దక్షిణ స్వీడన్ లోని ఓ జూలో ఏనుగు పిల్ల ఆటలు ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 24 గంటల్లోనే లక్షకు పైగా వ్యూస్, వేల లైక్స్ తో వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. స్థానిక బోరాస్ జూలో ఏ చోట తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు ఉన్నాయి. వాటికి కొద్ది దూరంలో కొన్ని పక్షులు ఉన్నాయి. ఇంతలో పిల్ల ఏనుగుకు ఆ పక్షులతో సరదాగా ఆడుకోవాలనిపించింది. ఏనుగు పిల్ల అనుకున్నదే తడువుగా చుట్టూ ఉన్న పక్షుల వెంట పరుగులు తీసింది.
చిన్న గజరాజు అయినా, ఆకారంలో తమతోపోచ్చితే పెద్దది కనుక పక్షులన్నీ భయంతో పరుగులు తీశాయి. దీంతో పక్షులను ఎలాగైనా పట్టుకోవాలన్న కోరికతో కాసేపు పరుగులు తీసిన చిన్న ఏనుగు ఒక్కసారిగా కింద పడిపోయింది. ఇక తన ఆటలు చాలని తల్లి ఏనుగు వద్దకు వెళ్లింది. జూకు వచ్చి ఓ సందర్శకుడు ఈ సన్నివేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘నేను భయపడ్డాను.. నాకు భయంగా ఉందంటూ’ ప్రతి పక్షి మనసులో అనుకున్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, కింద పడ్డాను మమ్మీ అంటూ చిన్న గజరాజు తల్లి వద్దకు మళ్లీ పరుగులు తీసిందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
పక్షులతో పిల్ల ఏనుగు ఆటలు.. వైరల్ వీడియో
Published Sat, Jun 24 2017 4:01 PM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM
Advertisement
Advertisement