
అందని మామిడి పండు పుల్లన..
జాంబియాలోని లువాంగ్వా జాతీయ పార్కు.. ఓ పిల్లేనుగుకి ఆకలేసింది.. బద్దకంగా లేచి.. ఆహారం కోసం బయల్దేరింది. దారిలో మామిడి చెట్టు.. నోరూరించే మామిడి పళ్లు.. ట్రై చేసింది.. అందలేదు.. చివరికి సర్కస్ ఏనుగు స్థాయిలో రెండు కాళ్లు గాలిలోకి లేపి.. ఫీట్లు చేసింది. అబ్బే.. అందితేగా.. దీంతో మనం చదువుకున్న కథలో నక్క బావలాగే.. అందని మామిడి పండు పుల్లన అనుకుంటూ నిట్టూర్చింది. పై కథకు సరిపోయేలా ఉన్న ఈ అద్భుతమైన చిత్రాన్ని తీసింది బ్రిటన్‌కు చెందిన ల్యూక్ మస్సే అనే ఫొటోగ్రాఫర్. దాదాపు రెండు వారాలపాటు లువాంగ్వా జాతీయ పార్కులో ఉండి.. ఇలాంటివెన్నో అద్భుత చిత్రాలను క్లిక్‌మనిపించారు.