బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ అత్యంత ప్రతిభావంతమైన హీరోల్లో ఒకరు. `యూరి` లాంటి సంచలన మూవీతో ఒక్కసారిగా అతడి పేరు మారుమ్రోగిపోయింది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి వారి మనుసులను గెలుచుకున్నాడు. నిజానికి విక్కీ ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్‌ని సంపాదించుకోలేదు. అతను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా కష్టాలు పడ్డాడు. ఆ క్రమంలో ఆందోళన(యాంగ్జయిటీ), అభద్రతభావానికి గురయ్యేవాడనని చెప్పుకొచ్చాడు విక్కీ. అయితే దాన్ని ఏవిధంగా హ్యాండిల్ చేయాలో ఓ సీనియర్ నటుడు తనకు మంచి సలహ ఇచ్చారని అన్నారు. ఇంతకీ ఏంటా సలహా అంటే..
నటన, డ్యాన్స్ పరంగా విక్కీ కౌశల్ చాలా టాలెంటెడ్ హీరో. ఏ పని అయినా చాలా పర్ఫెక్ట్‌గా చేస్తాడు. కెరీర్‌లో హీరోగా ఎదుగుతున్న సమయంలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలో తాను ఆందోళనకు గురయ్యేవాడనని అన్నారు. అయితే దాన్ని హ్యాండిల్ చేయడంపై ఓ సీనియర్ నటుడు ఇచ్చిన సలహను తూచాతప్పకుండా పాటిస్తానని అన్నారు. అదేంటంటే..
ఆందోళనను ఎలా మ్యానేజ్ చేయాలంటే..
మనకు ఆందోళన లేదా యాంగ్జయిటీని ఫేస్ చేస్తున్నప్పుడూ దానని మంచి స్నేహితుడిగా మార్చుకుండి. మీరు ఏ విషయమై ఆందోళన చెందుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆందోళన అనేది ఎప్పుడు కలుగుతుందంటే.. ఒక పనిలో సరైన టాలెంట్ లేకపోవడం లేదా ఏదైన బలహీనత కారణంగా ఎదురవ్వుతుంది. కాబట్టి ముందుగా అందులో మంచి నైపుణ్యం సాధించండి ఆటోమేటిగ్గా ఆందోళన మీకు దాసోహం అవుతుందని చెబుతున్నాడు నటుడు విక్కీ.
అంతేగాదు ఆందోళనను అధిగమించాలంటే ముందుగా మన బలహీనతల్ని మనస్ఫూర్తిగా అంగీకరించాలి, దాంట్లో ప్రావీణ్యం సాధించే యత్నం చేయాలి. అప్పుడు ఆందోళన, ఒత్తిడి వంటివి మన దరిచేరవని అన్నారు . ఇలా మానసిక ఆరోగ్యం గురించి విక్కీ మాట్లాడటం తొలిసారి కాదు. గతంలో ఓ టీవీ షోలో కాలేజ్ టైంలో తాను ఎలా ఆత్యనూన్యతతో బాధపడ్డాడో షేర్ చేసుకున్నారు.
అంతేగాదు తన ఫిజికల్ అపీరియన్స్ పట్ల ఎలా ఆందోళన చెందిందే, అవన్నీ తన మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేశాయో వివరించడమే గాక తన అభిమానులకు మానసిక ఆరోగ్యంపై స్ప్రుహ కలిగిస్తున్నాడు.
(చదవండి: అమితాబ్ బచ్చన్ 'గోల్డెన్ రూల్ ఆఫ్ పేరెంటింగ్'!)
Comments
Please login to add a commentAdd a comment