ప్రతీకాత్మక చిత్రం
స్త్రీల ఇంటిపనికి ఎలాంటి గుర్తింపు, వేతనం ఉండదు. ఇదే విషయమై సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఒక అధ్యయనం చేసింది. పేద, ధనిక దేశాలలోనూ ఈ విషయంలో అంతరాలనూ చూపించింది. గుర్తింపు లేని పని కారణంగా స్త్రీలలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు, ఇంటి పనితో పాటు ఉపాధి పొందుతున్న మహిళలపై పడుతున్న అధిక భారం గురించి కూడా చేసిన ఈ అధ్యయనం అన్నివర్గాల వారినీ ఆలోచింపజేస్తోంది.
ఇంటి పనులు, బాధ్యతలను సమతుల్యం చేయడం మహిళల నైతిక బాధ్యతగా అంతటా వాడుకలో ఉన్నదే. దీని వల్ల కలుగుతున్న నష్టాలనూ, భాగస్వామ్యంతో ఎలా సమన్వయం చేసుకోవాలో కూడా ఈ సంస్థ తెలిపింది.
తేలిక భావన
మహిళకు ఉదయం లేస్తూనే ఒక సాధారణ రోజుగా ప్రారంభమవుతుంది. ఊడవడం, తుడవడం, కడగడం, కుటుంబ సభ్యులకు భోజనం సిద్ధం చేయడం... ఈ రొటీన్ పనులన్నీ వీటిలో ఉండవచ్చు. వీటన్నింటి మధ్య వారు తమ భర్త లేదా పిల్లలు లేదా పెద్దలైన కుటుంబ సభ్యుల అవసరాలను చూస్తుంటారు. ఇక బయట ఉద్యోగం చేసే మహిళలైతే, ఇంటి పనులు పూర్తిచేయడంతో పాటు తమను తాము సిద్ధంగా ఉండటానికి సమయం కేటాయించాలి. ఆఫీస్ లోకి వచ్చాక ఆఫీస్ వర్క్ తో ముడిపడి ఉండాలి. పిల్లలు స్కూల్‌కి వెళ్లాక, భర్త ఆఫీసుకు వెళ్లినప్పుడు గృహిణులు ఊపిరి పీల్చుకోవడం లేదు. చేయాల్సింది చాలా ఉంటుంది. ఇంటి పనులను చూసుకోవడం, చేయడం మహిళలు మాత్రమే చేయదగినపనిగా పరిగణించబడుతోంది. దీనిని దాదాపు అందరూ స్త్రీలను తేలికగానే తీసుకుంటారు. ‘కాలక్రమేణా, వేతనంలేని శ్రమ కారణంగా పురుషుల కంటే స్త్రీలు మానసిక ఆందోళనకు గురవుతున్నార’ని హెల్త్ షాట్స్ సైకాలజిస్ట్ డాక్టర్ మాలినీ సబా తెలియజేస్తున్నారు.
డబుల్ బైండ్
ఇంటి యజమానులుగా గుర్తించే మగవారు కార్యాలయంలో పెద్దగా పనులు చేయనప్పటికీ వారు చాలా బిజీగా ఉంటారు. కానీ ఇంటిపని, పిల్లల సంరక్షణతో సహా వేతనంలేని పనికి ఉపాధి పొందుతున్న మహిళలు బాధ్యత వహిస్తారు. డాక్టర్ సబా ప్రకారం, ‘గుర్తించబడని మహిళల శ్రమ రెండు రూపాలుగా ఆమెను సవాల్ చేస్తోంది. ఒకటి ఆమె శారీరక ఆరోగ్య సంరక్షణ తగ్గుతోంది. దీంతో పాటు మానసిక భారం అధికమవుతోంది.’
అసమానతకు నిదర్శనం
ప్రపంచవ్యాప్తంగా ఉపాధి, నిరుద్యోగ మహిళలు జీతం లేని పనికి ఎక్కువ గంటలు వెచ్చిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో ఈ ధోరణి మరీ ఎక్కువగా కనిపించింది. సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 2021లో పురుషుల 59 అదనపు గంటలతో పోలిస్తే మహిళలు 173 అదనపు గంటలు చెల్లింపు లేని ఇంటిపని, పిల్లల సంరక్షణ బాధ్యతలను తీసుకున్నారు. దిగువ, మధ్య ఆదాయ దేశాలలో ఈ అంతరం మరింత పెరిగింది. ఈ దేశాలలో మహిళలు పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువ గంటలు ఇల్లు, పిల్లలను చూసుకున్నారు.
భారాన్ని పెంచిన వర్క్ ఫ్రమ్ హోమ్
ఇంటి నుండి ఆఫీసు పని చేయడం చాలా మంది మహిళల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. మహిళలు వంట చేయడం, శుభ్రపరచడం, పిల్లలు, పెద్దవారిని చూసుకోవడం.. వంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. ఇంటి నుండి ఆఫీసు పని చేయడం అనేది చాలా మందికి కష్టతరమైనది. దాంతో ఎంతో సమయాన్ని కోల్పోతున్నారు. దీనివల్ల స్త్రీలకు ఏ విధమైన వినోదం, విశ్రాంతి లేదా కోలుకోవడానికి సమయం దొరకడం లేదు. శారీరక, మానసిక వేధింపుల కథనాలలో ఒకటైన వైద్యం అందుబాటులో లేకపోవడం కూడా సమతుల్యత దెబ్బతింటుంది. మహమ్మారి సమయంలో పరిమిత ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సంరక్షణ సవాళ్లు, పిల్లల సంరక్షణ లేకపోవడం వల్ల చాలా మంది మహిళలు తమ కుటుంబాలను చూసుకోవడం కోసం తమ వృత్తిని విడిచిపెట్టారని నిపుణులు గుర్తించారు. ఇది ముఖ్యంగా నెలవారీ తక్కువ ఆదాయం కలిగిన తల్లులలో ఎక్కువగా ఉంది. (క్లిక్ చేయండి: తక్కువ బడ్జెట్‌లో ఇంటి అలంకరణ.. వావ్ అనాల్సిందే!)
న్యాయమైన వాటా
పురుషులు ఇల్లు, పిల్లల పనుల్లోనూ వారి న్యాయమైన వాటాను తీసుకుంటే మహిళలపై చెల్లింపు లేని పని భారం తగ్గుతుంది. కలిసి పనులు చేసుకోవడంలోని అన్యోన్యత స్త్రీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది వారి ఆదాయ వనరుల అవకాశాలను కూడా పెంచుతుంది. భావోద్వేగ ఒత్తిడి కూడా తగ్గుతుంది. పురుషులకు అనువైన ఏర్పాట్లను సాధారణం చేస్తే, పితృస్వామ్య, పెట్టుబడిదారీ డిమాండ్లను చర్చించడంలో స్త్రీలకు సమయం కలిసివస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment