ఫుట్‌బాల్‌లా పిల్ల ఏనుగుతో ఆడుకుంది! | bull elephant plays with baby elephant like football | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌లా పిల్ల ఏనుగుతో ఆడుకుంది!

Published Tue, May 2 2017 2:24 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

ఫుట్‌బాల్‌లా పిల్ల ఏనుగుతో ఆడుకుంది!

ఫుట్‌బాల్‌లా పిల్ల ఏనుగుతో ఆడుకుంది!

ఏనుగులు ఎక్కడ చూసినా గుంపులుగానే కనిపిస్తాయి. అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు, పిన్ని, బాబాయ్, పెదనాన్న... ఇలా ఓ పెద్ద కుటుంబమే కలిసి తిరుగుతూ ఉంటాయి. దక్షిణాఫ్రికాలోని అడ్డో ఎలిఫెంట్ నేషనల్ పార్కులో కూడా ఇలాగే కొన్ని ఏనుగులు గుంపుగా వెళ్తున్నాయి. వాటిలో చాలా వరకు పెద్ద ఏనుగులు ఉండగా, ఓ బుల్లి ఏనుగు పిల్ల.. అదేనండీ, గున్న ఏనుగు కూడా ఉంది. దాన్ని చూసిన ఓ పెద్ద ఏనుగుకు ముచ్చట వేసిందో ఏమో గానీ, ఒక్కసారిగా దాన్ని ఎత్తి కుదేసింది. అయితే.. అదేదో కోపంతో పడేసినట్లు కాకుండా, ఆత్మరక్షణ విద్యలు నేర్పిస్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. ఎందుకంటే, పడేసిన కొద్ది క్షణాల్లోనే మళ్లీ అదే పెద్ద ఏనుగు ఆ గున్న ఏనుగును జాగ్రత్తగా తొండంతో లేపి నిలబెట్టింది.

అలా రెండు మూడు సార్లు ఏదో ఫుట్‌బాల్‌తో ఆడుకున్నట్లుగా ఆ పిల్ల ఏనుగుతో కాసేపు ఆడుకుంది. మధ్యలో ఓ మాదిరిగా ఎదిగిన ఏనుగులు కూడా గున్న ఏనుగును జాగ్రత్తగా కాపాడి పక్కకు తీసుకెళ్లాయి. పెద్ద ఏనుగులు ఇలా గున్న ఏనుగులను పడేయడం, వాటికి హాని చేయడం బాధాకరమని పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. కానీ నిజానికి ఆ పెద్ద ఏనుగు తీరు చూస్తుంటే మాత్రం దానికి హాని చేసేలా లేదు. అత్యంత జాగ్రత్తగా తన కాలి అడుగు దానిమీద పడకుండా జాగ్రత్త పడటమే కాక, కింద పడిపోతున్న గున్నను పైకి లేపి ట్రైనింగ్ ఇచ్చినట్లే ఉంది. జెనీ స్మితీస్ అనే నేచర్ గైడ్ ఈ వీడియో తీశారు. లాయిడ్ కార్టర్ అనే ఫొటోగ్రాఫర్ కూడా దీనికి సాక్షిగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement