మానసిక ఆందోళనతో బాధపడ్డా: శ్రుతిహాసన్‌ | I Suffer From Anxiety Says Shruti Haasan | Sakshi
Sakshi News home page

మానసిక ఆందోళనతో బాధపడ్డా: శ్రుతిహాసన్‌

Published Sat, Aug 1 2020 8:05 PM | Last Updated on Sat, Aug 1 2020 8:51 PM

I Suffer From Anxiety Says Shruti Haasan - Sakshi

హైదరాబాద్‌: నగరంలో స్టార్‌ హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ వ్యాయామం చేస్తు ఆశ్చర్యపరిచింది. గత కొంత కాలంగా సినిమాలకు విరామం ప్రకటించిన శ్రుతిహాసన్‌ తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తన నివాసానికి సమీపాన రన్నింగ్‌ చేస్తు కనిపించింది. సాయంత్రం రన్నింగ్‌ చేయడం వల్ల శారీరక, భావోద్వేగ నియంత్రణ సామర్థ్యం పెరుగుతుందని శ్రుతి హాసన్‌ అభిప్రాయపడింది. ఇటీవల తాను మానసిక ఆందోళన సమస్యతో బాధపడ్డాడని, నిరంతర వ్యాయామంతో అధిగమించానని తెలిపింది. తానెప్పుడు శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తానని, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరమని పేర్కొంది.

తాను మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నానని, ఫైటింగ్‌ అంటే చాలా ఇష్టమని తన అభిరుచిని వ్యక్త పరిచింది. స్వతహాగా పాటలు పాడే శ్రుతి హాసన్‌ లాక్‌డౌన్‌ సమయంలోను సొంతంగా పాటలు రాశానని తెలిపింది. లాక్‌డౌన్‌లో సొంతంగా వంటలు వండానని, మాస్క్‌లను తయారు చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్‌’ చిత్రంలో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. లాక్‌డౌన్‌ వల్ల ఈ సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. శ్రుతి హీరోయిన్‌గా మాత్రమే కాకుండా గాయనిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా విభిన్న కోణాలతో తన అభిమానులను మెప్పించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement