టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి మానసిక రుగ్మతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక అథ్లెట్‌గా మానసిక సమస్యను భరించడం కష్టమని.. అది మనలో ఎంతో ఒత్తిడి నింపుతుందని పేర్కొన్నాడు. అలాంటి అనుభవం నాకు కూడా ఎదురైందని కోహ్లి తెలిపాడు. ఒక దశలో చుట్టూ అందరూ ప్రేమించేవాళ్లు ఉన్నప్పటికి ఒంటరిగా ఫీలయ్యానని చెప్పుకొచ్చాడు. కొంత గ్యాప్ తర్వాత ఆసియాకప్ 2022కు సన్నద్ధమవుతున్న కోహ్లి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అథ్లెట్లకు ఉండే మానసిక ఒత్తిడిని ఎలా జయించాలనే దానిపై మాట్లాడాడు.
''సాధారణంగా అథ్లెట్ ఒక ఆటగాడిగా ఉత్తమమైన వాటిని తీసుకురావాలి. అదే సమయంలో ఉండే ఒత్తిడి మన మానసిక ఆరోగ్యంపై ప్రతికూలం ప్రభావితం చూపిస్తోంది. దీనిని దరి చేరనీయకుండా ఉండాలంటే కసరత్తులపై దృష్టి పెట్టాలి. మంచి ఫిట్‌నెస్ ఉంటే ఆటోమెటిక్‌గా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనం చేయాలనుకుంటున్న పనిపై కూడా శ్రద్ద పెరుగుతుంది. ఈ సందర్భంగా ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నా.
ఇలాంటి అనుభవం నాకు ఎదురైంది. ఒకసారి నేను వెళ్లిన గదిలో నా చుట్టూ ఉన్నవాళ్లంతా నన్ను ప్రేమించేవాళ్లో లేక అండగా నిలబడేవాళ్లు ఉన్నారు. అయినప్పటికి నేను ఒంటరిగా ఫీలయ్యా. ఎవరితో సరిగ్గా కలవలేకపోయాను. కానీ ఆ తర్వాత నాకు నేను సర్దిచెప్పుకొని కలిసిపోయాను. అందుకే మన మూడ్ సరిగా లేకపోయినప్పటికి నిరంతరం అందరితో మంచి రిలేషన్ కొనసాగిస్తూనే ఉండాలి. మీకున్న ఒత్తిడి తొలగించుకోవడానికి ఇదే మంచి మార్గం'' అని చెప్పుకొచ్చాడు.
ఇంగ్లండ్ పర్యటన తర్వాత జట్టుకు దూరమైన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆసియా కప్-2022 టోర్నీ నేపథ్యంలో తిరిగి మైదానంలో దిగనున్నాడు.ఇటీవల ముంబైలోని బికేసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న కోహ్లి.. తాజాగా జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న వీడియో షేర్ చేశాడు. వెయిట్ లిఫ్టింగ్‌తో పాటు... కఠిన వ్యాయామాలు పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించేందుకు కష్టపడుతున్నాడు.
చదవండి: జిమ్‌లో చెమటోడుస్తున్న కోహ్లి.. వీడియో వైరల్! కింగ్.. ఒక్క సెంచరీ ప్లీజ్!
Andre Russell: 'బలిపశువులా బస్సు కిందకు తోయాలనుకుంటున్నారు!'
Comments
Please login to add a commentAdd a comment