వైరల్ :‌ ఏనుగు పిల్ల, కుక్క వీడియో | Viral: Baby Elephant Plays With Dog Video | Sakshi
Sakshi News home page

వైరల్ :‌ ఏనుగు పిల్ల, కుక్క వీడియో

Published Fri, Nov 27 2020 12:41 PM | Last Updated on Fri, Nov 27 2020 2:25 PM

Viral: Baby Elephant Plays With Dog Video - Sakshi

ఏనుగు పిల్ల, కుక్కతో పచ్చిక బయళ్లలో ఆడుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. భారత అటవీశాఖ అధికారి సుశాంతా నందా ఈ వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. "స్నేహనికి ఆకారం, పరిమాణంతో సంబంధం లేదు" అని క్యాప్షన్‌ జతచేశారు. ఎనిమిది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియోలో ఏనుగు పిల్ల తన స్నేహితులలో ఒకరైన కుక్కతో ఆడుతూ కనిపించింది. పచ్చిక బయళ్లలో ఇద్దరూ ఆడుతూ ఒకదాని వెనక మరొకటి పరిగెడుతూ ఆనందిస్తున్నాయి. ఈ చిన్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాదాపు 11,000 మంది  వీక్షించారు. అనేక మంది లైక్స్, రీట్వీట్లు కూడా చేశారు. "అబ్బా... ఎంత బాగుంది" అన్నారు ఓ నెటిజన్‌. మరొక వ్యాఖ్య, "ఈరోజు ఒక గొప్ప వీడియో చూశాను" లాంటి చాలా వ్యాఖ్యలు వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement