ప్రతీకాత్మక చిత్రం
భోపాల్: మూడు రోజుల పసికందును బతికుండగానే పాతిపెట్టడానికి ఆ తల్లిదండ్రులకు మనసెలా వచ్చిందో! ఐతే విధి చిన్నచూపు చూసినా మృత్యువును జయించి మరీ అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ పసికూన. వివరాల్లోకెళ్తే..
మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో బతికున్న మూడురోజున పసిబిడ్డను నది ఒడ్డున మట్టిలో పాతిపెట్టిన ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. గురువారం సాయంత్రం ఝంగర్చక్ గ్రామ సమీప పొలాల్లో పనులు చేసుకునే కొందరు గ్రామస్థులకు పసిబిడ్డ ఏడుపు వినిపించిన ప్రదేశానికి వెళ్లారు. కొంతసమయానికి బిడ్డ ఏడుపు మట్టికింద నుంచి రావడాన్ని గమనించి, మట్టిని జాగ్రత్తగా తొలగించించారు.
అనంతరం కనిపించిన దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్యర్యపోయారు. కేవలం రోజుల వయసున్న నవజాత శిశువును ఒక సంచిలో చుట్టి బతికుండగానే మట్టిలో పూడ్చిపెట్టారు. దీంతో వారు బిడ్డను రక్షించి ముంగావలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స నిమిత్తం చేర్పించారు. శిశువును పరీక్షించిన వైద్యులు ఆరోగ్యంగా ఉన్నట్లు ధృవీకరించారు. ఈ సంఘటనపై సెక్షన్ 317 కింద కేసు ఫైల్‌చేసి నిందితుల కోసం గాలింపుచర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ సతీష్ గార్గ్ మీడియాకు వెల్లడించారు.
చదవండి: ఫేస్‌బుక్‌లో పరిచయం.. మత్తిచ్చి అత్యాచారం.. ఫోర్న్‌వీడియో తీసి 10 లక్షలు డిమాండ్!
Comments
Please login to add a commentAdd a comment