bull elephant
-
ఫుట్బాల్లా పిల్ల ఏనుగుతో ఆడుకుంది!
ఏనుగులు ఎక్కడ చూసినా గుంపులుగానే కనిపిస్తాయి. అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు, పిన్ని, బాబాయ్, పెదనాన్న... ఇలా ఓ పెద్ద కుటుంబమే కలిసి తిరుగుతూ ఉంటాయి. దక్షిణాఫ్రికాలోని అడ్డో ఎలిఫెంట్ నేషనల్ పార్కులో కూడా ఇలాగే కొన్ని ఏనుగులు గుంపుగా వెళ్తున్నాయి. వాటిలో చాలా వరకు పెద్ద ఏనుగులు ఉండగా, ఓ బుల్లి ఏనుగు పిల్ల.. అదేనండీ, గున్న ఏనుగు కూడా ఉంది. దాన్ని చూసిన ఓ పెద్ద ఏనుగుకు ముచ్చట వేసిందో ఏమో గానీ, ఒక్కసారిగా దాన్ని ఎత్తి కుదేసింది. అయితే.. అదేదో కోపంతో పడేసినట్లు కాకుండా, ఆత్మరక్షణ విద్యలు నేర్పిస్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. ఎందుకంటే, పడేసిన కొద్ది క్షణాల్లోనే మళ్లీ అదే పెద్ద ఏనుగు ఆ గున్న ఏనుగును జాగ్రత్తగా తొండంతో లేపి నిలబెట్టింది. అలా రెండు మూడు సార్లు ఏదో ఫుట్‌బాల్‌తో ఆడుకున్నట్లుగా ఆ పిల్ల ఏనుగుతో కాసేపు ఆడుకుంది. మధ్యలో ఓ మాదిరిగా ఎదిగిన ఏనుగులు కూడా గున్న ఏనుగును జాగ్రత్తగా కాపాడి పక్కకు తీసుకెళ్లాయి. పెద్ద ఏనుగులు ఇలా గున్న ఏనుగులను పడేయడం, వాటికి హాని చేయడం బాధాకరమని పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. కానీ నిజానికి ఆ పెద్ద ఏనుగు తీరు చూస్తుంటే మాత్రం దానికి హాని చేసేలా లేదు. అత్యంత జాగ్రత్తగా తన కాలి అడుగు దానిమీద పడకుండా జాగ్రత్త పడటమే కాక, కింద పడిపోతున్న గున్నను పైకి లేపి ట్రైనింగ్ ఇచ్చినట్లే ఉంది. జెనీ స్మితీస్ అనే నేచర్ గైడ్ ఈ వీడియో తీశారు. లాయిడ్ కార్టర్ అనే ఫొటోగ్రాఫర్ కూడా దీనికి సాక్షిగా నిలిచారు. -
ఫుట్బాల్లా పిల్ల ఏనుగుతో ఆడుకుంది!
-
అరటన్ను దున్నను అలవోకగా గాల్లోకి ఎగరేసి..
కెన్యా: గజరాజుకు కోపం వస్తే ఎలా ఉంటుందో కెన్యాలో ఓ వన్యమృగక్షేత్రం కళ్లకు కట్టినట్లు చూపింది. అక్కడ ఒళ్లుగగుర్పొడిచే దృశ్యం కనిపించింది. దాదాపు 500 కేజీల బరువున్న దున్నను ఓ తల్లి ఏనుగు అమాంతం గాల్లోకి ఓ ఆడుకునే బొమ్మలా విసిరేసింది. అనంతరం తన దంతాలతో ఆ దున్న తీవ్రగాయాలపాలై విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచింది. ఈ సన్నివేశాలను తన కెమెరాలో క్లిక్ మనిపించిన ఫొటో గ్రాఫర్ తన జీవితం మొత్తంలో ఇలాంటి దృశ్యం ఇక చూడబోవచ్చని, తన కెమెరాలో బందించలేకపోవచ్చని చెప్పాడంటే ఆ సంఘటన ఎంత భయంకరంగా చోటుచేసుకుందో తెలుసుకోవచ్చు. కెన్యాలోని మాస్సాయి మరా అనే వన్యమృగ క్షేత్రంలో ఏనుగులు,అడవి బర్రెలు, అడవి దున్నపోతులు, ఇతర క్రూరమృగాలు ఉంటాయి. అవి వాటివాటి రక్షణకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఆహారంకోసం వెళుతుంటాయి. అయితే, బాగా తినేసిన ఓ దున్నపోతు అక్కడే ఓ చెట్టువద్ద మెళ్లగా కన్నార్పి విశ్రాంతి తీసుకుంటోంది. అదే సమయంలో ఆ వైపుగా తన పిల్లలతో ఓ భారీ తల్లి ఏనుగు వచ్చింది. ఎంతో ప్రశాంతంగా ఏమాత్రం గంభీరంగా కనిపించకుండా ఆ దున్నపోతు ఉన్న చోటును సమీపించింది. ఈలోగా మేలుకున్న దాన్ని ప్రతిఘటించేలోగానే ఆ భారీ ఏనుగు అమాంతం తన తొండాన్ని 500కేజీల బరువున్న ఆ దున్న పొట్టకిందికి దూర్చి ఒక్కసారిగా గాల్లోకి కొన్ని అడుగుల ఎత్తులోకి విసిరేసింది. దీంతో దాని ఎముకలు మొత్తం విరిగిపోయి తీవ్రంగా గాయపడింది. రక్తం కారుతున్నా వదిలిపెట్టని ఆ ఏనుగు మరోసారి కూడా తన బలాన్ని దానిపై చూపి చనిపోయేలా చేసి వెళ్లిపోయింది.