
బుజ్జి గజరాజు అమేజింగ్ వీడియో!
అప్పుడప్పుడే తప్పటడుగులు వేసే బుజ్జాయిలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. అదేవిధంగా ఈ బుజ్జీ గజరాజు పక్షులను వెంటాడుతూ చేసిన విన్యాసాలు కూడా ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఓ బుజ్జీ ఏనుగు తన కన్నా కాస్తా చిన్నవిగా ఉన్న జెనీవాను కోళ్లను చూసి ముచ్చటపడినట్టు ఉంది. వాటిని వెంటాడి ఆట పట్టించాలనుకుంది. వాటి వెంటపడి చుట్టూ తిరిగింది.
అలా తిరుగుతూ అమాంతం పడిపోయింది. అలా పడిపోవడం సిగ్గనిపించిందేమో.. వెంటనే తన సమీపంలో ఉండి తన ఆటను చూస్తున్న తల్లి ఏనుగు దగ్గరికి పరిగెత్తుకెళ్లి.. దాని చాటున దాగుండి పోయింది. చూడటానికి ఎంతో ముద్దుగా ఉన్న ఈ బుజ్జీ ఏనుగు వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిపోయింది. దక్షిణ స్వీడన్‌లోని బోరాస్ జూలో ఈ వీడియోను చిత్రీకరించారు.