రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్టుల సమగ్రతను పెంచడమే లక్ష్యంగా భారతదేశపు అగ్రగామి సంస్థ టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. కొత్తగా 60 పైగా ప్రయోజనాలను అందించే అయిదు రైడర్లను ఆవిష్కరించింది. వైద్య ఖర్చులు పెరుగుతూ, ఆరోగ్య సంరక్షణ అవసరాలు మారుతున్న నేపథ్యంలో ఆరోగ్యం మీద తలెత్తుతున్న సరికొత్త ఆందోళనలు, జీవన విధానాల్లో మార్పుల సమస్యలను పరిష్కరించేలా ఈ రైడర్లు వ్యక్తిగత అవసరాలకు అనుగణంగా డిజైన్ చేశారు.
కస్టమర్లకు వినూత్నమైన, సందర్భోచితమైన సొల్యూషన్స్ అందించడం ద్వారా ఆరోగ్య బీమా రంగంలో పురోగతి సాధించడంపై టాటా ఏఐజీకి గల నిబద్ధతకు ఈ ఆవిష్కరణలు నిదర్శనంగా నిలుస్తాయి. కంపెనీ ఆవిష్కరించిన కొత్త రైడర్లలో మెంటల్ వెల్‌బీయంగ్, ఎంపవర్‌హర్, ఓపీడీ కేర్, క్యాన్‌కేర్, ఫ్లెక్సీ షీల్డ్ ఉన్నాయి. ఇవి మానసిక ఆరోగ్యం, మహిళల ఆరోగ్యం, క్యాన్సర్ కేర్ వంటి క్రిటికల్ హెల్త్‌కేర్ అవసరాలను తీర్చేవిగా రూపొందాయి.
ఎంపవర్‌హర్ రైడర్ అనేది మహిళల్లో వంధ్యత్వం, పీసీవోఎస్, ఇతరత్రా జననేంద్రియ సమస్యల్లాంటి వాటికి సమగ్రమైన పరిష్కారం అందించడం లక్ష్యంగా తయారైంది. ఇక మెంటల్ వెల్‌బీయింగ్ అనేది పరిశ్రమలోనే తొలిసారిగా మెంటల్ హెల్త్ ప్రివెంటివ్ స్క్రీనింగ్స్ అండ్ రీహాబిలిటేషన్ కవరేజీని అందిస్తుంది. క్యాన్‌కేర్ రైడర్ అనేది క్యాన్సర్ సంబంధ రక్షణ కల్పిస్తుంది. పెరుగుతున్న వైద్య వ్యయాలు, రోజువారీ ఆరోగ్య ఖర్చుల నుంచి కస్టమర్లకు రక్షణ కల్పించే విధంగా ఓపీడీ కేర్, ఫ్లెక్సీ షీల్డ్ అనేవి ఉంటాయి.
మెరుగ్గా క్లెయిమ్స్ ప్రక్రియ
కస్టమర్ల నమ్మకాన్ని పెంచడానికి కీలకమైన క్లెయిమ్స్ సెటిల్మెంట్ ప్రక్రియను టాటా ఏఐజి గణనీయంగా మెరుగుపరుచుకుంది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 67.7 శాతంగా ఉన్న క్యాష్‌లెస్ క్లెయిమ్స్ వినియోగం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 76.95 శాతానికి పెరిగింది. 96 శాతం క్యాష్‌లెస్ క్లెయిమ్స్ నాలుగు గంటల్లోనే ప్రాసెస్ చేస్తున్నారు. 85 శాతం రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లు అయిదు రోజుల వ్యవధిలోగానే సెటిల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో అంతటా క్యాష్‌లెస్ విధానాన్ని 100% అమలు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
కస్టమర్లకు సంతృప్తికరంగా సేవలు అందించడం, సమర్ధమైన పనితీరు విషయాల్లో పరిశ్రమలోనే కొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ వేగవంతమైన, నిరాటంకమైన విధంగా సేవలు అందించడంలో టాటా ఏఐజీకి గల నిబద్ధతకు ఈ మెరుగుదలలు నిదర్శనంగా నిలుస్తాయి.
నెట్‌వర్క్ విస్తరణ
దేశవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు టాటా ఏఐజి తన నెట్‌వర్క్‌ను గణనీయంగా విస్తరించింది.
