కన్నా.. లేరా.. బిడ్డ ప్రాణాలు పోతుంటే తల్లడిల్లిన తల్లి ఏనుగు  | Mother Elephant Cries For Dead Baby Elephant | Sakshi
Sakshi News home page

కన్నా.. లేరా.. బిడ్డ ప్రాణాలు పోతుంటే తల్లడిల్లిన తల్లి ఏనుగు 

Published Fri, Nov 19 2021 4:53 AM | Last Updated on Fri, Nov 19 2021 4:53 AM

Mother Elephant Cries For Dead Baby Elephant - Sakshi

కళ్లముందే బిడ్డ చనిపోతే తల్లికి కలిగే కడుపుకోత అంతా ఇంతా కాదు! మనుషులైనా జంతువులైనా. కళ్లముందే బిడ్డ ప్రాణాలు పోతుంటే తల్లడిల్లిపోతున్న తల్లి ఏనుగు దృశ్యం చూసినవారందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటన కేరళలోని మలప్పురాలో జరిగింది. అడవిలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుండగా మధ్యలో వ్యవసాయ భూమిలో బావికి కనెక్ట్‌ చేసిన విద్యుత్‌ తీగతో విద్యుదాఘాతానికి గురైంది మూడేళ్ల ఏనుగు పిల్ల.

అంతే షాక్‌తో విలవిల్లాడిపోయి ప్రాణాలొదిలింది. అదిచూసిన తల్లి ఏనుగు తల్లడిల్లింది. కంటనీరు పెట్టుకుంది. కన్ను మూసిన బిడ్డను తొండంతో చాలాసేపు తట్టిలేపే ప్రయత్నం చేసింది. బిడ్డలో కదలికలేకపోవడంతో ఆశలొదులుకుంది. నెమ్మదిగా వెనక్కి జరిగింది. విచారణకోసం అటవీశాఖ అధికారులు వచ్చేవరకు తల్లితోపాటు మూడు ఏనుగులు దానికి కాపలాగా ఉన్నాయి. ఆ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పిల్లఏనుగు విద్యుత్‌ తీగను నమిలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement