి ట్రైనింగ్ ఇచ్చినట్లే ఉంది. జెనీ స్మితీస్ అనే నేచర్ గైడ్ ఈ వీడియో తీశారు. లాయిడ్ కార్టర్ అనే ఫొటోగ్రాఫర్ కూడా దీనికి సాక్షిగా నిలిచారు. -
ఫుట్బాల్లా పిల్ల ఏనుగుతో ఆడుకుంది!
-
వావ్.. నెటిజన్ల ప్రేమను దోచేశారు
-
చనిపోయిన తల్లిని నిద్రలేపేందుకు....
-
పరుగున వెళ్లిన పిల్ల ఏనుగు ఏం చేసిందంటే...
-
పరుగున వెళ్లిన పిల్ల ఏనుగు ఏం చేసిందంటే...
ఏనుగుకు, మనిషికి ఉండే అనుబంధం చాలా గొప్పది. దీని గురించి ఇప్పటికే చాలా సినిమాలు కూడా వచ్చాయి. అందులోనూ పిల్ల ఏనుగులైతే మనుషులకు మరీ త్వరగా చేరువ అవుతాయి. తమకు తెలిసిన మనుషులు ప్రమాదంలో ఉన్నారని భావిస్తే.. అవి ఎలా రియాక్ట్ అవుతాయో వివరించే వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను ఇప్పటికి దాదాపు 22 లక్షల మందికి పైగా చూశారు. డెరిక్ అనే ఏనుగుల శిక్షకుడు నీళ్లలో ఈదుతుండగా.. ఆయనేదో మునిగిపోతున్నాడని భావించిన ఖామ్ లా అనే ఓ ఏనుగు పిల్ల చకచకా నీళ్లలోకి వెళ్లిపోయి.. ప్రవాహాన్ని సైతం దాటుకుంటూ ఆయన దగ్గరకు వెళ్తుంది. అవతలి గట్టు వరకు వెళ్లి మరీ డెరిక్‌ను తన తొండంతో పట్టుకుని పక్కకు తీసుకెళ్తుంది. ఉత్తర థాయ్‌లాండ్‌లోని ఎలిఫెంట్ నేచర్ పార్కులో ఆవిష్కృతమైన ఈ దృశ్యం వీక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. జంతువులను మనం ప్రేమగా చూస్తే.. అవి మనకు రెట్టింపు ప్రేమను అందిస్తాయన్న విషయం దీంతో నిరూపితం అవుతోందతని అంటున్నారు. -
గోతిలోగున్న ఏనుగు
-
అందని మామిడి పండు పుల్లన..
జాంబియాలోని లువాంగ్వా జాతీయ పార్కు.. ఓ పిల్లేనుగుకి ఆకలేసింది.. బద్దకంగా లేచి.. ఆహారం కోసం బయల్దేరింది. దారిలో మామిడి చెట్టు.. నోరూరించే మామిడి పళ్లు.. ట్రై చేసింది.. అందలేదు.. చివరికి సర్కస్ ఏనుగు స్థాయిలో రెండు కాళ్లు గాలిలోకి లేపి.. ఫీట్లు చేసింది. అబ్బే.. అందితేగా.. దీంతో మనం చదువుకున్న కథలో నక్క బావలాగే.. అందని మామిడి పండు పుల్లన అనుకుంటూ నిట్టూర్చింది. పై కథకు సరిపోయేలా ఉన్న ఈ అద్భుతమైన చిత్రాన్ని తీసింది బ్రిటన్‌కు చెందిన ల్యూక్ మస్సే అనే ఫొటోగ్రాఫర్. దాదాపు రెండు వారాలపాటు లువాంగ్వా జాతీయ పార్కులో ఉండి.. ఇలాంటివెన్నో అద్భుత చిత్రాలను క్లిక్‌మనిపించారు.