గడిచిన 18 నెలల్లో 64 శాతం మేర పెంచుకోవడం ద్వారా భారతదేశవ్యాప్తంగా 11,700 పైచిలుకు నెట్‌వర్క్ హాస్పిటల్స్‌తో టాటా ఏఐజీ తన కార్యకాలాపాలు విస్తరించింది. ముఖ్యంగా సేవలు అంతగా అందని ప్రాంతాల్లో కూడా సర్వీసులను విస్తరించేందుకు కట్టుబడి ఉంది. 5,000 మంది కంటే ఎక్కువ డాక్టర్లు, 3,000 పైగా డయాగ్నోస్టిక్ ప్రొవైడర్లు గల ఓపీడీ నెట్‌వర్క్ అనేది 10 పైగా భాషల్లో పటిష్టమైన టెలీకన్సల్టేషన్ సర్వీసు మద్దతుతో కస్టమరుకు మరింత సౌకర్యవంతంగా సమగ్రమైన హెల్త్‌కేర్ కవరేజీ అందేలా తోడ్పడుతోంది.
ఆరోగ్య బీమా విభాగంలో వేగవంతమైన వృద్ధిని సాధించే దిశగా మా వ్యూహంలో భాగంగా ఈ రైడర్లు ఆవిష్కరించాము. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో విస్తరించడంపై మేము మరింతగా దృష్టి పెడుతున్నాం. ఈ ప్రాంతాల్లో హెల్త్‌కేర్ యాక్సెస్, అవగాహన వేగంగా పెరుగుతోంది. మా శాఖల నెట్‌వర్క్, ఏజంట్లు, హాస్పిటల్ భాగస్వాముల సంఖ్యను పెంచుకోవడం ద్వారా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను మరింత మందికి అందుబాటులోకి తేవాలని మేము నిర్దేశించుకున్నాం. ఆరోగ్య బీమా విభాగంలో ఇదే మా వృద్ధి అంచనాలకు తోడ్పడనుందని టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & హెడ్-ఏజెన్సీ ప్రతీక్ గుప్తా అన్నారు.
220 ప్రాంతాల్లో, 11,700+ ఆస్పత్రుల నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరిస్తూనే ఆరోగ్య బీమా రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రవేశపెట్టేందుకు టాటా ఏఐజీ కట్టుబడి ఉంది.
రైడర్ల ప్రత్యేకతలు
ఎంపవర్‌హర్: పీసీవోఎస్, వంధ్యత్వం, గైనకాలజీ అంశాలు, మహిళల్లో వచ్చే క్యాన్సర్లతో పాటు మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు సమగ్రమైన కవరేజీనిచ్చే విధంగా ఈ రైడర్ తయారైంది. సర్వికల్ క్యాన్సర్ టీకాల్లాంటి ప్రివెంటివ్ కేర్ కవరేజీలను కూడా ఇది అందిస్తుంది.
మెంటల్ వెల్‌బీయింగ్: ముందస్తుగానే గుర్తించి, సకాలంలో చికిత్సను అందించడంలో తోడ్పడే విధంగా, పరిశ్రమలోనే తొలిసారిగా ప్రివెంటివ్ మెంటల్ హెల్త్ స్క్రీనింగ్స్, సైకలాజికల్ థెరపీ, రీహ్యాబిలిటేషన్ సర్వీసులు సహా మానసిక ఆరోగ్య సమస్యలకు కవరేజీని అందిస్తుంది.
క్యాన్‌కేర్: నిర్దిష్ట తీవ్రత గల క్యాన్సర్ ఉన్నట్లుగా వైద్యపరీక్షల్లో వెల్లడైన పక్షంలో సమ్ ఇన్సూర్డ్‌ను ఏకమొత్తంగా చెల్లించే విధంగా విస్తృతమైన క్యాన్సర్ కవరేజీని అందిస్తుంది.
ఓపీడీ కేర్: డాక్టర్ కన్సల్టేషన్స్, డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ బిల్లులు, కంటి చూపు సంరక్షణ వంటి అవుట్‌పేషంట్ ఖర్చులకు కవరేజీనిస్తుంది. తద్వారా రోజువారీ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చుకోవడంలో తోడ్పాటు అందిస్తుంది.
ఫ్లెక్సీ షీల్డ్: వైద్యపరమైన ద్రవ్యోల్బణం నుంచి పాలసీదార్లకు రక్షణ కల్పించే విధంగా డిజైన్ చేశారు. రిస్టోర్ ఇన్ఫినిటీ+ ద్వారా సమ్ ఇన్సూర్డ్‌ను అపరిమితంగా రిస్టోర్ చేస్తుంది. అలాగే ఇన్‌ఫ్లేషన్ షీల్డ్ కింద సమ్ ఇన్సూర్డ్ పెంపుదలతో పెరిగే వైద్య వ్యయాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇంటర్నేషనల్ సెకండ్ ఒపీనియన్, ప్రీ-ఎగ్జిస్టింగ్ వ్యాధి/వ్యాధులకు డే 31 కవరేజీ, ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్ క్యాష్‌తో పాటు మరెన్నో ప్రీమియం ప్రయోజనాలను అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment